Allu Arha: అల్లు అర్హ పాప స్కూల్‌కు వెళ్లే టైమ్‌ వచ్చింది.. అయాన్‌ చేతిని పట్టుకుని.. క్యూట్‌ ఫోటోస్‌ వైరల్

అల్లు అర్జున్‌ గారాల పట్టి అల్లు అర్హకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్‌కిడ్‌గా ఇప్పటికే సోషల్‌ మీడియాలో సినీ సెలబ్రిటీలకు మించి ఫాలోయింగ్‌ సొంతం చేసుకుంది. ఇక సమంత నటించిన పీరియాడికల్‌ మూవీ శాకుంతలం సినిమాలో సిల్వర్‌ స్క్రీన్‌పై కూడా దర్శనమించ్చింది. ఇందులో తను పోషించిన భరతుడి పాత్ర పలువురి ప్రశంసలు అందుకుంది.

Allu Arha: అల్లు అర్హ పాప స్కూల్‌కు వెళ్లే టైమ్‌ వచ్చింది.. అయాన్‌ చేతిని పట్టుకుని.. క్యూట్‌ ఫోటోస్‌ వైరల్
Allu Arjun Daughter Allu Arha
Follow us
Basha Shek

|

Updated on: Aug 10, 2023 | 6:20 AM

అల్లు అర్జున్‌ గారాల పట్టి అల్లు అర్హకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్‌కిడ్‌గా ఇప్పటికే సోషల్‌ మీడియాలో సినీ సెలబ్రిటీలకు మించి ఫాలోయింగ్‌ సొంతం చేసుకుంది. ఇక సమంత నటించిన పీరియాడికల్‌ మూవీ శాకుంతలం సినిమాలో సిల్వర్‌ స్క్రీన్‌పై కూడా దర్శనమించ్చింది. ఇందులో తను పోషించిన భరతుడి పాత్ర పలువురి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ఫ్లాపైనా అల్లు అర్హకు మాత్రం ఫుల్‌ క్రేజ్‌ వచ్చింది. అందుకే ఎన్టీఆర్‌ లేటెస్ట్‌ సినిమా దేవరలోనూ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందితున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ చిన్ననాటి పాత్ర కోసం అర్హను ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది.ఇందుకోసం భారీ రెమ్యూనరేషన్‌ను కూడా ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇన్ని రోజులు ఇంటి పట్టునే ఉండి ఆటలు, పాటలతో కాలక్షేపం చేసిన అర్హ ఇక స్కూలుకు వెళ్లే సమయం వచ్చింది. బుధవారం (ఆగస్టు 09) ఉదయం బన్నీ గారాల పట్టి స్కూలుకు వెళ్లింది. ఈ విషయాన్ని అల్లు అర్జున్‌ సతీమణి అల్లు స్నేహ సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. అయాన్‌ చేతిని పట్టుకుని చాలా బుద్ధిగా బడికి వెళుతున్న కూతురి ఫొటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేసిన అల్లు స్నేహ ‘ఫస్ట్‌ డే ఆఫ్‌ స్కూల్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చింది.

ఇందులో అయాన్‌, అర్హ బ్యాగ్‌లపై వారి వారి పేర్లు ఇంగ్లిష్‌లో రాసి ఉండడం విశేషం. వీరి స్కూల్‌ బ్యాగులను అల్లు అర్జున్‌ స్పెషల్‌గా డిజైన్‌ చేయించినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం అల్లు అర్హ ఫస్ట్‌ డే స్కూల్‌ ఫొటోస్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అన్నా చెల్లెళ్లు ఎంత క్యూట్‌గా ఉన్నారో అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పుష్ప 2.. ది రూల్‌ సినిమాతో బిజిబిజీగా ఉంటున్నాడు ఐకాన్‌ స్టార్‌. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ఫహాద్‌ ఫాసిల్‌ పుట్టిన రోజు సందర్భంగా సినిమాలో తన పాత్రకు సంబంధించిన పవర్‌ ఫుల్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..