Smart Phone: మీ వద్ద పాత స్మార్ట్‌ ఫోన్ ఉందా? దాన్ని ఇలా చేస్తే అద్భుతాన్ని చూస్తారు..!

ప్రతిరోజూ ఏదో ఒక అప్‌డేట్, ఫీచర్స్‌తో కొత్త కొత్త ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తుంటాయి. స్మార్ట్ ఫోన్ ప్రియుడు ఆ కొత్త ఫీన్లను, కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఫీచర్లను ఉపయోగించేందుకు వెంటనే కొత్త ఫోన్‌ను కొనుగోలు చేస్తారు. ఇందుకోసం తమ పాత ఫోన్‌ను మూలన పడేయం గానీ, సెకండ్ హ్యాండ్‌గా విక్రయించడం గానీ చేస్తుంటారు. ఇక మరికొందరు తమ ఫోన్‌ పాడైపోవడం వల్లనో, ఎక్కువ కాలం దానిని వాడటం వల్లనో దానిని పక్కకు పడేసి కొత్త ఫోన్‌ను కొనుగోలు చేస్తారు.

Smart Phone: మీ వద్ద పాత స్మార్ట్‌ ఫోన్ ఉందా? దాన్ని ఇలా చేస్తే అద్భుతాన్ని చూస్తారు..!
Digital Photo Frame With Smartphone Or Tab
Follow us

|

Updated on: Aug 24, 2023 | 8:26 PM

ఫోన్ తయారీ కంపెనీలు ప్రతిరోజూ ఏదో ఒక అప్‌డేట్, ఫీచర్స్‌తో కొత్త కొత్త ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తుంటాయి. స్మార్ట్ ఫోన్ ప్రియుడు ఆ కొత్త ఫీన్లను, కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఫీచర్లను ఉపయోగించేందుకు వెంటనే కొత్త ఫోన్‌ను కొనుగోలు చేస్తారు. ఇందుకోసం తమ పాత ఫోన్‌ను మూలన పడేయం గానీ, సెకండ్ హ్యాండ్‌గా విక్రయించడం గానీ చేస్తుంటారు. ఇక మరికొందరు తమ ఫోన్‌ పాడైపోవడం వల్లనో, ఎక్కువ కాలం దానిని వాడటం వల్లనో దానిని పక్కకు పడేసి కొత్త ఫోన్‌ను కొనుగోలు చేస్తారు. మరి పాత ఫోన్‌ను ఏం చేయాలి? అనే సందేహం కూడా వస్తుంటుంది. మీ ఫోన్‌ పాడైపోయినప్పటికీ.. దానిని మరో విధంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది ఆ ఫోన్. మరి పాత ఫోన్‌ను ఎలా వినియోగించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పాత ఫోన్‌ను వేరే గాడ్జెట్‌గా మార్చుకునే టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీ పాత, పనికిరాని స్మార్ట్ ఫోన్‌ను స్మార్ట్ ఫోటో ఫ్రేమ్‌గా మార్చుకోవచ్చు. మీ వద్ద టాబ్లెట్ ఉంటే.. ఇది మరింత అద్భుతంగా ఉంటుంది. అంటే, మీ టాబ్లెట్‌, స్మార్ట్‌ఫోన్‌ను డిజిటల్ ఫ్రేమ్‌గా మార్చుకోవచ్చు.

డిజిటల్ ఫోటో ఫ్రేమ్..

దీంతో అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, సాధారణ ఫోటో ఫ్రేమ్‌లో ఒకటి లేదా కొన్ని ఎంచుకున్న ఫోటోలను మాత్రమే పెట్టుకోవచ్చు. అయితే, ఈ డిజిటల్ ఫ్రేమ్‌లో ఎన్ని ఫొటోలు కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. ఈ ఫోటోలు ఎప్పటికప్పుడు ఆటోమేటిక్‌గా మారుతూ ఉంటాయి. iOS, Android రెండూ మీ స్మార్ట్ పరికరాన్ని డిజిటల్ ఫ్రేమ్‌గా మార్చడంలో మీకు సహాయపడే అనేక ఆప్షన్స్‌తో వస్తాయి.

పాత ఫోన్‌ని ఇలా డిజిటల్ ఫోటో ఫ్రేమ్‌గా మార్చుకోండి..

1. Google Play Store నుండి Photo-Digital Photo Frameని ఇన్‌స్టాల్ చేయండి. మీ iOS మొబైల్‌లో అయితే Live Frameని ఇన్‌స్టాల్ చేయండి.

2. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, అడిగిన విధంగా వివరాలను నమోదు చేయాలి.

3. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్‌పై కొంత ఫోటోను ఎంచుకోండి, దీనిలో మీరు ఫోన్ గ్యాలరీ లేదా క్లౌడ్ స్టోరేజ్ నుండి ఫోటోను కనెక్ట్ చేయవచ్చు.

4. ఫోటోలను ఎంచుకున్న తర్వాత, అందులో మీకు నచ్చిన మ్యూజిక్‌ను సెట్ చేసుకోవచ్చు.

5. ఇందులో, మీరు ఫోటో సమయాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. మీకు నచ్చిన మ్యూజిక్ వాల్యూమ్‌ను ఎంచుకోవచ్చు.

6. ఈ దశలన్నింటినీ అనుసరించిన తర్వాత, ఓకే పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పాత ఫోన్ కాస్తా డిజిటల్ ఫోటో ఫ్రేమ్‌గా మారిపోయింది. అయితే, ఈ ఫోన్‌(డిజిటల్ ఫ్రేమ్)ని ఎప్పటికప్పుడు ఛార్జింగ్ చేస్తూ ఉండండి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..