రవితేజ హీరోగా పూరి జగన్నాధ్ దరసకత్వం లో వచ్చిన నేనింతే సినిమా అందరికీ గుర్తుండొచ్చు. ఎన్నో అంచనాల తో విడుదలై బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది.
ఈ సినిమా తో టాలీవుడ్‌కు పరిచయమైంది హీరోయిన్ సియా గౌతమ్. ఆమె అసలు పేరు అదితి గౌతమ్. అయితే సియా గౌతమ్ అనే పేరుతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
ఈ సినిమాలో సంధ్య అనే పాత్ర పోషించి తన నటనతో ప్రేక్షకులను కళ్ళు తన వైపు తిప్పుకునేలా చేసింది. తర్వాత 2010లో వచ్చిన ‘వేదం’ చిత్రంలో నటించింది ఈ ముద్దుగుమ్మ.
వేదం సినిమా సక్సెస్ అయిన ఆమెకు పెద్దగా అవకాశాలను తెచ్చిపెట్టలేదు. అందం, అభినయం ఉన్నా అదృష్టం లేకపోవడంతో మళ్లీ తెలుగులో కనిపించలేదు.
కన్నడంలో కూడా 2011లో ఓ సినిమా లో నటించింది సియా. ఆ తరువాత సుమారు 7 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లో ‘సంజూ’ సినిమాలో మరల ఓ ఛాన్స్ దొరికింది.
ఆ తర్వాత ఆమెకు ఆఫర్లు లేకపోవడంతో ప్రేక్షకులకు దూరమైంది. కానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దగుమ్మ.
అంతే కాదు ప్రస్తుతం తన పేరు తో ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ముంబైలో వాళ్ల అన్నయ్యకు సంబంధించిన బిజినెస్‌లు చూసుకుంటూ తన కుటుంబంతో కలిసి ఉంటోంది.
ఇక ఖాళీ దొరికినప్పుడు సినిమా ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ విధంగా హీరో గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించింది.