Morning Detox Drink: ప్రతి రోజూ ఉదయాన్నే ఈ నీటిని ఒక గ్లాస్ తాగండి.. హెల్త్ బెనిఫిట్స్ చూసి అవాక్కవుతారు..!

Health Tips: ఇటీవలి కాలంలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. వీలైతే వాకింగ్, జిమ్, యోగా చేస్తున్నారు. ఒక వేళ సమయం లేకపోతే.. తినే ఆహారాలతోనే ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే చాలా మంది ఉదయాన్నే నీళ్లు తాగడం, అల్పాహారంగా మంచి ఫ్రూట్స్ తీసుకోవడం చేస్తుంటారు. దీనికారణంగా వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

|

Updated on: Aug 24, 2023 | 9:45 PM

1 / 6
వాస్తవానికి నేటి ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది ప్రజలు ఇంటి భోజనానికి దూరం అవుతున్నారు. బయటి ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నారు. అంటే ప్రాసెస్‌డ్ ఫుడ్, జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ అధికంగా తింటున్నారు. ఫలితంగా స్థూలకాయం, అధిక బరువు, మధుమేహం వంటి ఇతర సమస్యల బారిన పడుతున్నారు. చెడు జీవనశైలి కారణంగా.. శరీరంలో వ్యర్థ పదార్థాలు భారీగా పెరుకుపోవడంతో వ్యాధుల నిలయంగా మారుతున్నారు. మరి శరీరంలో ఈ వ్యర్థ పదార్థాలను బయటపంపించే డ్రింక్ గురించి ఇవాళ మనం తెలుసుకుందాం..

2 / 6
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటితో రోజును ప్రారంభించాలని ఆయుర్వేదం సూచిస్తుంది. అయితే, ఈ నీళ్లలోనూ అజ్వైన్, వామును కలిపి తాగితే మరింత ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. క్రమ రహిత పీరియడ్స్‌తో ఇబ్బంది పడేవారు.. వామును మరిగించిన నీటిని ప్రతి రోజూ ఉదయం తాగడం వలన రుతుక్రమం సక్రమంగా జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.

3 / 6
క్రమం తప్పకుండా వామును తిన్నా.. వాము నీటిని తాగినా అనేక వ్యాధుల నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు గురికాకుండా ఉండొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. గ్యాస్, గుండెల్లో మంట, హర్మోన్ల సమస్యతో బాధపడేవారు.. ఈ వాము మరిగించిన నీటిని రోజూ తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.

4 / 6
అధిక బరువు సమస్యతో బాధపడేవారు.. ఈ స్థూలకాయాన్ని నివారించడానికి వాము వాటర్ అద్భుతంగా పని చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఒత్తిడి, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ సహా అనేక వ్యాధులు నియంత్రణలో ఉంటాయని చెబుతున్నారు. శరీరంలో అదనపు కొవ్వును కూడా కరిగిస్తుంది. ఇక జలుబు, జ్వరం సమస్య నుంచి కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది. నీటిలో ఒక టీస్పూన్ వామును వేసి మరిగించి.. ఆ నీటిని తాగితే దగ్గు సమస్య కూడా క్రమంగా తగ్గిపోతుంది.

5 / 6
వాములో థైమోల్, కార్వాక్రోల్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఈ రెండు పదార్థాలు బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వంటి సూక్ష్మక్రిములపై పోరాడుతాయి. ఇక ఈ సీజన్‌లో వామును మరిగించిన నీటిని రోజూ ఉదయం తాగడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అన్నికంటే ముఖ్యంగా.. శరీరంలోని మలినాలు, వ్యర్థ పదార్థాలను బయటకు పంపించేస్తుంది ఈ వాము వాటర్ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

6 / 6
Follow us
Most Read Stories