Telangana: వరంగల్‌లో ఉదయాన్నే భారీ భూకంపం.. భయంతో వణికిపోయిన జనాలు..

వరంగల్, మణుగూరులో ఇవాళ తెల్లవారుజామున 4.43 గంటలకు స్వల్పంగా భూమి కంపించింది. పాత మణుగూరు, శేషగిరి నగర్, బాపన కుంట, శివలింగాపురం, విట్టల్ రావు నగర్, రాజుపేట ప్రాంతంలో భూమి కంపించింది. ఒక్కసారిగా వచ్చిన భూ ప్రకంపనలతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. కాగా, గత వారం రోజుల వ్యవధిలోనే మణుగూరులో రెండుసార్లు భూమి కంపించింది. ఇలా వరుస ప్రకంపనలు వస్తుండటంతో జనాలు భయపడిపోతున్నారు. ఏం జరుగుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగష్టు 25న తెల్లవారుజామున..

Telangana: వరంగల్‌లో ఉదయాన్నే భారీ భూకంపం.. భయంతో వణికిపోయిన జనాలు..
Warangal Earthquake
Follow us
Shiva Prajapati

| Edited By: Vimal Kumar

Updated on: Jan 05, 2024 | 5:50 PM

అందరూ ప్రశాంతంగా పడుకున్నారు.. తెల్లవారుజామున గాఢ నిద్రలో మునిగిపోయారు. ఇంతలోనే.. భారీ కుదుపు.. అంతా ఊగిపోతున్నట్లుగా అనిపించింది. వెంటనే కళ్లు తెరిచి చూసే సరికి.. ఇంట్లోని వస్తువులు, ఫ్యాన్, ఇతర సామాగ్రి ఊగిపోతున్నాయి. నేల కదులుతోంది. దెబ్బకు హడలిపోయిన జనాలు.. వామ్మో భూకంపం అంటూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సెకన్ల పాటు భూమి కంపించడంతో ఏం జరుగుతుందోనని బెదిరిపోయారు జనాలు. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరులో కూడా శుక్రవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు వచ్చాయి.

వరంగల్, మణుగూరులో ఇవాళ తెల్లవారుజామున 4.43 గంటలకు స్వల్పంగా భూమి కంపించింది. పాత మణుగూరు, శేషగిరి నగర్, బాపన కుంట, శివలింగాపురం, విట్టల్ రావు నగర్, రాజుపేట ప్రాంతంలో భూమి కంపించింది. ఒక్కసారిగా వచ్చిన భూ ప్రకంపనలతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. కాగా, గత వారం రోజుల వ్యవధిలోనే మణుగూరులో రెండుసార్లు భూమి కంపించింది. ఇలా వరుస ప్రకంపనలు వస్తుండటంతో జనాలు భయపడిపోతున్నారు. ఏం జరుగుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగష్టు 25న తెల్లవారుజామున నమోదైన భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది. భూకంప కేంద్రం 30 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకటించింది.

కాగా, వారం రోజుల వ్యవధిలోనే రెండుసార్లు భూప్రకంపనలు రావడంపై భూకంప అధ్యయన నిపుణులు స్పందించారు. భూమి లోపలి పొరల్లో అమరికల కారణంగా సాధారణంగానే భూ ప్రకంపనలు వస్తాయని. ఇది పెద్దగా ఆందోళన చెందాలన అంశం కాదని చెబుతున్నారు. ప్రజలు భయపడాల్సిన పని లేదని, ఇవి సర్వసాధారణం అని పేర్కొంటున్నారు నిపుణులు. ఇక సింగరేణి బొగ్గు గనుల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 గంటల మధ్య బ్లాస్టింగ్ కార్యకలాపాలు సాగుతున్నాయి. వీటి కారణంగా కూడా భూమి కంపించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

షనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ట్విట్ వివరాలను కింద చూడొద్దు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..