National Film Awards 2023: నేషనల్‌ ఫిల్మ్స్‌ అవార్డుల్లో తెలుగోడి సత్తా.. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ చరిత్ర సృష్టించాడు. సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నాడు బన్నీ. ఢిల్లీ వేదికగా జరుగుతున్న 69వ నేషనల్‌ ఫిల్మ్స్‌ అవార్డుల్లో జాతీయ ఉత్తమ నటుడిగా ప్రతిష్ఠాత్మక పురస్కారం గెల్చుకున్నాడు అల్లు అర్జున్‌. పాన్‌ ఇండియా స్థాయిలో రికార్డులు కొల్లగొట్టిన పుష్ప సినిమాకు గానూ..

National Film Awards 2023: నేషనల్‌ ఫిల్మ్స్‌ అవార్డుల్లో తెలుగోడి సత్తా.. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
Allu Arjun
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Aug 24, 2023 | 9:51 PM

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ చరిత్ర సృష్టించాడు. సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నాడు బన్నీ. ఢిల్లీ వేదికగా జరుగుతున్న 69వ నేషనల్‌ ఫిల్మ్స్‌ అవార్డుల్లో జాతీయ ఉత్తమ నటుడిగా ప్రతిష్ఠాత్మక పురస్కారం గెల్చుకున్నాడు అల్లు అర్జున్‌. పాన్‌ ఇండియా స్థాయిలో రికార్డులు కొల్లగొట్టిన పుష్ప సినిమాకు గానూ ఈ పురస్కారం అందుకున్నాడు బన్నీ. తద్వారా జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్న మొట్ట మొదటి తెలుగు నటుడిగా బన్నీ చరిత్ర సృష్టించాడు. కాగా 69 ఏళ్ల సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఒక తెలుగు హీరోకి జాతీయ అవార్డు రావడం ఇదే మొదటి సారి కావడం విశేషం. ఇక పుష్ప సినిమా విషయానికొస్తే.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా లో పుష్పరాజ్ గా కనిపించాడు అల్లు అర్జున్.  2021 డిసెంబర్ 17న విడుదలైన ఈ ఊర మాస్ సినిమా తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఎర్రచందనం దుంగల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మంధన్నా హీరోయిన్ గా నటించింది. అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. సమంత ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది.

ఇవి కూడా చదవండి

పుష్ప సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా పాటలు, డైలాగులు ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. ఇప్పటికీ చాలా చోట్ల ఈ సినిమా డైలాగులు, పాటలు రీక్రియేట్ చేస్తున్నారు. కాగా ఇదే పుష్ప సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా జాతీయ అవార్డు గెల్చుకున్నారు దేవిశ్రీ ప్రసాద్. ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే.. గంగోత్రితో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఆర్యతో మొదటి సూపర్‌ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. బన్నీ, హ్యాపీ, దేశ ముదురు, పరుగు, ఆర్య2, వరుడు, వేదం, బద్రీనాథ్‌, జులాయి, ఇద్దరమ్మాయిలతో, ఎవడు, రేస్‌ గుర్రం, సన్నాప్‌ సత్యమూర్తి, రుద్రమదేవి, సరైనోడు, డీజే సినిమాలతో టాలీవుడ్‌ లో తిరుగులేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో వచ్చిన అలా వైకుంఠ పురం సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టాడు. ఆ వెంటనే పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా మారిపోయాడు.

అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..