Dhruva Sarja: ‘మళ్లీ అమ్మానాన్నలు కాబోతున్నాం’.. శుభవార్త చెప్పిన స్టార్‌ హీరో.. సినీ ప్రముఖులు, అభిమానుల శుభాకాంక్షలు

ప్రముఖ కన్నడ నటుడు ధ్రువ సర్జా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాక్షన్‌ కింగ్ అర్జున్‌కు స్వయానా మేనల్లుడైన అతను డబ్బింగ్‌ సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా పలకరించాడు. ముఖ్యంగా 2021లో రిలీజైన 'పొగరు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు.అతను ఇప్పటివరకు కేవలం అరడజను సినిమాలే చేశాడు. అయితేనేం తనదైన నటనతో కన్నడ నాట స్టార్‌ హీరోగా వెలుగొందుతున్నాడు. ముఖ్యంగా ధ్రువ్‌ సర్జాకు భారీగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది.

Dhruva Sarja: 'మళ్లీ అమ్మానాన్నలు కాబోతున్నాం'.. శుభవార్త చెప్పిన స్టార్‌ హీరో.. సినీ ప్రముఖులు, అభిమానుల శుభాకాంక్షలు
Dhruva Sarja Family
Follow us
Basha Shek

| Edited By: Vimal Kumar

Updated on: Feb 20, 2024 | 1:03 PM

ప్రముఖ కన్నడ నటుడు ధ్రువ సర్జా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాక్షన్‌ కింగ్ అర్జున్‌కు స్వయానా మేనల్లుడైన అతను డబ్బింగ్‌ సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా పలకరించాడు. ముఖ్యంగా 2021లో రిలీజైన ‘పొగరు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు.అతను ఇప్పటివరకు కేవలం అరడజను సినిమాలే చేశాడు. అయితేనేం తనదైన నటనతో కన్నడ నాట స్టార్‌ హీరోగా వెలుగొందుతున్నాడు. ముఖ్యంగా ధ్రువ్‌ సర్జాకు భారీగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. చూడడానికి చాలా బొద్దుగా కనిపించే ఈ యాక్షన్‌ హీరో ఈ మధ్యన చాలా స్లిమ్‌గా తయారయ్యాడు. త్వరలోనే ఏకంగా రెండు పాన్‌ ఇండియా సినిమాలతో మన మందుకు రానున్నాడు ధ్రువ్‌ సర్జా. సినిమాల సంగతి పక్కన పెడితే.. తాజాగా ఒక శుభవార్త చెప్పాడీ శాండల్‌ వుడ్‌ సూపర్‌ స్టార్‌. త్వరలోనే అతను రెండోసారి తండ్రిగా ప్రమోషన్‌ పొందనున్నాడు. సెప్టెంబర్‌లో సర్జా ఫ్యామిలీలోకి మరో కొత్త మెంబర్‌ రానున్నాడు. అతని భార్య ప్రేరణ త్వరలోనే ఓ పండంటి బాబుకు జన్మనివ్వనుంది. ఈ శుభవార్తను ధ్రువ్‌ సర్జా దంపతులే సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ధ్రువ్‌ సర్జా దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. కాగా ధృవ తన చిన్ననాటి స్నేహితురాలు ప్రేరణను 2019 లో వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమ బంధానికి గుర్తుగా ఒక ఆడబిడ్డ వీరి జీవితంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే ధ్రువ, ప్రేరణల నుండి మరో తీపి వార్త వచ్చింది. సెప్టెంబర్ నెలలో ప్రేరణ మళ్లీ తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఒక గ్రాఫిక్స్‌ వీడియో ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు ధ్రువ్‌. ఇందులో తన కూతురుతో పాటు బేబీ బంప్‌తో ఉన్న ప్రేరణను కూడా చూడవచ్చు. కాగా ‘పొగరు’ తర్వాత మరో పాన్ ఇండియా సినిమాతో మన ముందుకు రానున్నాడు ధ్రువ్‌ సర్జా. ‘మార్టిన్‌’ పేరుతో ఫుల్‌ ప్యాక్డ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందోతోంది. కొన్ని రోజుల క్రితమే విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా ఇందులోని యాక్షన్‌ సీక్వెన్స్‌ ఓ రేంజ్‌లో హైలెట్‌గా నిలిచాయి. దీంతో పాటు కేడీ: ది డెవిల్ అనే మరో సినిమాలోనూ నటిస్తున్నాడు ధ్రువ్‌. సంజయ్‌ దత్‌ ఈ సినిమాలో విలన్‌ గా నటిస్తున్నాడు.

ధ్రువ్ సర్జా ఇన్ స్టాగ్రామ్ వీడియో  

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Dhruva Sarja (@dhruva_sarjaa)

ధ్రువ్ సర్జా ఫ్యామిలీ ఫొటో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.