Spider Man OTT: ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్’.. ఎక్కడ చూడొచ్చంటే?

సూపర్‌ హీరోల సినిమాలకు సంబంధించి స్పైడర్‌ మ్యాన్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన దేశంలోనూ స్పైడర్‌ మ్యాన్‌ సిరీస్‌ సినిమాలకు చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. కాగా స్పైడర్‌ మ్యాన్‌ సిరీస్‌లో ఇప్పటివరకు పలు యాక్షన్‌ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే 2018 లో స్పైడర్‌ మ్యాన్‌ రోల్‌తో సోనీ ఓ సరికొత్త ప్రయోగం చేసింది. బ్లాక్ స్పైడర్ మ్యాన్ మైల్స్ మోరాలెస్ క్యారెక్టర్‌తో 'స్పైడర్‌మ్యాన్: ఇన్‌టూ ది స్పైడర్‌వర్స్’ అనే పూర్తి స్థాయి..

Spider Man OTT: ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్’.. ఎక్కడ చూడొచ్చంటే?
Spider Man Across The Spider Verse Movie
Follow us
Basha Shek

|

Updated on: Aug 10, 2023 | 6:00 AM

సూపర్‌ హీరోల సినిమాలకు సంబంధించి స్పైడర్‌ మ్యాన్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన దేశంలోనూ స్పైడర్‌ మ్యాన్‌ సిరీస్‌ సినిమాలకు చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. కాగా స్పైడర్‌ మ్యాన్‌ సిరీస్‌లో ఇప్పటివరకు పలు యాక్షన్‌ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే 2018 లో స్పైడర్‌ మ్యాన్‌ రోల్‌తో సోనీ ఓ సరికొత్త ప్రయోగం చేసింది. బ్లాక్ స్పైడర్ మ్యాన్ మైల్స్ మోరాలెస్ క్యారెక్టర్‌తో ‘స్పైడర్‌మ్యాన్: ఇన్‌టూ ది స్పైడర్‌వర్స్’ అనే పూర్తి స్థాయి యానిమేటెడ్‌ సినిమాను రూపొందించింది. ఈ ప్రయోగం సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. స్పైడర్‌ మ్యాన్‌ యాక్షన్‌ సినిమాలకు ఎలాంటి ఆదరణ దక్కిందో ఈ యానిమేటెడ్‌ మూవీస్‌కు అలాంటి క్రేజే వచ్చింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన చిత్రమే ‘స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్’. ఈ ఏడాది జూన్‌1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. మనదేశంలోనూ భారీ వసూళ్లు వచ్చాయి. ఈ మూవీలో ‘పవిత్ర ప్రభాకర్’ పేరుతో ఓ స్పెషల్‌ స్పైడర్ మ్యాన్ రో‌ల్‌ను కూడా క్రియేట్ చేశారు. దీనికి టీమిండియా యంగ్ క్రికెటర్‌ శుభ్‌మన్ గిల్‌ డబ్బింగ్‌ చెప్పడం విశేషం. ఇప్పుడీ సూపర్‌ హిట్‌ యానిమేటెడ్‌ మూవీ ఓటీటీలోకి వచ్చింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను కొనుగోలు చేసింది. ఈక్రమంలో బుధవారం నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. అయితే ప్రస్తుతం కేవలం రెంటల్‌ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే అమెజాన్‌ సబ్‌స్రైబర్లకు ఉచితంగా చూసే అవకాశం కల్పించవచ్చు. సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైనమెంట్ మోషన్ పిక్చర్ గ్రూప్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ‘స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్’ కి జోక్విమ్ డాస్ శాంటోస్, జస్టిన్ కె. థాంప్సన్, కెంప్ పవర్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స్పైడర్‌ మ్యాన్‌ ఫ్యాన్స్‌ తో పాటు చిన్న పిల్లలకు ఈ యానిమేటెడ్‌ మూవీ బాగా నచ్చుతుంది. కాగా ఈ సిరీస్‌లో మూడో పార్ట్‌ ‘స్పైడర్‌మ్యాన్: బియాండ్ ది స్పైడర్‌వర్స్’ 2024 మార్చి 29వ తేదీన రిలీజ్‌ కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..