Megastar Chiranjeevi: మనవరాలు క్లింకారకు చిరంజీవి దంపతుల స్పెషల్‌ గిఫ్ట్‌.. ఏమిచ్చారో తెలుసా?

మెగా ప్రిన్సెస్‌ ముఖాన్ని చూసేందుకు అభిమానులు, నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే చాలామంది లాగే రామ్‌ చరణ్‌ దంపతులు కూడా తమ కూతురి విషయంలో చాలా గోప్యత పాటిస్తున్నారు. తమ కూతురి ఫొటోలు సోషల్‌ మీడియాలో రాకుండా జాగ్రత్త పడుతున్నారు. కాగా మెగా వారసురాలు క్లింకారకు సెలబ్రిటీల నుంచి పలు బహుమతులు వచ్చాయి. యంగ్‌ హీరో శర్వానంద్‌ చెర్రీ కూతురికి స్పెషల్‌ గిఫ్ట్‌ పంపించారట. అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌ సైతం తన స్నేహితుడి కూతురికి గోల్డ్‌ డాలర్స్‌ బహుమతిగా ఇచ్చారట.

Megastar Chiranjeevi: మనవరాలు క్లింకారకు చిరంజీవి దంపతుల స్పెషల్‌ గిఫ్ట్‌.. ఏమిచ్చారో తెలుసా?
Megastar Chiranjeevi Family
Follow us
Basha Shek

|

Updated on: Aug 09, 2023 | 6:30 AM

క్లింకార రాకతో మెగాస్టార్‌ ఫ్యామిలీ ఉబ్బితబ్బిబ్బవుతోంది. తమ ఇంట్లో అడుగుపెట్టిన మనవరాలిని చూసి చిరంజీవి సంబరపడిపోతున్నారు. ఇక పెళ్లైన 11 ఏళ్లకు బిడ్డ పుట్టడంతో రామ్‌ చరణ్‌- ఉపాసన దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. జూన్‌ నెలలో అపోలో ఆస్పత్రిలో ఉపాసన ఆడబిడ్డను ప్రసవించింది. ఇంటికొచ్చాక గ్రాండ్‌గా బారసాల వేడుక చేసి మెగా ప్రిన్సెస్‌కు క్లింకార కొణిదెల అని నామకరణం చేశారు. ఇక మెగా ప్రిన్సెస్‌ ముఖాన్ని చూసేందుకు అభిమానులు, నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే చాలామంది లాగే రామ్‌ చరణ్‌ దంపతులు కూడా తమ కూతురి విషయంలో చాలా గోప్యత పాటిస్తున్నారు. తమ కూతురి ఫొటోలు సోషల్‌ మీడియాలో రాకుండా జాగ్రత్త పడుతున్నారు. కాగా మెగా వారసురాలు క్లింకారకు సెలబ్రిటీల నుంచి పలు బహుమతులు వచ్చాయి. యంగ్‌ హీరో శర్వానంద్‌ చెర్రీ కూతురికి స్పెషల్‌ గిఫ్ట్‌ పంపించారట. అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌ సైతం తన స్నేహితుడి కూతురికి గోల్డ్‌ డాలర్స్‌ బహుమతిగా ఇచ్చారట. ఇక ఇటీవల అల్లు అర్జున్‌ తన కోడలికి క్లింకార పేరు, పుట్టిన తేదీ వివరాలతో డిజైన్‌ చేసిన బంగారు పలకను కానుకగా ఇచ్చారట. మరి మెగా వారసురాలికి మెగాస్టార్ దంపతులు కూడా ఓ స్పెషల్ గిఫ్ట్‌ ఇచ్చారని తెలుస్తోంది.

చిరంజీవి కుటుంబ సభ్యులు ఆంజనేయ స్వామిని ఎంత ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే తమ మనవరాలికి తమ ఇష్టదైవాన్నే ప్రతిరూపంగా ఇచ్చారట చిరంజీవి- సురేఖ దంపతులు. ఆంజనేయ స్వామి రూపంతో ఉన్న బంగారు డాలర్స్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేయించి క్లింకారకు కానుకగా ఇచ్చారట చిరంజీవి దంపతులు. ఇక ఉపాసన తల్లిదండ్రులు బంగారు ఊయలను బహుమతిగా ఇచ్చారని తెలుస్తోంది. కాగా చిరంజీవి నటించిన భోళాశంకర్‌ మరో రెండు రోజుల్లో రిలీజ్‌ కానుంది. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించింది. కీర్తి సురేష్‌ చిరంజీవి సోదరిగా కనిపించనుంది. సుశాంత్‌ ఓ కీలక పాత్రలో మెరిశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..