Mahalakshmi: చిక్కుల్లో నటి మహాలక్ష్మి భర్త.. నిర్మాత రవీందర్‌పై పోలీస్‌ కేసు నమోదు.. కారణమేంటంటే?

మహాలక్ష్మితో పెళ్లి విషయంలో కూడా రవీందర్‌పై భారీగా ట్రోల్స్‌ వచ్చాయి. ముఖ్యంగా అతనిని బాడీ షేమింగ్‌ చేస్తూ పలువురు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక మహాలక్ష్మి కూడా డబ్బు కోసమే రవీందర్‌ను పెళ్లిచేసుకున్నట్లు విమర్శలు గుప్పించారు. ఇక ఆ మధ్యన ఈ దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయంటూ..

Mahalakshmi: చిక్కుల్లో నటి మహాలక్ష్మి భర్త.. నిర్మాత రవీందర్‌పై పోలీస్‌ కేసు నమోదు.. కారణమేంటంటే?
Mahalakshmi Husband Ravinder Chandrasekar
Follow us

|

Updated on: Jul 13, 2023 | 7:38 PM

ప్రముఖ కోలీవుడ్‌ ప్రొడ్యూసర్‌ రవీందర్‌ చంద్రశేఖరన్‌ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. సుమారు ఏడాదిన్నర క్రితం బుల్లితెర నటి మహాలక్ష్మి శంకర్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. వివాహమైనప్పటి నుంచి అతని పేరు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. మహాలక్ష్మితో పెళ్లి విషయంలో కూడా రవీందర్‌పై భారీగా ట్రోల్స్‌ వచ్చాయి. ముఖ్యంగా అతనిని బాడీ షేమింగ్‌ చేస్తూ పలువురు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక మహాలక్ష్మి కూడా డబ్బు కోసమే రవీందర్‌ను పెళ్లిచేసుకున్నట్లు విమర్శలు గుప్పించారు. ఇక ఆ మధ్యన ఈ దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయంటూ, విడాకులు కూడా తీసుకుంటున్నారంటూ ప్రచారమూ సాగింది. అయితే సోషల్‌ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకుంటున్నారీ లవ్లీ కపుల్‌. ఇటీవలే తన భర్త పుట్టిన రోజుకు మర్చిపోలేని బహుమతిని కూడా ఇచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రవీందర్‌ కోలీవుడ్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారారు. ఓ సినిమా విషయంలో ఆయనపై  చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు.

చెన్నై క్రైం బ్రాంచ్ పోలీసుల సమాచారం ప్రకారం.. ఇప్పటికే పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు రవీందర్‌ చంద్రశేఖరన్‌. ఇదే క్రమంలో అమెరికాలో ఉంటున్న విజయ్ అనే వ్యక్తితో కలిసి ఓ సినిమాను నిర్మించారు. మూవీ మంచి లాభాలు తెచ్చిపెడుతుందని రవీందర్‌ హామీ ఇవ్వడంతో విజయ్‌ ఏకంగా రూ. 15 లక్షలు ఇన్వెస్ట్‌ చేశారట. అయితే సినిమా రిలీజై నెలలు గడుస్తున్నా రవీందర్‌ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ లేదట. దీంతో విజయ్‌ పోలీసులను ఆశ్రయించాడు. తన డబ్బులు అడిగినప్పుడు రవీందర్‌ దూషిస్తున్నాడని, ఇప్పుడు తన ఫోన్‌ నంబర్‌ను కూడా బ్లాక్‌ చేశాడని నిర్మాతపై కేసు పెట్టాడు విజయ్‌. దీంతో కేసును వాపసు తీసుకోవాలని, డబ్బులు చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. అయినప్పటికీ రవీందర్ డబ్బులు చెల్లించకపోవడంతో మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు విజయ్‌. దీంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రవీందర్‌పై మనీలాండరింగ్‌ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతుందని, డబ్బులు తిరిఇ ఇవ్వకుంటే రవీందర్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.