Sai Dharam Tej: సాయిధరమ్‌ తేజ్‌ యాక్సిడెంట్‌ తర్వాత నా బైక్స్‌ అన్నీ అమ్మేశా: స్నేహితుడు నవీన్‌ విజయ్‌ కృష్ణ

ప్రముఖ సీనియర్‌ నటుడు నరేష్‌ కుమారుడైన నవీన్‌ గతంలో కొన్ని సినిమాల్లోనూ నటించారు. రెండు జెళ్ల సీత, నందిని నర్సింగ్‌ హోమ్‌, ఊరంతా అనుకుంటున్నారు సినిమాల్లో హీరోగా కూడా అదృష్టం పరీక్షించుకున్నాడు. అయితే విజయాలు మాత్రం అందుకోలేకపోయాడు. దీంతో మెగా ఫోన్‌ పట్టుకుని డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇందులో భాగంగానే తన క్లోజ్‌ ఫ్రెండ్‌ సాయి తేజ్‌, స్వాతి కలర్స్‌ జంటగా 'సోల్ ఆఫ్ సత్య' పేరుతో ఒక షార్ట్‌ ఫిల్మ్‌ను తెరకెక్కించాడు.

Sai Dharam Tej: సాయిధరమ్‌ తేజ్‌ యాక్సిడెంట్‌ తర్వాత నా బైక్స్‌ అన్నీ అమ్మేశా: స్నేహితుడు నవీన్‌ విజయ్‌ కృష్ణ
Naveen Vijay Krishna, Sai Dharam Tej
Follow us
Basha Shek

|

Updated on: Aug 24, 2023 | 9:48 PM

సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్నేహితుల లిస్టులో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌, నవీన్‌ విజయ్‌ కృష్ణ కూడా ఒకరు. ప్రముఖ సీనియర్‌ నటుడు నరేష్‌ కుమారుడైన నవీన్‌ గతంలో కొన్ని సినిమాల్లోనూ నటించారు. రెండు జెళ్ల సీత, నందిని నర్సింగ్‌ హోమ్‌, ఊరంతా అనుకుంటున్నారు సినిమాల్లో హీరోగా కూడా అదృష్టం పరీక్షించుకున్నాడు. అయితే విజయాలు మాత్రం అందుకోలేకపోయాడు. దీంతో మెగా ఫోన్‌ పట్టుకుని డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇందులో భాగంగానే తన క్లోజ్‌ ఫ్రెండ్‌ సాయి తేజ్‌, స్వాతి కలర్స్‌ జంటగా ‘సోల్ ఆఫ్ సత్య’ పేరుతో ఒక షార్ట్‌ ఫిల్మ్‌ను తెరకెక్కించాడు. ఈ వీడియో ఎంతగానో ఆకట్టుకుంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నవీన్ తన పర్సనల్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ లైఫ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా సాయి ధరమ్‌ తేజ్‌ బైక్‌ యాక్సిడెంట్‌ తర్వాత తన పరిస్థితిని వివరిస్తూ ఎమోషనల్‌ అయ్యాడు. ‘సాయిధరమ్ తేజ్‌ బైక్‌ యాక్సిడెంట్‌ నా జీవితంలో చాలా మార్పులు తెచ్చింది. జీవితంలో ఎంత బాధ్యతగా ఉండాలో నేర్పించింది.‘ సాయి తేజ్‌ ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందు నేనూ సాయి కలిసి బయటకు వెళ్లాం. తిరుగు ప్రయాణంలో నన్ను ఇంటి దగ్గర డ్రాప్‌ చేసి తన ఇంటికి బయలు దేరాడు సాయి తేజ్‌. అప్పుడే ప్రమాదం జరిగింది. సాయికి యాక్సిడెంట్‌ అయ్యిందని ఫోన్‌ రాగానే ఏదో చిన్న ప్రమాదం అనుకున్నా. అయితే హాస్పిటల్‌కు వెళ్లి అక్కడి పరిస్థితిని చూసి షాకయ్యా. ఈ ప్రమాదం నాకొక పెద్ద పాఠాన్ని నేర్పింది. మనం జీవితంలో ఎక్కడ ఉన్నాం..? ఎంత బాధ్యతగా ఉండాలనే విషయాలను తెలియజేసింది. సాయి తేజ్  రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయడడం చూసి నేను తట్టుకోలేకపోయాను. కొన్ని రోజుల పాటు ఎవరినీ కలవలేదు. ఫోన్‌ కూడా స్విచ్ఛాప్‌ చేసుకున్నా. నా బైక్స్‌ కూడా అన్నీ అమ్మేశాను’ అని నవీన్‌ ఎమోషనల్‌ అయ్యాడు.

ఇక తన కెరీర్‌ గురించి మాట్లాడిన ‘ నాకు డైరెక్షన్ అంటే ఇష్టం. విజయ నిర్మలమ్మ కోరిక మేరకే మొదట హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. అయితే ఎందుకో నాకు అది సెట్‌ కాదనిపించింది. ఇటీవల సత్య అనే షార్ట్‌ ఫిల్మ్‌ ను తెరకెక్కించాను. సాయి తేజ్‌కు కథ నచ్చడంతో వెంటనే యాక్ట్‌ చేస్తానన్నాడు. ఇక స్వాతి నాకు డేంజర్ సినిమా నుంచే తెలుసు. నా కథకు ఆమె అయితేనే న్యాయం చేయగలరనిపించింది. కాల్‌ చేసి అడిగితే వెంటనే ఓకే చెప్పింది’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి
Sai Dharam Tej

Sai Dharam Tej, Naveen Vijay krishna

సోల్ ఆఫ్ సత్య వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..