Bedurulanka 2012: బెదురులంక 2012 మూవీ రివ్యూ.. యుగాంతం స్టోరీతో కార్తికేయ సక్సెస్‌ అందుకున్నాడా?

ఆర్ఎక్స్ 100 తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం చూస్తూనే ఉన్నాడు హీరో కార్తికేయ. కానీ ఇప్పటి వరకు అది రాలేదు.. మధ్యలో విలన్‌గానూ ట్రై చేసాడు ఈ కుర్రాడు. మళ్ళీ ఇప్పుడు హీరోగా వరస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా 'బెదురులంక 2012'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆర్ఎక్స్ 100 మాదిరే ఇది కూడా గోదావరి నేపథ్యంలో వచ్చిన సినిమా.. అలాగే ఇందులోనూ హీరో పేరు శివ. మరి సెంటిమెంట్ ప్రకారం హిట్ కొట్టాడా.. అసలు సినిమా ఎలా ఉందో చూద్దాం..

Bedurulanka 2012: బెదురులంక 2012 మూవీ రివ్యూ.. యుగాంతం స్టోరీతో కార్తికేయ సక్సెస్‌ అందుకున్నాడా?
Bedurulanka 2012 Movie
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Vimal Kumar

Updated on: Sep 23, 2024 | 3:08 PM

మూవీ రివ్యూ: బెదురులంక 2012

నటీనటులు : కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’ రాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు

సినిమాటోగ్రఫర్ : సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి

ఇవి కూడా చదవండి

సంగీతం : మణిశర్మ

ఎడిటర్: విప్లవ్ నైషధం

సమర్పణ : సి. యువరాజు

నిర్మాత : రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేనిరచన, దర్శకత్వం : క్లాక్స్

ఆర్ఎక్స్ 100 తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం చూస్తూనే ఉన్నాడు హీరో కార్తికేయ. కానీ ఇప్పటి వరకు అది రాలేదు.. మధ్యలో విలన్‌గానూ ట్రై చేసాడు ఈ కుర్రాడు. మళ్ళీ ఇప్పుడు హీరోగా వరస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ‘బెదురులంక 2012’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆర్ఎక్స్ 100 మాదిరే ఇది కూడా గోదావరి నేపథ్యంలో వచ్చిన సినిమా.. అలాగే ఇందులోనూ హీరో పేరు శివ. మరి సెంటిమెంట్ ప్రకారం హిట్ కొట్టాడా.. అసలు సినిమా ఎలా ఉందో చూద్దాం..

కథ:

గోదావరి జిల్లాల్లో బెదురులంక అనే ఊరు ఉంటుంది. ప్రశాంతంగా ఉన్న ఊరికి యుగాంతం టెన్షన్ పడుతుంది.. నిజంగానే యుగాంతం వస్తుందా.. వస్తే మా పరిస్థితి ఏంటి అంటూ ఊరంతా కంగారు పడుతున్న సమయంలో.. అదే ఊళ్లో ఉన్న భూషణం (అజయ్ ఘోష్), డానియల్ (ఆటో రామ్ ప్రసాద్), బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్) జనాల భయాన్ని, మూడ నమ్మకాల్ని అడ్డం పెట్టుకుని డబ్బును దోచేయాలని రంగంలోకి దిగుతారు. దానికోసం ఆ ఊరి ప్రెసిడెంట్ (గోపరాజు రమణ) అమాయకత్వాన్ని వాడుకుంటారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి జాబ్ మానేసి ఊళ్లోకి వచ్చేస్తాడు శివ (కార్తికేయ). తను ప్రేమించిన ప్రెసిడెంట్ కుమార్తె చిత్ర (నేహా శెట్టి)ను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది.. అతడి ప్రేమకథ సుఖాంతం అయిందా.. యుగాంతం వచ్చిందా అనేది అసలు కథ..

కథనం:

యుగాంతం నేపథ్యంలో ఇప్పటికే చాలా కథలు వచ్చాయి.. కానీ బెదురులంక మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. ఆ నేపథ్యంలో కథ ఉన్నా కూడా పూర్తిగా జనాల అమాయకత్వం, వాళ్ల మూఢ నమ్మకాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసాడు దర్శకుడు క్లాక్స్. అక్కడ్నుంచి సిచ్యువేషనల్ కామెడీ రాబట్టుకున్నాడు. అదే ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. దేవుడి పేరుతో దోపిడీ మొదలైన తర్వాత కథలోనూ ఆసక్తి మొదలవతుంది.. అక్కడ్నుంచే వినోదం కూడా ఊపందుకుంటుంది. కార్తికేయ కారెక్టర్ ఊళ్లోకి ఎంట్రీ ఇచ్చాక పరుగులు పెడుతుంది. భయం మనిషి కళ్ళను, తెలివిని రెండింటినీ అంధకారంలో పడేస్తుంది. ఆ చీకట్లో లైట్ వేసి.. మూఢ నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటూ.. షో చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. బెదురులంక 2012 కూడా అలాంటి ఒక షో. చావు భయం మనిషిని ఎంత దారుణంగా దిగజారుస్తుందనేది చూపించాడు దర్శకుడు క్లాక్స్. 2012 యుగాంతం గురించి కథనాలు ఎన్నో విన్నాం.. ఆ నేపథ్యమే బెదురులంక సినిమా. కాన్సెప్ట్ అదే అయినా కథ అంతా మూఢనమ్మకాల చుట్టూ తిరుగుతుంది. పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగడం.. ఆ నేపథ్యంలో వర్కౌట్ అయిన సిచువేషనల్ కామెడీ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఎంత కాస్త నెమ్మదిగా.. పెద్దగా బోర్ కొట్టకుండా సాగుతుంది. కీలకమైన సెకండ్ హాఫ్ మాత్రం ఎంటర్టైన్మెంట్ విచ్చేసింది. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు నాన్ స్టాప్ నవ్వులు పూయించాడు దర్శకుడు క్లాక్స్. జనం అమాయకత్వంపైనే ఈ సినిమాలో ఫన్ జనరేట్ చేశాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ సత్య, వెన్నెల కిషోర్ వచ్చాక గ్రాఫ్ పెరిగింది. అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగర్, ఆటో రాంప్రసాద్ సీన్స్ అయితే కడుపుబ్బా నవ్విస్తాయి. వాళ్ళే ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్ కూడా.

నటీనటులు:

కార్తికేయ బాగా నటించాడు. కథలో హీరోయిజం చూపించే ఛాన్స్ ఉన్నా కూడా కేవలం కథ ప్రకారం వెళ్లాడు కానీ ఎక్కడా అనవసరపు హంగులకు వెళ్లలేదు. ఉన్నంతలో చాలా వరకు బాగా కామెడీ చేసాడు కూడా. నేహా శెట్టి ఓకే.. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసారు. ఇక అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగర్, ఆటో రాంప్రసాద్ యాక్టర్స్ బాగా పేలాయి. ప్రెసిడెంట్‌గా గోపరాజు రమణ బాగా నవ్వించారు. అలాగే కసిరెడ్డి పాత్రలో రాజ్ కుమార్ కసిరెడ్డి కూడా చివర్లో అదరగొట్టాడు. సత్య, వెన్నెల కిషోర్ ఉన్నది కాసేపే అయినా బాగా చేసారు. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

మణిశర్మ పాటల కంటే బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఉన్న పాటల్లో వెన్నెల్లో ఆడపిల్ల ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ ఓకే.. చివరి 40 నిమిషాలు అయితే చాలా హిలేరియస్‌గా వర్కవుట్ అయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడు క్లాక్స్ పదేళ్ల కింది ఇన్సిడెంట్ తీసుకున్నా కూడా చాలా ఫన్నీగా దాన్ని ప్రజెంట్ చేసాడు. ముఖ్యంగా లేనిపోని డాబు చూపించకుండా హాయిగా కథలోని కామెడీని వర్కవుట్ చేసాడు.. అక్కడే సక్సెస్ అయ్యాడు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా బెదురులంక 2012.. కొన్ని లోపాలున్నా కా సేపు నవ్వుకోడానికి ఓకే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.