Andhra Pradesh: బ్రాండెడ్ మధ్యం కోసం సుప్రీంకోర్టు సీజేకు ఫిర్యాదు.. పాదయాత్ర చేస్తామంటూ వార్నింగ్..!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ మద్యం బ్రాండ్స్‌తో పాటు.. కొత్త కొత్త బ్రాండ్లకు చెందిన మద్యాన్ని కూడా విక్రయిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మద్యం బ్రాండ్లపై కొంత కాలంగా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఓ మందుబాబు ఓ అడుగు ముందుకేశాడు. మందుబాబుల ఆరోగ్యం బాగుకోసం.. తానే యుద్ధం చేస్తానంటూ సమరశంఖం పూరించాడు. రావడం రావడంతోనే.. భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశాడు. మాకు ఈ మందు వొద్దు..

Andhra Pradesh: బ్రాండెడ్ మధ్యం కోసం సుప్రీంకోర్టు సీజేకు ఫిర్యాదు.. పాదయాత్ర చేస్తామంటూ వార్నింగ్..!
Suresh Babu Letter
Follow us

| Edited By: Vimal Kumar

Updated on: Sep 08, 2023 | 12:12 PM

బ్రాండెడ్ మధ్యం ఇస్తారా? పాదయాత్ర చేయమంటారా?.. బ్రాండెడ్ మధ్యం కోసం మందుబాబులు ఏకం కావాలంటున్న మందుబాబు.. బ్రాండెడ్ మధ్యం కోసం ఏకంగా సుప్రీంకోర్టు సీజేకు ఫిర్యాదు చేశాడు అతగాడు.. ఇంతకీ అతనికి ఏ బ్రాండ్ కావాలి? ఏ బ్రాండ్ వొద్దు? అసలు ఎవరిని బెదిరిస్తున్నాడు? మందుబాబుల ఐక్యత కోసం ఎందుకు తపిస్తున్నాడు? ఈ ముచ్చట అంతా తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ మద్యం బ్రాండ్స్‌తో పాటు.. కొత్త కొత్త బ్రాండ్లకు చెందిన మద్యాన్ని కూడా విక్రయిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మద్యం బ్రాండ్లపై కొంత కాలంగా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఓ మందుబాబు ఓ అడుగు ముందుకేశాడు. మందుబాబుల ఆరోగ్యం బాగుకోసం.. తానే యుద్ధం చేస్తానంటూ సమరశంఖం పూరించాడు. రావడం రావడంతోనే.. భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశాడు. మాకు ఈ మందు వొద్దు.. బ్రాండెడ్ మందే కావాలంటూ సీజేకి విన్నవించాడు. మరి ఈ మందుబాబుల లీడర్ ఎవరో.. అతని కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నాసిరకం మద్యం అమ్మకాల వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాడు సత్యసాయి జిల్లా నల్లమాడ గ్రామానికి చెందిన సురేష్ బాబు అనే వ్యక్తి ఏపీలో బ్రాండెడ్ మధ్యం దొరక్కపోవడం వల్ల చంద్రయాన్ 3 విజయవంతం అయిన సంతోషకర సందర్భాన్ని ఎంజాయ్ చేయలేకపోయామని అంటున్నాడు సురేష్ బాబు. చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో సంతోషంగా గడిపేందుకు మద్యం దుకాణాలకు వెళ్తే ఎక్కడ కూడా బ్రాండెడ్ మద్యం దొరకడం లేదని సురేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. సీఎం జగన్ సంక్షేమ పథకాలతోపాటు నాణ్యమైన బ్రాండెడ్ మద్యం కూడా మద్యం ప్రియులకు అందేటట్లు చూడాలంటున్నాడు సురేష్. ఏపీలో నాణ్యమైన బ్రాండెడ్ మద్యం అందేటట్లు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌కు రిజిస్టర్ పోస్టులో ఫిర్యాదు చేశాడతను. అంతేకాదు.. తాను చేస్తున్న ఈ పోరాటానికి మందుబాబులు మద్దతు పలకాలని సురేష్ కోరుతున్నాడు. నాసిరకం మద్యం ఆపాలని.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో బ్రాండెడ్ మద్యం అమ్మాలని కోరుతూ పాదయాత్ర కూడా చేస్తానంటున్నాడు సురేష్. అయితే, మద్యం కోసం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు సురేష్ బాబు ఫిర్యాదు చేయడంతో.. మందుబాబులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..