ఆన్సర్ షీట్లలో డబ్బులు పెట్టిన విద్యార్థి.. ఎందుకంటే ??

ఆన్సర్ షీట్లలో డబ్బులు పెట్టిన విద్యార్థి.. ఎందుకంటే ??

Phani CH

| Edited By: Vimal Kumar

Updated on: Sep 05, 2023 | 3:55 PM

ఇటీవల విద్యార్ధులు బాగా తెలివి మీరిపోతున్నారు. తమను ఎగ్జామ్‌లో పాస్‌ చెయ్యాలని ఏకంగా టీచర్‌కే డబ్బులు ఇచ్చాడు ఓ విద్యార్ధి. అవును. ఎగ్జామ్‌లో పాస్‌ కావాలంటే కష్టపడి చదువుకోవాలి గానీ ఇలా ఆన్సర్‌ షీట్లలో డబ్బులు పెడితే టీచర్‌ పాస్‌ మార్కులు వేస్తారా ఏంటి? అదండీ విషయం..ఓ విద్యార్థి ఎగ్జామ్‌లో పాస్‌ కావడం కోసం రాంగ్ రూట్ ఎంచుకున్నాడు. పాస్ మార్కులు వేయాలని అభ్యర్థిస్తూ ఆన్సర్ షీట్లలో కరెన్సీ నోట్లు పెట్టాడు.

ఇటీవల విద్యార్ధులు బాగా తెలివి మీరిపోతున్నారు. తమను ఎగ్జామ్‌లో పాస్‌ చెయ్యాలని ఏకంగా టీచర్‌కే డబ్బులు ఇచ్చాడు ఓ విద్యార్ధి. అవును. ఎగ్జామ్‌లో పాస్‌ కావాలంటే కష్టపడి చదువుకోవాలి గానీ ఇలా ఆన్సర్‌ షీట్లలో డబ్బులు పెడితే టీచర్‌ పాస్‌ మార్కులు వేస్తారా ఏంటి? అదండీ విషయం..ఓ విద్యార్థి ఎగ్జామ్‌లో పాస్‌ కావడం కోసం రాంగ్ రూట్ ఎంచుకున్నాడు. పాస్ మార్కులు వేయాలని అభ్యర్థిస్తూ ఆన్సర్ షీట్లలో కరెన్సీ నోట్లు పెట్టాడు. ఆన్సర్ షీట్లను తెరిచినప్పుడు అందులో వంద, రెండు వందలు, 500 రూపాయల ట్లు కనిపించడంతో వాటిని దిద్దుతున్న టీచర్ అవాక్కయ్యారు. మంచిగా చదివి, మెరుగైన మార్కులు సంపాదించుకుందామన్న ఆలోచనకు బదులు, లంచంతో పాస్ అయిపోదామన్న విద్యార్థుల ధోరణి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జవాబు పత్రాలను దిద్దే ఓ టీచర్ కరెన్సీ నోట్లను గుర్తించిన విషయాన్ని ఐపీఎస్ అధికారి బోత్రాతో తెలియచేశారు. ఆయన దీన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ పట్ల అరుణ్‌ బోత్రా ఆందోళన వ్యక్తం చేశారు. టీచర్‌ ఆయనకు పంపిన ఫోటోని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ఈ ఫొటోని ఓ టీచర్ నాకు పంపించారు. బోర్డు పరీక్షల్లో ఓ విద్యార్థి ఆన్సర్ షీట్ల మధ్య నోట్లను ఉంచినట్టు చెప్పారు. పాస్ మార్కులు వేయాలని అభ్యర్థిస్తూ ఆన్సర్‌షీట్‌లో రాసాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క రాత్రిలో మొత్తం గ్రామం తుడిచిపెట్టుకుపోయింది !! అసలు ఏం జరిగిందంటే ??

జిరాఫీకి కోపం వస్తే.. రచ్చ రంబోలే !! ఏం చేసిందో మీరే ఒక లుక్ వేయండి

Optical illusion: చీకటి సొరంగమా ?? దట్టమైన అడవా ?? అబ్బురపరుస్తున్న వీడియో

Rare Giraffe: ఇలాంటి జిరాఫీ జన్మించడం ప్రపంచంలోనే తొలిసారి !!

ప్రేమలో పడిన 63 ఏళ్ల వృద్ధురాలు !! చివరిలో సూపర్‌ ట్విస్ట్‌ !!

 

Published on: Aug 25, 2023 09:22 AM