Guns and Gulaabs: స్టైలిష్‌ గ్యాంగ్‌స్టర్‌గా దుల్కర్‌.. ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ఇటీవల స్టార్‌ హీరోలు కూడా ఓటీటీల బాట పడుతున్నారు. సినిమాలతో వెబ్‌ సిరీస్‌లకు పచ్చజెండా ఊపుతున్నాడు. ఇప్పుడు మలయాళ సూపర్‌ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ ఓటీటీ బాట పడ్డాడు. మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హ్యాండ్సమ్‌ హీరో త్వరలో ఓ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అతను నటించిన తాజా వెబ్‌ సిరీస్‌ గన్స్ అండ్‌ గులాబ్స్‌. 'ది ఫ్యామిలీ మ్యాన్‌', 'ఫర్జీ' వెబ్‌ సిరీస్‌లతో ఓటీటీలో సంచలనాలు సృష్టించిన రాజ్ అండ్‌ డీకే ద్వయమే..

Guns and Gulaabs: స్టైలిష్‌ గ్యాంగ్‌స్టర్‌గా దుల్కర్‌.. 'గన్స్‌ అండ్‌ గులాబ్స్‌' స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Guns And Gulaabs Web Series
Follow us
Basha Shek

|

Updated on: Aug 09, 2023 | 6:24 AM

ఇటీవల స్టార్‌ హీరోలు కూడా ఓటీటీల బాట పడుతున్నారు. సినిమాలతో వెబ్‌ సిరీస్‌లకు పచ్చజెండా ఊపుతున్నాడు. ఇప్పుడు మలయాళ సూపర్‌ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ ఓటీటీ బాట పడ్డాడు. మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హ్యాండ్సమ్‌ హీరో త్వరలో ఓ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అతను నటించిన తాజా వెబ్‌ సిరీస్‌ గన్స్ అండ్‌ గులాబ్స్‌. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’, ‘ఫర్జీ’ వెబ్‌ సిరీస్‌లతో ఓటీటీలో సంచలనాలు సృష్టించిన రాజ్ అండ్‌ డీకే ద్వయమే గన్స్ అండ్‌ గులాబ్స్‌ సిరీస్‌ను తెరకెక్కించారు. దుల్కర్‌తో పాటు బాలీవుడ్‌ ట్యాలెంటెడ్‌ హీరో రాజ్‌కుమార్‌ రావ్‌, ఆదర్శ్‌ గౌరవ్‌, గుల్షన్‌ దేవయ్య ఈ కామెడీ క్రైమ్‌ సిరీస్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న గన్స్ అండ్‌ గులాబ్స్‌ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్‌లో ఆగస్టు 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేశారు మేకర్స్‌.

తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించి తెలుగు ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చేశారు మేకర్స్‌. అక్కడక్కడా కొన్ని బూతులు ఉన్నప్పటికీ ఆద్యంతం కామెడీతో ఆసక్తికరంగా సాగింది ట్రైలర్‌. ఇక స్టైలిష్‌ గ్యాంగ్‌స్టర్ రోల్‌లో సూపర్బ్‌గా కనిపించాడు దుల్కర్‌. 1990ల్లో గులాబ్ గంజ్ అనే ప్రాంతంలో గ్యాంగ్‌స్టర్స్‌కు, పోలీసుల‌కు మ‌ధ్య జ‌రిగిన పోరాటం ఆధారంగా ఈ క్రైమ్‌ సిరీస్‌ను రూపొందించారు. కాగా ఈ సిరీస్‌తో పాటు కింగ్‌ ఆఫ్‌ కోతా సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు దుల్కర్‌. ఇది కూడా గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంతోనే తెరకెక్కింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.