Andhra Pradesh: సంక్షేమ పథకాల విషయంలో స్పీడ్ పెంచిన సర్కార్.. వారికి గుడ్ చెప్పిన సీఎం జగన్..

సంక్షేమ కార్యక్రమాల్లో వెనకడుగు వేసేదేలేదని మరోసారి నిరూపించింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. జనవరి నుంచి జూలై వరకూ పెన్షన్లతోపాటు వివిధ పథకాల కింద ప్రజలకు అందాల్సిన నిధుల మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులై ఉండి.. ఏదైనా కారణంతో లబ్ధి కోల్పోయినవారికి అవకాశం కల్పించగా.. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి 216 కోట్లను ప్రజల ఖాతాల్లో జమ చేశారు ముఖ్యమంత్రి జగన్. ఈ సందర్భంగా.. అధికారమంటే అజమాయిషీ కాదు..

Andhra Pradesh: సంక్షేమ పథకాల విషయంలో స్పీడ్ పెంచిన సర్కార్.. వారికి గుడ్ చెప్పిన సీఎం జగన్..
Andhra Pradesh CM YS Jagan
Follow us
Shiva Prajapati

| Edited By: Vimal Kumar

Updated on: Sep 08, 2023 | 12:13 PM

సంక్షేమ పథకాల అమలులో ఏపీ ప్రభుత్వం దూకుడు పెంచుతోంది. గత ఆరు నెలలుగా లబ్ధి కోల్పోయినవారికి గుడ్‌న్యూస్ చెప్పింది జగన్‌ సర్కార్‌. ఇప్పటివరకూ అందుకుంటున్న వారితోపాటు ఏదైనా కారణంతో గతంలో తొలగించిన అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తోంది. వారికి సంబంధించిన నిధులను సీఎం జగన్ బటన్‌ నొక్కి విడుదల చేయడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.

గత ఆరు నెలలు పెండింగ్‌లో ఉన్నవారికి డబ్బులు..

సంక్షేమ కార్యక్రమాల్లో వెనకడుగు వేసేదేలేదని మరోసారి నిరూపించింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. జనవరి నుంచి జూలై వరకూ పెన్షన్లతోపాటు వివిధ పథకాల కింద ప్రజలకు అందాల్సిన నిధుల మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులై ఉండి.. ఏదైనా కారణంతో లబ్ధి కోల్పోయినవారికి అవకాశం కల్పించగా.. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి 216 కోట్లను ప్రజల ఖాతాల్లో జమ చేశారు ముఖ్యమంత్రి జగన్. ఈ సందర్భంగా.. అధికారమంటే అజమాయిషీ కాదు.. ప్రజల పట్ల మమకారం చూపడమన్నారు సీఎం జగన్‌. గత ఆరు నెలలుగా వివిధ కారణాలతో పథకాలు అందని అర్హుల ఖాతాల్లో డబ్బులు క్రెడిట్‌ అయినట్లు వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం జగన్‌.

మరోవైపు.. ఏపీలో వివిధ పథకాలకు గతంలో లబ్ధి కోల్పోయి.. ఆ తర్వాత అర్హత సాధించిన సుమారు ఒక 1.49 లక్షల మందికి పెన్షన్లు, 4,327 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 2 లక్షల మందికి రేషన్ కార్డులు, 12 వేల మందికి ఇళ్ల పట్టాలు అందించారు సీఎం జగన్. ఈ క్రమంలో.. సంక్షేమ పథకాల అమలుపై సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, ఏదైనా కారణంతో అందని వారికి కూడా రీ-వెరిఫై చేసి లబ్ధి చేకూర్చుతున్నట్లు తెలిపారు జగన్. మొత్తంగా.. సంక్షేమం పథకాల అమలులో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది ఏపీ ప్రభుత్వం. అటు.. అవినీతికి తావు లేకుండా డైరెక్ట్‌గా అకౌంట్లలో డబ్బులు జమ అవుతుండటంతో జగన్‌ సర్కార్‌కు జేజేలు పలుకుతున్నారు జనం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..