BRO OTT: పవన్‌ కల్యాణ్‌, తేజ్‌ల ‘బ్రో’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

భీమ్లానాయక్‌ వంటి హిట్‌ సినిమా తర్వాత పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటించిన చిత్రం 'బ్రో.. ది అవతార్‌. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ మరో కీ రోల్‌ పోషించాడు. కేతిక శర్మ, ప్రియాంక వారియర్‌ కథానాయికలు. తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన వినోదయ సీతమ్‌ రీమేక్‌గా బ్రో రూపొందింది

BRO OTT:  పవన్‌ కల్యాణ్‌, తేజ్‌ల 'బ్రో' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Bro The Avatar Movie
Follow us
Basha Shek

|

Updated on: Aug 20, 2023 | 11:13 AM

భీమ్లానాయక్‌ వంటి హిట్‌ సినిమా తర్వాత పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటించిన చిత్రం ‘బ్రో.. ది అవతార్‌. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ మరో కీ రోల్‌ పోషించాడు. కేతిక శర్మ, ప్రియాంక వారియర్‌ కథానాయికలు. తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన వినోదయ సీతమ్‌ రీమేక్‌గా బ్రో రూపొందింది. భారీ అంచనాలతో జులై 28న విడుదలైన ఈ మెగా మల్టీ స్టారర్‌ సూపర్‌హిట్‌గా నిలిచింది. మామా అల్లుళ్లు మొదటిసారి కలిసి నటించడంతో భారీ ఓపెనింగ్స్‌ను సొంతం చేసుకుంది. తొలి మూడురోజుల్లోనే వంద కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. పవన్‌ వింటేజ్‌ లుక్‌, స్టైల్, యాక్టింగ్‌, మేనరిజమ్స్‌.. పవర్‌స్టార్‌ ఓల్డ్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సాంగ్స్‌.. ఇలా అన్నీ అంశాలు పవన్‌ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విరూపాక్షతో వంద కోట్ల క్లబ్‌లో చేరిన సాయి ధరమ్‌ తేజ్‌ ఈ మూవీలోనూ సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌తో మెప్పించాడు. సినిమాలోని ఎమోషనల్‌ కంటెంట్‌కు మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో థియేటర్లలో సూపర్‌ హిట్‌గా నిలిచిన బ్రో ఓటీటీ రిలీజ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి కీ అప్‌డేట్‌ వచ్చింది. బ్రో.. ది అవతార్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది.

ఈక్రమంలో ఆగస్టు 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో బ్రో.. ది అవతార్‌ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. కాగా ముందుగా పవన్ కల్యాణ్ బర్త్ డేను పురస్కరించుకుని సెప్టెంబర్ 2న బ్రో సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే వారం రోజుల ముందే ఓటీటీలోకి అందుబాటులోకి రానుందీ సినిమా. సో..మెగా ఫ్యాన్స్ కు ముందే ట్రీట్ రానుందన్నమాట. ఇక బ్రో.. ది అవతార్ సినిమాకు తమన్‌ స్వరాలు సమకూర్చారు. పీపుల్స్‌ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఇక పవన్‌ సినిమాలోని శ్యాంబాబు క్యారెక్టర్‌పై దుమారం రేగిన సంగతి తెలిసిందే. పృథ్వీ పాత్ర తనను ఉద్దేశించే పెట్టారంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు ‘బ్రో’ యూనిట్‌పై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అలాగే ఈ సినిమా పెట్టుబడులకు సంబంధించి కూడా సంచలన ఆరోపణలు చేశారాయన. ఇలా రాజకీయంగానూ సెన్సేషన్‌ సృష్టించిన బ్రో సినిమాను థియేటర్లలో మిస్‌ అయి ఉంటే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

బ్రో ఓటీటీ విడుదలపై అప్డేట్స్

సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ ఇన్ స్టా పోస్ట్

View this post on Instagram

A post shared by Sai Dharam Tej (@jetpanja)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..