BRO OTT: ఓటీటీలోకి వచ్చేసిన పవన్‌ కల్యాణ్‌, సాయి తేజ్‌ల ‘బ్రో’.. మామ, అల్లుళ్ల హంగామాను ఎక్కడ చూడొచ్చంటే?

భారీ అంచనాలతో జులై 28న విడుదలైన బ్రో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. మామా అల్లుళ్లు మొదటిసారిగా కలిసి నటించడంతో భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. రిలీజైన మొదటి మూడు రోజుల్లోనే వంద కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. పవన్‌ కల్యాణ్‌ వింటేజ్ లుక్‌, యాక్టింగ్, స్టైల్, మేనరిజమ్స్ మెగా ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాయి. అలాగే అక్కడక్కడ పవన్‌ పాత పాటలను మళ్లీ గుర్తు చేయడం, ఎమోషనల్‌ కంటెంట్‌ కూడా

BRO OTT: ఓటీటీలోకి వచ్చేసిన పవన్‌ కల్యాణ్‌, సాయి తేజ్‌ల 'బ్రో'.. మామ, అల్లుళ్ల హంగామాను ఎక్కడ చూడొచ్చంటే?
Bro The Avatar Movie
Follow us

|

Updated on: Aug 25, 2023 | 7:01 AM

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ్‌లు హీరోలుగా నటించిన లేటెస్ట్‌ సినిమా ‘బ్రో.. ది అవతార్‌’. తమిళ రీమేక్‌ వినోదయ సిత్తమ్‌కు రీమేక్‌గా సముద్రఖని ఈ మెగా మల్టీస్టారర్‌ను తెరకెక్కించాడు. కేతిక శర్మ, ప్రియాంక వారియర్‌ కథానాయికలు. భారీ అంచనాలతో జులై 28న విడుదలైన బ్రో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. మామా అల్లుళ్లు మొదటిసారిగా కలిసి నటించడంతో భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. రిలీజైన మొదటి మూడు రోజుల్లోనే వంద కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. పవన్‌ కల్యాణ్‌ వింటేజ్ లుక్‌, యాక్టింగ్, స్టైల్, మేనరిజమ్స్ మెగా ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాయి. అలాగే అక్కడక్కడ పవన్‌ పాత పాటలను మళ్లీ గుర్తు చేయడం, ఎమోషనల్‌ కంటెంట్‌ కూడా ప్రేక్షకులను ఈ  సినిమాకు రప్పించాయి. దీంతో బ్రో ఎప్పుడెప్పుడు ఓటీటీలో రిలీజ్‌ అవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ పవన్‌ కల్యాణ్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. మూడు రోజుల క్రితమే బ్రో ఓటీటీ రిలీజ్ డేట్‌పై అప్‌డేట్ ఇచ్చింది. దీని ప్రకారమే శుక్రవారం( ఆగస్టు25) అర్ధరాత్రి నుంచే బ్రో సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ కు వచ్చింది.

తెలుగుతో పాటు తమిళ్‌, మలయాళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘బ్రో’ స్ట్రీమింగ్‌ అవుతోంది. కాగా పవన్‌ కల్యాణ్‌ ఓటీటీలోకి రావడంతో నెట్టింట మెగా ఫ్యాన్స్‌ రచ్చ చేస్తున్నారు. సినిమా చూసి ఎంజాయ్‌ చేస్తున్నామంటూ స్క్రీన్‌షాట్లను షేర్‌ చేస్తున్నారు. కాగా బ్రో.. ది అవతార్ సినిమా విజయంలో తమన్‌ అందించిన బాణీలు, బీజీఎమ్‌ కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగాథీమ్‌ సాంగ్ ఓ రేంజ్‌లో హిట్‌ అయ్యింది. పీపుల్స్‌ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ ఈ మెగా మల్టీస్టారర్‌ను నిర్మించారు. బ్రో సినిమా రాజకీయంగానూ వివాదాలు ఎదుర్కొంది. ఇందులోని పృథ్వీ పోషించిన శ్యాంబాబు క్యారెక్టర్‌ తనను ఉద్దేశించే పెట్టారంటూ బ్రో మీద ఫైరయ్యాడు. ఈ సినిమా పెట్టుబడులకు సంబంధించి కూడా సంచలన ఆరోపణలు చేశారు. మరి.. థియేటర్లలో పవన్‌ బ్రో సినిమాను మిస్‌ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పవన్ కల్యాణ్ బ్రో సినిమా స్ట్రీమింగ్ అప్డేట్

పవన్ ఫ్యాన్స్ రియాక్షన్స్ చూశారా?

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..