Vimanam Movie Review: సముద్రఖని, అనసూయల ‘విమానం’ మూవీ రివ్యూ..

Vimanam Movie Review in Telugu: చిన్న పిల్లలకు విమానం ఎక్కాలనే ఆశ.. కోరిక రెండూ బలంగానే ఉంటాయి. దాన్నే కథగా చేసుకుని సినిమా చేయడం అంటే చిన్న విషయం కాదు.. ఎంతో ఎమోషనల్‌గా ఉంటే తప్ప ఆ కథ వర్కవుట్ అవ్వదు. మరి ఇదే కథతో వచ్చిన విమానం సినిమా ఆడియన్స్‌ను మాయ చేసిందా..? గుండెను మెలిపెట్టేంత ఎమోషన్ ఇందులో ఉందా... అసలు విమానం సినిమా ఎలా ఉంది..?

Vimanam Movie Review: సముద్రఖని, అనసూయల ‘విమానం’ మూవీ రివ్యూ..
Vimanam Movie Review
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 09, 2023 | 12:32 PM

Vimanam Movie Review in Telugu: చిన్న పిల్లలకు విమానం ఎక్కాలనే ఆశ.. కోరిక రెండూ బలంగానే ఉంటాయి. దాన్నే కథగా చేసుకుని సినిమా చేయడం అంటే చిన్న విషయం కాదు.. ఎంతో ఎమోషనల్‌గా ఉంటే తప్ప ఆ కథ వర్కవుట్ అవ్వదు. మరి ఇదే కథతో వచ్చిన విమానం సినిమా ఆడియన్స్‌ను మాయ చేసిందా..? గుండెను మెలిపెట్టేంత ఎమోషన్ ఇందులో ఉందా… అసలు విమానం సినిమా ఎలా ఉంది..?

మూవీ రివ్యూ: విమానం

నటీనటులు: స‌ముద్రఖ‌ని, అన‌సూయ, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, మీరా జాస్మిన్, రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్‌ తదితరులు..

ఇవి కూడా చదవండి

సినిమాటోగ్ర‌ఫీ: వివేక్ కాలేపు

ఎడిట‌ర్‌: మార్తాండ్ కె.వెంక‌టేష్‌

మ్యూజిక్‌: చ‌ర‌ణ్ అర్జున్‌

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శివ ప్ర‌సాద్ యానాల‌

నిర్మాతలు: జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌)

కథ:

వీరయ్య (సముద్రఖని) ఓ చిన్న వాడలో సులభ్ కాంప్లెక్స్ పెట్టుకుని బతుకుతుంటాడు. పైగా అతడు అవిటివాడు.. ఓ కాలు ఉండదు. అతడికి ఓ కొడుకు రాజు (మాస్టర్ ధృవన్) ఉంటాడు. ఎంతో తెలివైన వాడు.. స్కూల్లో చాలా చురుగ్గా ఉంటాడు. అయితే ఆ కుర్రాడికి చిన్నప్పటి నుంచి విమానం ఎక్కాలనే కోరిక బలంగా ఉంటుంది. దానికోసమే బతుకుతుంటాడా అనేంత ఇష్టం. అదే వాడలో చెప్పులు కుట్టుకునే కోటి (రాహుల్ రామకృష్ణ), డ్రైవర్ డానీ (ధన్ రాజ్), వ్యభిచారం చేసుకునే సుమతి (అనసూయ భరద్వాజ్) కూడా ఉంటారు. తల్లి చిన్నపుడే చనిపోవడంతో కొడుకును ప్రాణంగా చూసుకుంటాడు వీరయ్య. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో కొడుకు రాజు నెల రోజుల కంటే ఎక్కువ బతకడు అనే చేదు నిజం తెలుస్తుంది. 100 రూపాయలకే అటూ ఇటూ చూసే వీరయ్యకు 12 వేలు ఉంటే తప్ప విమానం ఎక్కలేడని అర్థమవుతుంది. మరి కొడుకు చివరి కోరికను వీరయ్య తీర్చాడా లేదా అనేది అసలు కథ..

కథనం:

‘విమానం’ చాలా చిన్న కథ.. కొన్ని రోజుల్లో చనిపోతాడు అని తెలిసిన కొడుకు చివరి కోరిక తీర్చాలనుకునే తండ్రి కథ ఇది. ఇందులో మంచి కథ ఉంది.. దానికి మించిన ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. కాకపోతే కొన్నిచోట్ల మాత్రమే అది వర్కవుట్ అయింది. దానికితోడు సీరియల్ కష్టాలు కొన్ని విసిగిస్తాయి. ఇదే కథను ఇంకాస్త ఎమోషనల్‌గా తీర్చి దిద్దుంటే చాలా మంది సినిమా అయ్యుండేది. అందులో విఫలం అయ్యారు దర్శకుడు శివప్రసాద్. అప్పటికీ కొన్ని అద్భుతమైన సీన్స్ రాసుకున్నాడు. కానీ స్క్రీన్ ప్లే లోపాలతో విమానం సగం ఎగిరి.. అక్కడే ఆగిపోయింది. సినిమా మొదటి సీన్ నుంచే తండ్రీ కొడుకుల మధ్య ఉండే బాండింగ్ చూపించాడు దర్శకుడు. దాన్నే మెయిన్ ప్లాట్‌గా తీసుకున్నాడు కూడా. అయితే అదొక్కటే పాయింట్ అన్నట్లు సాగుతుంది కథ.. మధ్యలో అనసూయ, రాహుల్ రామకృష్ణ సీన్స్ కూడా ఏదో అతికించినట్లు అనిపిస్తాయే కానీ కథలో ఉన్న ఫీల్ కనిపించదు. ఓ చిన్న వాడలో జరిగే కథే ఇదంతా. అక్కడ వాళ్ల జీవితాలు ఎలా ఉంటాయనేది బాగానే చూపించాడు దర్శకుడు. ఉన్న దాంట్లోనే ఎలా సర్దుకుని ఉంటారు.. 1000 రూపాయలు చూడాలంటే ఎన్ని కష్టాలు పడాలి అనేది కూడా బాగానే అల్లుకున్నాడు. అయితే కథనం అక్కడక్కడా నెమ్మదిగా ఉండటంతో.. మంచి కథ ఉన్నా విమానం అంతగా ఆకట్టుకోలేదు. సినిమాలో ఉన్నదే 5 మెయిన్ క్యారెక్టర్లు. ఎంతసేపు వాళ్ల చుట్టూనే కథ తిరుగుతుంది. దాంతో సినిమా అక్కడక్కడే తిరుగుతున్న ఫీల్ వస్తుంది. ఇక్కడే స్క్రీన్ ప్లే ఫెయిల్యూర్ కనిపించింది. పిల్లాడికి అంత పెద్ద జబ్బు ఉందని తెలిసాక అయ్యో పాపం అనిపిస్తుంది.. కానీ దాన్ని క్యారీ చేసేంత ఎమోషన్ వర్కవుట్ అవ్వలేదు. మేల్ వర్షన్ ఆఫ్ మాతృదేవోభవ చూసినట్లు ఎప్పుడూ కష్టాలే వాళ్లను వెంబడిస్తూ ఉంటాయి. క్లైమాక్స్ బాగుంది.. భావోద్వేగంగా ఉంది.

Vimanam

‘విమానం’ మూవీలో అనసూయ భరద్వాజ

నటీనటులు:

సముద్రఖని ఎంత గొప్ప నటుడు అనేది ఈ చిత్రం చూస్తే అర్థమైపోతుంది. వీరయ్య పాత్ర కోసమే ఆయన పుట్టాడేమో అనిపిస్తుంది. ఇక మాస్టర్ ధృవన్ కూడా అద్భుతంగా నటించాడు. రాహుల్ రామకృష్ణ, ధన్ రాజ్ కారెక్టర్స్ బాగున్నాయి. ముఖ్యంగా రాహుల్ కారెక్టర్‌లో డబుల్ మీనింగ్ కూడా బాగానే ఉన్నాయి. వేశ్య పాత్రలో అనసూయ భరద్వాజ్‌ సహజంగా నటించారు. ఆమె మంచి నటి అని ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించారు.. ఇప్పుడు విమానం మరో ఉదాహరణ. చిన్న పాత్రలో అయినా మీరా జాస్మిన్ బాగా నటించారు. మిగిలిన పాత్రలన్నీ ఓకే..

టెక్నికల్ టీం:

చరణ్ అర్జున్ సంగీతం పర్లేదు. రేలా రేలారే పాట బాగుంది. సాహిత్యం కూడా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ పర్లేదు. ఎడిటింగ్ ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ కాస్త బెటర్‌గా ఉండాల్సింది. దర్శకుడిగా శివ ప్రసాద్ మంచి కథ రాసుకున్నాడు కానీ కథనం కూడా అంతే బాగా ఉండుంటే బలగం స్థాయిలో విమానం చాలా మంచి సినిమా అయ్యుండేది. ఎమోషన్ మిస్ అవ్వడంతో సగం సగం సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది.

పంచ్ లైన్: విమానం.. మేల్ వర్షన్ ఆఫ్ మాతృదేవోభవ

మరిన్ని సినిమా రివ్యూస్ చదవండి..