Prabhas: వెంకీ వదులుకున్న సినిమాను ఓకే చేసిన ప్రభాస్.. ఏ మూవీ అంటే..

ఇప్పటికే ప్రభాస్, డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో రూపొందించిన ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ అయ్యి విడుదలకు సిద్ధంగా ఉంది. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక ఇదే కాకుండా.. సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలు వేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

Prabhas: వెంకీ వదులుకున్న సినిమాను ఓకే చేసిన ప్రభాస్.. ఏ మూవీ అంటే..
Prabhas, Venkatesh
Follow us
Rajitha Chanti

|

Updated on: May 18, 2023 | 1:21 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రభాస్, డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో రూపొందించిన ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ అయ్యి విడుదలకు సిద్ధంగా ఉంది. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక ఇదే కాకుండా.. సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలు వేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. దాదాపు 20 ఏళ్ల కెరీర్లో ప్రభాస్ అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలను వదలుకున్నారు. అలాగే… కొన్ని సందర్బాల్లో పలువురు స్టార్స్ వదిలేసిన చిత్రాలకు డార్లింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమాలకు ఊహించని రిజల్ట్ వచ్చింది. ఈ క్రమంలోనే వెంకీ రిజెక్ట్ చేసిన ఓసినిమా ప్రభాస్ చేసి ప్లాపును ఖాతాలో వేసుకున్నారు. ఆ సినిమా ఏంటో తెలుసుకుందామా.

అదే రాధేశ్యామ్. డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఇటీవల ప్రభాస్ నటించిన ఈ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించగా.. దివంగత నటుడు కృష్ణం రాజు కీలకపాత్రలో కనిపించారు. ఈ సినిమాతో బాలీవుడ్ నటి భాగ్య శ్రీ రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా కథను ముందుగా వెంకీకి చెప్పారట డైరెక్టర్… అయితే స్టోరీ అంత ఇంట్రెస్టింగ్‏గా లేకపోవడం.. అప్పటికే వెంకీ చేతిలో మరిన్ని ప్రాజెక్ట్స్ ఉండడంతో మూవీని రిజెక్ట్ చేశారట.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత ఇదే కథను డైరెక్టర్ ప్రభాస్ కు చెప్పగా.. కథ బాగా నచ్చడంతో డార్లింగ్ ఓకే చెప్పారట. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులకు నిరాశను మిగిల్చిందనే చెప్పాలి. ప్రస్తుతం డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఆదిపురుష్, సలార్ చిత్రాలపైనే ఉన్నాయి.