Bigg Boss 7 Telugu: ఇక ఆట షురూ.. ఆరోజు నుంచే బిగ్‌బాస్‌ సీజన్‌ 7.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్‌

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తోన్న బిగ్‌ బాస్‌ ఆటకు ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది. ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఏడో సీజన్‌కు రంగం సిద్ధమైంది. 'ఈసారి మాములుగా ఉండదు. ఉల్టా పల్టా' అంటూ ఇప్పటికే ప్రోమోలతో హైప్‌ క్రియేట్‌ చేసిన బిగ్‌బాస్‌ మేకర్స్‌ కొత్త సీజన్‌ ప్రారంభానికి సంబంధించిన కీలక అప్డేట్‌ ఇచ్చారు.

Bigg Boss 7 Telugu: ఇక ఆట షురూ.. ఆరోజు నుంచే బిగ్‌బాస్‌ సీజన్‌ 7.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్‌
Bigg Boss 7 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Aug 21, 2023 | 4:57 PM

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తోన్న బిగ్‌ బాస్‌ ఆటకు ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది. ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఏడో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ‘ఈసారి మాములుగా ఉండదు. ఉల్టా పల్టా’ అంటూ ఇప్పటికే ప్రోమోలతో హైప్‌ క్రియేట్‌ చేసిన బిగ్‌బాస్‌ మేకర్స్‌ కొత్త సీజన్‌ ప్రారంభానికి సంబంధించిన కీలక అప్డేట్‌ ఇచ్చారు. దీని ప్రకారం సెప్టెంబర్‌ 3 నుంచి బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ ప్రారంభం కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు బిగ్‌బాస్‌ నిర్వాహకులు. తాజాగా సీజన్‌ లాంఛింగ్‌కి సంబంధించిన ప్రోమో వీడియో బుల్లితెర ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో రమేశ్‌, రాధ అనే ఇద్దరు ప్రేమికులు ఉంటారు. వీరిలో రమేశ్‌.. కొండపై నుంచి జారి పడిపోబోతుంటే.. రాధ కొండపై నుంచి చున్నీ ఇచ్చి కాపాడేందుకు ప్రయత్నిస్తుంది. సాధారణంగా సినిమాల్లో ఇలాంటి సీన్స్‌లో రమేశ్‌ కచ్చితంగా బతుకుతాడు. అయితే ఈసారి బిగ్‌బాస్‌లో అలా జరగదంటూ హింట్ ఇచ్చారు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున.

ఎవరి ఊహలకు అందని విధంగా..

రమేశ్ ఇక పైకి వస్తాడు అనుకొనే సమయంలో రాధకు తుమ్ము రావడం, రమేశ్‌ పట్టుకున్న దుప్పట్టా వదిలేయడం, రమేశ్‌ లోయలో పడిపోవడం.. ఇలా ఎవరి ఊహకు అందకుండా ప్రోమో సాగుతుంది. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 7 కూడా ఇలాంటి ట్విస్టులతోనే సాగుతుందని చెప్పకనే చెప్పారు నాగార్జున. ‘ఎవరి ఊహకు అందని సీజన్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 7 సీజన్‌.. అంతా ఉల్టా పల్టా’ అని ఆఖరులో చెప్పుకొచ్చారు నాగార్జున. ఇందులోనే సెప్టెంబర్‌ 3వ తేదీనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ లాంచింగ్‌ ఉంటుందని మేకర్స్‌ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ మేకర్స్ ట్వీట్

ఫైనల్‌ లిస్ట్ ఇదేనా?

ఇక కంటెస్టెంట్స్‌ విషయానికొస్తే.. సోషల్‌ మీడియాలో చాలా పేర్లే వినిపిస్తున్నాయి. ఐశ్వర్య, అమర్‌దీప్‌, శోభా శెట్టి, అనూష, ఆట సందీప్‌, అంజలి, షీతల్ గౌతమన్, మహేష్, యావర్, శుభశ్రీ, షావలి, అనిల్, రష్మీ గౌతమ్‌, విష్ణుప్రియ, బుల్లెట్‌ భాస్కర్‌ పేర్లు ప్రముఖంగా తెరమీదకు వస్తున్నాయి. మరి వీరిలో ఎంతమంది బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారో అధికారికంగా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

బిగ్‏బాస్ 7 కంటెస్టెంట్స్ లిస్ట్

లిస్టులో ‘ మై విలేజ్ షో’ ఫేమ్ అనిల్..

ఫేమస్ యూట్యూబర్ షీతల్  కూడా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.