అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా నటించిన పుష్ప ది రైజ్( పార్ట్ 1) సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారన్న విషయం తెలిసిందే.
పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను కొల్లగొట్టింది. తాజాగా ఈ సినిమాకి తాజాగా జాతీయ అవార్డ్ దక్కింది. ఉత్తమ నటుడి కేటగిరీలో అల్లు అర్జున్ అవార్డు దక్కించుకున్నారు.
ఇది ఇలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు ఇంటరెస్ట్ చూపిస్తున్నారు నెటిజన్స్.
అల్లు అర్జున్ హీరోగా నటించిన తొలి సినిమా గంగ్రోతి. కాగా అంతకు ముందు బాలనటుడిగానూ ఓ రెండు చిత్రాల్లో చేశారు. చిరంజీవి డాడీ చిత్రంలోనూ ఓ చిన్న పాత్రలో నటించి అందరిని ఆకట్టుకున్నారు.
సినిమాలోకి రాకముందు యానిమేటర్, డిజైనర్‌గా కెరీర్ ప్రారంభిచారు. దానికి గాను ఐకాన్ స్టార్ అందుకున్న మొదటి జీతం రూ.3,500 మాత్రమే.
ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా లో అత్యధిక పారితోషకం అందుకుంటున్న నటులలో అల్లు అర్జున్ ఒకరు. ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ కోట్లలో ఉంటుంది.
పలు నివేదికలు వెల్లడించిన దాని ప్రకారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆస్తుల నికర విలువ సుమారు రూ.410 కోట్లు అంచనా. పలు బ్రాండ్స్ కు అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు.
స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ లైన్ అల్లు అర్జున్‌కు సంభందించిన ప్రతి వస్తువు మీద కనిపిస్తుంటుంది. ఇక.. ఆయనకు కార్లుంటే మహా ఇష్టం.