పప్పులో కాలేసిన మంత్రి.. చంద్రయాన్-3 గురించి మాట్లాడి అభాసుపాలు

పప్పులో కాలేసిన మంత్రి.. చంద్రయాన్-3 గురించి మాట్లాడి అభాసుపాలు

Phani CH

| Edited By: Vimal Kumar

Updated on: Jan 05, 2024 | 5:51 PM

యావత్ భారతదేశాన్ని ఎంతో ఉత్తేజపరిచింది చంద్రయాన్ 3 ప్రయోగం. చంద్రయాన్ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్.. చంద్రుడిపై దిగి అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌‌ పేరును చరిత్రలో లిఖించింది. ఈ ప్రయోగాన్ని దేశంలోని ప్రముఖులు, విద్యార్థులు, సామాన్య జనం ఎంతో ఉత్సాహం, ఉత్కంఠగా వీక్షించారు. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కావడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అయితే రాజస్థాన్‌కు చెందిన ఓ మంత్రి మాత్రం చంద్రయాన్‌ 3 ప్రయోగం గురించి మాట్లాడి విమర్శల పాలవుతున్నారు.

యావత్ భారతదేశాన్ని ఎంతో ఉత్తేజపరిచింది చంద్రయాన్ 3 ప్రయోగం. చంద్రయాన్ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్.. చంద్రుడిపై దిగి అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌‌ పేరును చరిత్రలో లిఖించింది. ఈ ప్రయోగాన్ని దేశంలోని ప్రముఖులు, విద్యార్థులు, సామాన్య జనం ఎంతో ఉత్సాహం, ఉత్కంఠగా వీక్షించారు. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కావడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అయితే రాజస్థాన్‌కు చెందిన ఓ మంత్రి మాత్రం చంద్రయాన్‌ 3 ప్రయోగం గురించి మాట్లాడి విమర్శల పాలవుతున్నారు. చంద్రయాన్‌ 3 ప్రయోగం గురించి పూర్తిగా తెలుసుకోకుండానే మీడియా ముందు తనకు వచ్చింది మాట్లాడి సోషల్ మీడియాలో ట్రోలర్స్, మీమర్స్‌కు కొత్త స్టఫ్‌గా మారారు. చంద్రయాన్‌ 3 సక్సెస్ అయిన తర్వాత రాజస్థాన్‌ క్రీడా శాఖ మంత్రి అశోక్‌ చందన్‌ మీడియాతో మాట్లాడారు. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సేఫ్‌ ల్యాండ్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అప్పటి వరకు బాగానే మాట్లాడిన అశోక్ చందన్ అప్పుడే పప్పులో కాలేశారు. చంద్రయాన్ 3 ప్రయోగంలో ప్రయాణించిన వారికి ఈ సందర్భంగా సెల్యూట్‌ చేస్తున్నానంటూ చెప్పారు. స్పేస్‌ రీసెర్చ్‌లో ఇండియా మరో అడుగు ముందుకేసిందని.. ఈ మిషన్‌ సక్సెస్‌ అయిన సందర్భంగా భారత పౌరులందరికీ శుభాకాంక్షలు చెబుతున్నా‌నంటూ గొప్పగా చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సమాధి నుంచి అరుపులు, వింత శబ్ధాలు !! తవ్వి చూసి షాక్‌ తిన్న కుటుంబం

ఏడేళ్లుగా ఆమె జ్ఞాపకాలతోనే.. నిత్యపూజలు, అభిషేకాలు !!

ఆన్సర్ షీట్లలో డబ్బులు పెట్టిన విద్యార్థి.. ఎందుకంటే ??

ఒక్క రాత్రిలో మొత్తం గ్రామం తుడిచిపెట్టుకుపోయింది !! అసలు ఏం జరిగిందంటే ??

జిరాఫీకి కోపం వస్తే.. రచ్చ రంబోలే !! ఏం చేసిందో మీరే ఒక లుక్ వేయండి

 

Published on: Aug 25, 2023 09:26 AM