Jr.NTR Birthday: ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్.. NTR30 నుంచి బర్త్ డే స్పెషల్ సర్ ప్రైజ్ రెడీ..

ప్రస్తుతం ఎన్టీఆర్.. మాస్ డైరెక్టరొ కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న NTR30 ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిర్మాణ సంస్థలు ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

Jr.NTR Birthday: ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్.. NTR30 నుంచి బర్త్ డే స్పెషల్ సర్ ప్రైజ్ రెడీ..
Ntr
Follow us
Rajitha Chanti

| Edited By: seoteam.veegam

Updated on: May 18, 2023 | 3:39 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రెషన్స్ షూరు అయ్యాయి. ఈనెల 20న ఆయ పుట్టిన రోజు సందర్భంగా.. బ్లాక్ బస్టర్ మాస్ యాక్షన్ చిత్రం సింహాద్రిని రీరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు తారక్ నెక్ట్స్ మూవీస్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తారక్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ప్రస్తుతం ఎన్టీఆర్.. మాస్ డైరెక్టరొ కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న NTR30 ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిర్మాణ సంస్థలు ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

రేపు (మే 19న) NTR30 ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ లో.. సముద్ర తీరంలో రక్తంతో తడిసిన కత్తులు భూమిలో గుచ్చుకుని ఉన్నాయి. “రక్తంతో రాసిన అతడి కథలతో సముద్రం మొత్తం నిండిపోయింది” అని ఇంగ్లీష్ లో పోస్టర్ పై రాసి ఉంది. ఈ పోస్టర్స్ ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ బట్టి చూస్తుంటే సినిమా చాలా వైలెంట్ గా ఉండబోతుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమాతో జాన్వీ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే త్వరలోనే ఈ సినిమా టైటిల్ పై క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.