PM Narendra Modi: దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి తెలంగాణ కళాఖండాన్ని గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ..

దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు హాజరైన సందర్భంగా ప్రధాని న‌రేంద్ర మోడీ.. సమ్మిట్ అనంతరం ఆయా దేశాల నేతలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే.. బ్రిక్స్ సమ్మిట్ ఆతిథ్య దేశమైన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా‌తోనూ భేటీ అయ్యారు ప్రధాని. ఈ సందర్భంగా మన దేశానికి చెందిన, అతి పురాతన, ప్రాముఖ్యత కలిగిన భారతీయ కళాఖండాలను రమాఫోసాకు బహుకరించారు. నాగాలాండ్ శాలువగా, తెలంగాణకు చెందిన బిద్రి పూస, గోండ్ పెయింట్స్‌ను బహుకరించారు ప్రధాని మోదీ.

PM Narendra Modi: దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి తెలంగాణ కళాఖండాన్ని గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ..
Pm Modi Gifts Bidri Work Pair
Follow us
Shiva Prajapati

| Edited By: Vimal Kumar

Updated on: Sep 05, 2023 | 3:55 PM

దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు హాజరైన సందర్భంగా ప్రధాని న‌రేంద్ర మోడీ.. సమ్మిట్ అనంతరం ఆయా దేశాల నేతలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే.. బ్రిక్స్ సమ్మిట్ ఆతిథ్య దేశమైన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా‌తోనూ భేటీ అయ్యారు ప్రధాని. ఈ సందర్భంగా మన దేశానికి చెందిన, అతి పురాతన, ప్రాముఖ్యత కలిగిన భారతీయ కళాఖండాలను రమాఫోసాకు బహుకరించారు. నాగాలాండ్ శాలువగా, తెలంగాణకు చెందిన బిద్రి పూస, గోండ్ పెయింట్స్‌ను బహుకరించారు ప్రధాని మోదీ.

బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా దరమాఫోసాతో భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు చెందిన బిద్రి కళాఖండం ‘సురాహి’ని బహుమతిగా ఇచ్చారు. ఇది 500 ఏళ్ల నాటి కళ. తొలుత బీదర్‌కు మాత్రమే పరిమితమైన బిడ్రి కళ.. హైదరాబాద్‌కు విస్తరించింది. బిద్రి వాస్ జింక్, రాగి, ఇతర నాన్ ఫెర్రస్ లోహాల మిశ్రమంతో తయారు చేస్తారు. కాస్టింగ్‌పై అందమైన నమూనాలను చెక్కుతారు. స్వచ్ఛమైన సిల్వర్ వైర్‌తో అల్లుతారు. ప్రత్యేక ఆకర్షణ లక్షణాలను కలిగి ఉన్న బీదర్ కోటలో లభించే ప్రత్యేక మట్టితో, లోహపు ద్రావణాలుు కలిపి చేస్తారు. బిద్రి పాత్రలపై అవసరమైన డిజైన్స్ రూపొందిస్తారు. ఇందుకోసం బంగారం, వెండి వాడుతారు. దీనికి నలుపు రంగు రావడానికి కూడా ప్రత్యేక విధానం ఉంటుంది. అందుకే ఈ బిద్రి కళాఖండాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత ఉంది.

ఇక నాగా శాలువాలు.. నాగాలాండ్ రాష్ట్రంలో గిరిజనులచే శతాబ్దాలుగా నేసిన వస్త్ర కళకు ప్రతిరూపం. ఈ శాలువాలు శక్తివంతమైన రంగులు, క్లిష్టమైన డిజైన్‌లు, తర తరాల నుంచి వీటిని నేసే సంప్రదాయం ఈ శాలువాకు క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ శాలువాను కూడా ప్రధాని మోదీ సౌతాఫ్రికా ప్రథమ మహిళ త్షెపో మోట్సెపేకి బహుమతిగా అందజేశారు.

బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వాకు గోండ్ పెయింటింగ్స్ గిఫ్ట్..

బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వాకు గోండ్ పెయింటింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. అత్యంత ప్రాముఖ్యత పొందిన గిరిజన కళాకారూపాల్లో గోండ్ పెయింటింగ్స్ ఒకటి. గోండ్ అనే పదం ద్రావి పదం ‘కోండ్’ నుంచి వచ్చింది. దీని అర్థం ‘ఆకుపచ్చ పర్వతం’. చుక్కలు, గీలతో రూపొందించే ఈ పెయింటింగ్స్.. గోండుల గోడలు, ఇళ్లపై చిత్రిస్తారు. ప్రతి ఇంటి నిర్మాణం, పునర్నిర్మాణంతో స్థానికంగా లభించే సహజ రంగులతో వీటిని రూపొందిస్తారు. మట్టి, మొక్కల రసం, ఆకులు, ఆవుపేడ, సున్నపురాయి పొడి మొదలైన వాటిని వినియోగిస్తారు.

ఇదిలాఉంటే.. పీఎం మోదీ జి20లో ఆఫ్రికన్ యూనియన్ కోసం గట్టి ప్రయత్నమే చేశారు. ఆఫ్రికాకు జి20లో శాశ్వత సభ్యత్వాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనుకున్నట్లుగా అన్నీ జరిగితే ఈ జి20 గ్రూప్ కాస్తా త్వరలోనే జి21 గా మారే అవకాశం ఉందని విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా ప్రకటించారు.

కాగా, 15వ బ్రిక్స్ సదస్సులో భారతదేశం పాల్గొనడంపై విలేకరుల సమావేశంలో విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా మాట్లాడుతూ.. ఆఫ్రికన్ యూనియన్‌ చేరిక గురించి ప్రధాని మోదీ G20 నాయకులకు లేఖ రాశారని అన్నారు. ‘ఆఫ్రికన్ యూనియన్‌ను G20లో చేర్చడం గురించి ప్రధాని మోదీ G20 నాయకులకు లేఖ రాశారు. ఆఫ్రికా శాశ్వత సభ్యత్వం కోసం గట్టిగా ప్రతిపాదించాము. అది జరిగితే G20 కాస్తా G21గా మారవచ్చు’ అని చెప్పారు విదేశాంగ కార్యదర్శి వినయ్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..