Shiva Prajapati

Shiva Prajapati

Sub-Editor - TV9 Telugu

shiva.oruganti@tv9.com

తెలుగు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో 10 సంవత్సరాల అనుభవం. 2013లో ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో సబ్ ఎడిటర్‌గా జర్నలిస్ట్ కెరీర్ ప్రారంభం. ప్రస్తుతం టీవీ9 తెలుగు డిజిటల్‌లో సబ్ ఎడిటర్‌. అంతకుముందు.. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డిజిటల్‌ నెట్‌వర్క్‌లో సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వహించడం జరిగింది.

Read More
Chandrayaan 3 Return: చంద్రయాన్ 3 మళ్లీ భూమిపైకి వస్తుందా? 14 రోజుల తర్వాత విక్రమ్, ప్రజ్ఞాన్ పరిస్థితి ఏంటి?

Chandrayaan 3 Return: చంద్రయాన్ 3 మళ్లీ భూమిపైకి వస్తుందా? 14 రోజుల తర్వాత విక్రమ్, ప్రజ్ఞాన్ పరిస్థితి ఏంటి?

ప్రస్తుతం ప్రపంచంలో ఏం నడుస్తోంది? అంటే.. చంద్రయాన్ 3 టాపిక్ నడుస్తోందని కరాఖండిగా చెబుతారు ఎవరైనా. అవును, మరి.. భారత్ సాధించిన అతిపెద్ద విజయం ఇది. ప్రతి భారతీయుడు గర్వంగా మీసం మెలేసే ప్రయోగం ఇది. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్‌ను సేఫ్‌గా దించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా ఇస్త్రో శాస్త్రవేత్తలు.. చంద్రుడిపై ఉన్న ఖనిజ నిక్షేపాలు, అక్కడి వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేయనున్నారు. రోవర్ ప్రజ్ఞాన్ పంపించనున్న..

Tribal University Inauguration: కేంద్ర గిరిజన యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సీఎం జగన్..

Tribal University Inauguration: కేంద్ర గిరిజన యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సీఎం జగన్..

అల్లూరు సీతారామారాజు నడిచిన ఈ పవిత్ర నేలపై గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వలన గిరిజనుల భవిష్యత్‌ అద్భుతంగా మారుతుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న కేంద్ర గిరిజన యూనివర్సిటీకి శుక్రవారం నాడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఏపీ సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం దత్తిరాజేరు మండలం మరడాం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్రమంత్రి, సీఎం ఇద్దరూ ప్రసంగించారు. ముందుగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ..

Optical Illusions: కట్టెల మధ్య గప్‌చుప్‌గా దాగున్న పిల్లి.. 10 సెకన్లలో కనిపెడితే ఖతర్నాక్‌లే అంటోంది..!

Optical Illusions: కట్టెల మధ్య గప్‌చుప్‌గా దాగున్న పిల్లి.. 10 సెకన్లలో కనిపెడితే ఖతర్నాక్‌లే అంటోంది..!

కొన్ని సందర్భాల్లో కీటకాలు, పురుగులు, పాములు వంటివి మట్టి రంగులో కలిసిపోయి ఉంటాయి. వాటిని గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. మన కంటివి అవి కట్టెపుల్లల మాదిరిగానో, మరేదో క్లాత్స్ మాదిరిగానో.. కనిపిస్తాయి. చెత్త అనుకుని వాటిని తీసిపడేయాలని చూస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. ఒక్కోసారి ఇవి ప్రమాదకరంగా మారుతాయి కూడా. ఈ భ్రమ కారణంగా మనం వాస్తవాన్ని గుర్తించలేక ఇబ్బందులు పడుతుంటాయి. ఇక రియాల్టీ మాదిరిగానే.. కొన్ని ఆప్టికల్ ఇల్యూజన్ పిక్స్ కూడా ఉంటాయి. ఈ ఫోటోలో మనకు అంతా తెలిసినట్లే ఉంటుంది. కానీ, అందులోనూ నిగూఢ రహస్యం దాగి ఉంటుంది.

Vivek Ramaswamy vs Nikki Haley: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో భారతీయులు.. నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి మధ్య వాగ్వాదం..

Vivek Ramaswamy vs Nikki Haley: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో భారతీయులు.. నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి మధ్య వాగ్వాదం..

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన భారత సంతతికి చెందిన బిలియనీర్ వివేక్ రామస్వామి.. వరుసపెట్టి ఇంటర్వ్యూలు, ర్యాలీలు, డిబేట్లతో ఆయన తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తాజాగా జరిగిన తొలి రిపబ్లికన్ ప్రైమరీ డిబేట్‌లోనూ ఆయన సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఎనిమిది మంది రిపబ్లికన్ అభ్యర్ధులు విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో రెండు గంటల పాటు తలపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధం, డొనాల్డ్ ట్రంప్, వాతావరణ మార్పులపై చేసిన వ్యాఖ్యలతో వివేక్ చాలా మంది దృష్టిని ఆకర్షించారు. అధ్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న వివేక్ రామస్వామి తన వాగ్ధాటితో ప్రత్యర్ధులను సులభంగా..

Telangana: వరంగల్‌లో ఉదయాన్నే భారీ భూకంపం.. భయంతో వణికిపోయిన జనాలు..

Telangana: వరంగల్‌లో ఉదయాన్నే భారీ భూకంపం.. భయంతో వణికిపోయిన జనాలు..

వరంగల్, మణుగూరులో ఇవాళ తెల్లవారుజామున 4.43 గంటలకు స్వల్పంగా భూమి కంపించింది. పాత మణుగూరు, శేషగిరి నగర్, బాపన కుంట, శివలింగాపురం, విట్టల్ రావు నగర్, రాజుపేట ప్రాంతంలో భూమి కంపించింది. ఒక్కసారిగా వచ్చిన భూ ప్రకంపనలతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. కాగా, గత వారం రోజుల వ్యవధిలోనే మణుగూరులో రెండుసార్లు భూమి కంపించింది. ఇలా వరుస ప్రకంపనలు వస్తుండటంతో జనాలు భయపడిపోతున్నారు. ఏం జరుగుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగష్టు 25న తెల్లవారుజామున..

PM Narendra Modi: దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి తెలంగాణ కళాఖండాన్ని గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ..

PM Narendra Modi: దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి తెలంగాణ కళాఖండాన్ని గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ..

దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు హాజరైన సందర్భంగా ప్రధాని న‌రేంద్ర మోడీ.. సమ్మిట్ అనంతరం ఆయా దేశాల నేతలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే.. బ్రిక్స్ సమ్మిట్ ఆతిథ్య దేశమైన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా‌తోనూ భేటీ అయ్యారు ప్రధాని. ఈ సందర్భంగా మన దేశానికి చెందిన, అతి పురాతన, ప్రాముఖ్యత కలిగిన భారతీయ కళాఖండాలను రమాఫోసాకు బహుకరించారు. నాగాలాండ్ శాలువగా, తెలంగాణకు చెందిన బిద్రి పూస, గోండ్ పెయింట్స్‌ను బహుకరించారు ప్రధాని మోదీ.

AP SI Physical Events Dates 2023: రేపటి నుంచే ఎస్సై అభ్యర్థుల ఫిజికల్ టెస్ట్.. అధికారులు చెబుతున్న సూచనలివే..

AP SI Physical Events Dates 2023: రేపటి నుంచే ఎస్సై అభ్యర్థుల ఫిజికల్ టెస్ట్.. అధికారులు చెబుతున్న సూచనలివే..

స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ ఎస్ఐల పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం జోన్‌కు సంబంధించి ఎస్సై ఉద్యోగాల కోసం ఈనెల 25 నుంచి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన 17,374 మంది అభ్యర్ధులకు ఆగష్టు 25 నుండి సెప్టెంబర్ 23 వరకు ఫిజికల్ మెజర్మెంట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి, బందోబస్తు నిమిత్తం వచ్చిన పోలీసు అధికారులకు పలు సూచనలు చేసి,

Morning Detox Drink: ప్రతి రోజూ ఉదయాన్నే ఈ నీటిని ఒక గ్లాస్ తాగండి.. హెల్త్ బెనిఫిట్స్ చూసి అవాక్కవుతారు..!

Morning Detox Drink: ప్రతి రోజూ ఉదయాన్నే ఈ నీటిని ఒక గ్లాస్ తాగండి.. హెల్త్ బెనిఫిట్స్ చూసి అవాక్కవుతారు..!

Health Tips: ఇటీవలి కాలంలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. వీలైతే వాకింగ్, జిమ్, యోగా చేస్తున్నారు. ఒక వేళ సమయం లేకపోతే.. తినే ఆహారాలతోనే ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే చాలా మంది ఉదయాన్నే నీళ్లు తాగడం, అల్పాహారంగా మంచి ఫ్రూట్స్ తీసుకోవడం చేస్తుంటారు. దీనికారణంగా వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Gas Stove Cleaning Tips: గ్యాస్ బర్నర్‌పై జిడ్డు మరకలు అస్సలు వదలడం లేదా? ఇలా చేస్తే తళుక్కున మెరిసిపోతుంది..

Gas Stove Cleaning Tips: గ్యాస్ బర్నర్‌పై జిడ్డు మరకలు అస్సలు వదలడం లేదా? ఇలా చేస్తే తళుక్కున మెరిసిపోతుంది..

Gas Stove Cleaning Tips: గతంలో చాలా ఇళ్లలో కట్టెల పొయ్యిపైనే వంటలు చేసుకునే వారు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దాదాపుగా అందరి ఇళ్లలోనూ గ్యాస్ పొయ్యి ఉంది. అయితే, కట్టెల పొయ్యిపై వంట చేసినప్పుడు మరకలు పడినట్లుగానే.. గ్యాస్ స్టౌవ్ పై వంట చేసినా మరకలు పడుతుంది. స్టౌవ్ బర్నర్ చుట్టూ నూనె, ధూళి పేరుకుపోతాయి. జిడ్డు మరకలతో చూడటానికి అసహ్యంగా తయారవుతాయి. ఈ మరకలను తొలగించడం పెద్ద టాస్క్. దీనిని క్లీన్ చేయడానికి వారానికి ఒకసారి ప్రత్యేకంగా టైమ్ కేటాయించాల్సి ఉంటుంది. అయితే, ఈ గ్యాస్ బర్నర్‌లు సులభంగా, కొత్త వాటిలా కనిపించేలా ఏం చేయాలి? ఇందుకు అనుసరించాల్సిన టిప్స్ ఎంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Andhra Pradesh: బ్రాండెడ్ మధ్యం కోసం సుప్రీంకోర్టు సీజేకు ఫిర్యాదు.. పాదయాత్ర చేస్తామంటూ వార్నింగ్..!

Andhra Pradesh: బ్రాండెడ్ మధ్యం కోసం సుప్రీంకోర్టు సీజేకు ఫిర్యాదు.. పాదయాత్ర చేస్తామంటూ వార్నింగ్..!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ మద్యం బ్రాండ్స్‌తో పాటు.. కొత్త కొత్త బ్రాండ్లకు చెందిన మద్యాన్ని కూడా విక్రయిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మద్యం బ్రాండ్లపై కొంత కాలంగా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఓ మందుబాబు ఓ అడుగు ముందుకేశాడు. మందుబాబుల ఆరోగ్యం బాగుకోసం.. తానే యుద్ధం చేస్తానంటూ సమరశంఖం పూరించాడు. రావడం రావడంతోనే.. భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశాడు. మాకు ఈ మందు వొద్దు..

Andhra Pradesh: సంక్షేమ పథకాల విషయంలో స్పీడ్ పెంచిన సర్కార్.. వారికి గుడ్ చెప్పిన సీఎం జగన్..

Andhra Pradesh: సంక్షేమ పథకాల విషయంలో స్పీడ్ పెంచిన సర్కార్.. వారికి గుడ్ చెప్పిన సీఎం జగన్..

సంక్షేమ కార్యక్రమాల్లో వెనకడుగు వేసేదేలేదని మరోసారి నిరూపించింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. జనవరి నుంచి జూలై వరకూ పెన్షన్లతోపాటు వివిధ పథకాల కింద ప్రజలకు అందాల్సిన నిధుల మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులై ఉండి.. ఏదైనా కారణంతో లబ్ధి కోల్పోయినవారికి అవకాశం కల్పించగా.. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి 216 కోట్లను ప్రజల ఖాతాల్లో జమ చేశారు ముఖ్యమంత్రి జగన్. ఈ సందర్భంగా.. అధికారమంటే అజమాయిషీ కాదు..

Smart Phone: మీ వద్ద పాత స్మార్ట్‌ ఫోన్ ఉందా? దాన్ని ఇలా చేస్తే అద్భుతాన్ని చూస్తారు..!

Smart Phone: మీ వద్ద పాత స్మార్ట్‌ ఫోన్ ఉందా? దాన్ని ఇలా చేస్తే అద్భుతాన్ని చూస్తారు..!

ప్రతిరోజూ ఏదో ఒక అప్‌డేట్, ఫీచర్స్‌తో కొత్త కొత్త ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తుంటాయి. స్మార్ట్ ఫోన్ ప్రియుడు ఆ కొత్త ఫీన్లను, కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఫీచర్లను ఉపయోగించేందుకు వెంటనే కొత్త ఫోన్‌ను కొనుగోలు చేస్తారు. ఇందుకోసం తమ పాత ఫోన్‌ను మూలన పడేయం గానీ, సెకండ్ హ్యాండ్‌గా విక్రయించడం గానీ చేస్తుంటారు. ఇక మరికొందరు తమ ఫోన్‌ పాడైపోవడం వల్లనో, ఎక్కువ కాలం దానిని వాడటం వల్లనో దానిని పక్కకు పడేసి కొత్త ఫోన్‌ను కొనుగోలు చేస్తారు.