Hollywood: హాలీవుడ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ కలకలం.. సమ్మెతో మూతపడిన ఇండస్ట్రీ.. మనకూ ముప్పుందా?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌. ఈ పేరుకు ఇప్పుడు హాలీవుడే అదిరిపడుతోంది. కోట్ల ఉద్యోగాలకు కొరివి పెట్టే AIపై పోరుబాట పట్టింది. దాన్ని బ్యాన్‌ చేయాలంటూ హాలీవుడ్‌ మొత్తం ఆందోళనకు దిగింది. లేదంటే తమ హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్‌ చేస్తోంది.

Hollywood: హాలీవుడ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ కలకలం.. సమ్మెతో మూతపడిన ఇండస్ట్రీ.. మనకూ ముప్పుందా?
Hollywood Industry
Follow us
Basha Shek

|

Updated on: Jul 14, 2023 | 6:47 PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌. ఈ పేరుకు ఇప్పుడు హాలీవుడే అదిరిపడుతోంది. కోట్ల ఉద్యోగాలకు కొరివి పెట్టే AIపై పోరుబాట పట్టింది. దాన్ని బ్యాన్‌ చేయాలంటూ హాలీవుడ్‌ మొత్తం ఆందోళనకు దిగింది. లేదంటే తమ హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్‌ చేస్తోంది. ఏఐ ఎఫెక్ట్‌ అన్ని వర్గాలపై పడుతుండడంతో ఇండస్ట్రీలోని ప్రతీ క్రాఫ్ట్‌ సమ్మెకు మద్దతు పలకడంతో షూటింగ్‌లకు బ్రేక్ పడింది. న్నడూ లేనంతగా హాలివుడ్‌కు AI రూపంలో ముప్పు పొంచి రావడంతో నటీనటులంతా కదం తొక్కారు. ఏఐతో పొంచి ఉన్న ప్రమాదంతో పాటు తమ భవిష్యత్‌కు భద్రత కల్పించేలా చూడాలంటూ ది స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ సమ్మెకు దిగింది. దీంతో హాలీవుడ్‌లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఆగిపోయాయి. వేల కోట్ల బిజినెస్‌ జరిగే హాలీవుడ్‌లో.. ఏఐ పెట్టిన చిచ్చు మహా మహా నటులనే రోడ్డుపైకి వచ్చేలా చేసింది. సమ్మెకు ఏంజెలినా జోలీ, మెరిల్‌ స్ట్రీప్‌, ట్రామ్‌ క్రూజ్‌ వంటి హాలీవుడ్ దిగ్గజ స్టార్లు కూడా మద్దతు ఇస్తున్నారు. నిర్మాణ స్టూడియోలతో జరిగిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో నిరవధిక సమ్మెకు దిగారు. గురువారం అర్ధరాత్రి నుంచి జరుగుతున్న ఈ సమ్మెలో లక్షా 60వేల మంది పాల్గొంటున్నారు.

కుదేలవుతోన్న సినీ ఇండస్ట్రీ..

1960లో హాలీవుడ్‌లో మొదటి సారి సమ్మె జరిగింది. తర్వాత 1980లో స్క్రీన్‌ యాక్టర్లు నిరసన తెలిపారు. మళ్లీ ఇన్నేళ్లకు రైటర్స్‌ గిల్డ్‌, స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ కలిసి సమ్మెకు పిలుపునివ్వడంతో.. 98 శాతం మంది సమ్మెకు మద్దతు పలికారు. దీంతో సినిమాతో పాటు వెబ్‌సిరీస్‌, టీవీ సీరియళ్లు ఆలస్యం కానున్నాయి. సమ్మె ఇలాగే కంటిన్యూ అయితే మూవీ రిలీజ్‌లు కూడా వాయిదా పడే అవకాశాలున్నాయి. ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమాల ప్రమోషన్లకు కూడా నటీనటులు దూరంగా ఉన్నారు. ఈ సమ్మె హాలీవుడ్‌ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయే సందర్భం. ఇప్పుడు కనుక తాము గళం విప్పకపోతే.. కష్టాల్లో పడకతప్పదని గిల్డ్‌ ప్రెసిడెంట్‌ ఫ్రాన్‌ డ్రెషర్‌ అన్నారు. అత్యాశకు పోతున్న AI స్టూడియోల వల్ల తాము బాధితులమవుతున్నామని వాపోయారు.

రోడ్డెక్కిన నటులు..

11 వారాలుగా తమ డిమాండ్లను గిల్డ్‌ వినిపిస్తూనే వస్తోంది. తాజాగా సమ్మెకు కూడా దిగడంతో హాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీ మూతపడింది. కృత్రిమ మేధస్సు కారణంగా నటులు వీధినపడే అకాశాలున్నాయి. ఐఏ శిక్షణ కోసం కొంతమంది పోలికలను స్కాన్‌ చేసి.. నిరవధికంగా ఆ సామర్ధ్యాన్ని వినియోగించుకునేలా చూడడం అందరికీ నష్టమేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏఐ నుంచి వ్యక్తిగత బ్రాండ్‌ రక్షణ కోరుతున్నారు. అంతేకాదు.. నటీనటుల సమ్మతి లేకుండా ఏఐని ప్రమోట్‌ చేయడానికి, వాయిస్‌ ఇవ్వడానికి వీళ్లేదన్నారు. తమ హక్కుల కోసం క్లాప్‌కు బ్రేక్‌ ఇచ్చి కదం తొక్కారు. ఎంతో మందికి జీవనోపాధిగా ఉన్న ఇండస్ట్రీపై ఏఐ ఎఫెక్ట్ తీవ్రంగా పడుతుందన్నారు. నటీనటులు, వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్టుల పోలికలతో ఏఐ స్టిస్టమ్‌కు శిక్షణ ఇచ్చే హక్కులను పొందడంపై చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాదు.. కాపీరైట్‌లకు కూడా రక్షణ కల్పించాలంటున్నారు. ఈ సమ్మె ఏఐకి కార్మికుల మధ్య జరుగుతున్న పోరుగా హాలీవుడ్‌ నటులు అభివర్ణించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..