Bichagadu 2 Review Telugu: బిచ్చగాడుకి బ్రెయిన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌… సీక్వెల్‌ స్టోరీ ఇదే!

విజయ్‌ ఆంటోని అనే కోలీవుడ్‌ హీరోకి తెలుగు స్టేట్స్ లో బిజినెస్‌ ప్లాట్‌ఫార్మ్ క్రియేట్‌ చేసిన సినిమా 'బిచ్చగాడు'. ఈ సినిమాకు సీక్వెల్‌ వస్తుందని అనగానే అందరిలోనూ అదో రకమైన ఆసక్తి క్రియేట్‌ అయింది. మదర్‌ సెంటిమెంట్‌గా ఫస్ట్ పార్ట్ సాగితే, సిస్టర్‌ సెంటిమెంట్‌తో సెకండ్‌ పార్ట్ ని తెరకెక్కించారు. ఇంతకీ ఈ రెండో భాగం పార్ట్ ఒన్‌కి కొనసాగింపా? లేకుంటే, ఫ్రెష్‌గా స్టార్ట్ అవుతుందా? అనేది ఆసక్తికరం.

Bichagadu 2 Review Telugu: బిచ్చగాడుకి బ్రెయిన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌... సీక్వెల్‌ స్టోరీ ఇదే!
Bichagadu 2
Follow us
Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Rajitha Chanti

Updated on: May 19, 2023 | 3:23 PM

విజయ్‌ ఆంటోని అనే కోలీవుడ్‌ హీరోకి తెలుగు స్టేట్స్ లో బిజినెస్‌ ప్లాట్‌ఫార్మ్ క్రియేట్‌ చేసిన సినిమా ‘బిచ్చగాడు’. ఈ సినిమాకు సీక్వెల్‌ వస్తుందని అనగానే అందరిలోనూ అదో రకమైన ఆసక్తి క్రియేట్‌ అయింది. మదర్‌ సెంటిమెంట్‌గా ఫస్ట్ పార్ట్ సాగితే, సిస్టర్‌ సెంటిమెంట్‌తో సెకండ్‌ పార్ట్ ని తెరకెక్కించారు. ఇంతకీ ఈ రెండో భాగం పార్ట్ ఒన్‌కి కొనసాగింపా? లేకుంటే, ఫ్రెష్‌గా స్టార్ట్ అవుతుందా? అనేది ఆసక్తికరం.

సినిమా: బిచ్చగాడు 2

నటీనటులు: విజయ్‌ ఆంటోని, కావ్య థాపర్‌, వైజీ మహేంద్రన్‌, రాధారవి, మన్సూర్‌ అలీఖాన్‌, హరీష్‌ పేరడి, జాన్‌ విజయ్‌, యోగిబాబు తదితరులు

ఇవి కూడా చదవండి

నిర్మాణ సంస్థ: విజయ్‌ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్‌

కెమెరా: ఓమ్‌ నారాయణ్‌

మాటలు: భాష్యశ్రీ

సంగీతం: విజయ్‌ ఆంటోని

ఎడిటింగ్‌: విజయ్‌ ఆంటోని

దర్శకత్వం: విజయ్‌ ఆంటోని

నిర్మాత: ఫాతిమా విజయ్‌

విడుదల: మే 19, 2023

విజయ్‌ గురుమూర్తి (విజయ్‌ ఆంటోని) లక్ష కోట్లకు వారసుడు. తండ్రి చనిపోయాడన్న బాధకన్నా, నాన్న మరణవార్తతో షేర్‌ వేల్యూస్‌ పడిపోకూడదనుకునే పక్కా బిజినెస్‌మేన్‌. వ్యాపారాల్లో తన ప్రేయసి హేమ(కావ్య)ను కూడా వేలు పెట్టనివ్వడు. అంతా స్నేహితుడు అరవింద్‌ చెప్పినట్టే చేస్తుంటాడు. తన ఫ్యామిలీ డాక్టర్‌, ఫ్రెండ్‌ , ఇంకో వ్యక్తి కలిసి విజయ్‌ గురుమూర్తి కి బ్రెయిన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేస్తారు. ఆ బ్రెయిన్‌ అనాథ సత్య(విజయ్‌ ఆంటోని)ది. సత్య బిచ్చగాడు అని మాత్రమే అరవింద్‌ సర్కిల్‌కి తెలుసు. అంతకు మించిన నేర చరిత్రను వాళ్లు ఊహించలేకపోతారు. విజయ్‌ శరీరాన్ని తన శరీరంగా అంగీకరించడానికి సత్యకి మనసు ఒప్పదు. అయినా చేసేదేమీ లేక ఒప్పుకుంటాడు. ఒకానొక సందర్భంలో అతనికి అరవింద్‌ అండ్‌ గ్యాంగ్‌ మీద కోపం వచ్చి చంపేస్తాడు. యాంటి బిగిల్‌ అని ఓ మిషన్‌ని స్టార్ట్ చేస్తాడు. అయితే తొందరపాటుతో సత్య చేసిన ఓ తప్పు వల్ల ఓ పోలీసుకి దొరికిపోతాడు. విషయం స్టేట్‌ సీఎందాకా వెళ్తుంది. విజయ్‌ రూపంలో ఉన్న సత్యకు ఆస్తి దక్కకూడదని సీఎం స్కెచ్‌ వేస్తాడు. గురుమూర్తి అన్న కొడుకుని రంగంలోకి దింపుతాడు. చివరకు ఏమైంది? యాంటి బిగిల్‌ మిషన్‌ లక్ష్యం ఏంటి? దాన్ని ఎవరు లీడ్‌ చేశారు? సత్య వెతుకుతున్న రాణి ఎవరు? విజయ్‌ ప్రేయసి హేమ, రాణిని దగ్గర తీసిందా? లేదా? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.

విజయ్‌ గురుమూర్తి, సత్య కేరక్టర్లలో చాలా మంచి వేరియేషన్‌ చూపించారు విజయ్‌ ఆంటోనీ. మేకప్‌ కూడా రెండు కేరక్టర్లకూ డిఫరెంట్‌గా ఉంది. జైల్లో పెరిగిన వ్యక్తికి, రిచ్‌ పర్సన్‌కి ఉన్న బాడీ లాంగ్వేజ్‌ కూడా పర్ఫెక్ట్ గా పోట్రే చేశారు విజయ్‌ ఆంటోనీ. డైరక్టర్‌గానూ సక్సెస్‌ అయ్యారనే చెప్పాలి. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ బావుంది. చెల్లి కోసం సాగే పాట తప్ప, మిగిలినవి పెద్ద ఇంట్రస్టింగ్‌గా లేవు. కావ్య ఫస్ట్ పాటలో గ్లామరస్‌గానూ, తర్వాత సన్నివేశాల్లో డీసెంట్‌గానూ మెప్పించారు. తక్కువ కేరక్టర్లతో రాసుకున్న కథ ఇది. కాకపోతే ఇంకాస్త గ్రిప్పింగ్‌గా రాసుకోవాల్సింది. ఫస్ట్ హాఫ్‌ బాగానే ఉన్నట్టు అనిపించినా, సెకండ్‌ హాఫ్‌లో అక్కర్లేని విషయాల మీద ఫోకస్‌ పెంచినట్టు కనిపిస్తుంది. సినిమా ఫస్టాఫ్‌లో రిపీటెడ్‌గా కనిపించే పాము షాట్స్ ఎందుకో అర్థం కావు. సింబాలిక్‌గా చూపించారని అనుకున్నా, తర్వాత తర్వాత వాటి జాడే ఉండదు. కెమెరా పనితనం, లొకేషన్లు కన్విన్సింగ్‌గా ఉన్నాయి. ఎడిటింగ్‌ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. స్క్రీన్‌ ప్లే విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. అక్కడక్కడా ల్యాగ్‌లు, కన్విన్సింగ్‌గా లేని ఎపిసోడ్స్ ని పక్కనపెడితే సినిమా బాగానే అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో మేనకోడలిని, చెల్లిని, బావను చూసి సత్య భావోద్వేగానికి గురయ్యే సన్నివేశాలు మెప్పిస్తాయి.

చివరగా.. బిచ్చగాడికి బ్రెయిన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేస్తే.. బిచ్చగాడు2

– డా. చల్లా భాగ్యలక్ష్మి