Manchu Lakshmi: ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి.. మనోజ్‌ ఏమన్నాడో తెలుసా?

సినిమాల సంగతి పక్కన పెడితే.. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది మంచువారమ్మాయి. 'టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌' అనే ఒక ఎన్జీవోని స్థాపించిన ఆమె ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటోంది.

Manchu Lakshmi: ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి.. మనోజ్‌ ఏమన్నాడో తెలుసా?
Manchu Manoj, Manchu Lakshmi
Follow us
Basha Shek

|

Updated on: Jul 13, 2023 | 9:43 PM

నటిగా, యాంకర్‌గా, నిర్మాతగా… ఇలా తెలుగు సినిమా పరిశ్రమలో మల్టీ ట్యాలెంటెడ్‌ వుమన్‌గా గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మి. మోహన్‌బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె తన ట్యాలెంట్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది మంచువారమ్మాయి. ‘టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌’ అనే ఒక ఎన్జీవోని స్థాపించిన ఆమె ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటోంది. వాటి అభివృద్ధికి తన వంతు కృషిచేస్తోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో 500కు పైగా సర్కారి పాఠశాలలను దత్తత తీసుకుందామె. తాజాగా జోగుళాంబ గద్వాల జిల్లాలోని మరో 30కు పైగా ప్రభుత్వం స్కూళ్లను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి నడుంబిగించింది. దీంతో మంచులక్ష్మిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికే శ్రీకాకుళం, యాదాద్రి జిల్లాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు వందలాది ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నట్లు సమాచారం.

ఇక ఇటీవల జోగుళాంబ గద్వాల జిల్లాలో మరో 30 పాఠశాలలను కూడా దత్తతకు తీసుకుంది. తాజాగా ఈ విషయంపై మంచు మనోజ్‌ ఆసక్తికర పోస్ట్‌ పెట్టాడు. అక్కను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘జోగుళాంబ గద్వాల జిల్లాలో 30 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న మా అక్కని చూస్తే ఎంతో గర్వంగా ఉంది. ఈ ప్రయత్నం పిల్లల భవిష్యత్‌పై ఎంతో సానుకూల ప్రభావం చూపనుంది. ఇందుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన గద్వాల కలెక్టర్‌ వల్లూరు క్రాంతి గారికి నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం మనోజ్‌ ట్వీట్‌ నెట్టింట వైరలలవుతోంది. మంచు లక్ష్మి ఉదారతను అభిమానులు, నెటిజన్లు కొనియాడుతున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Manoj Manchu (@manojkmanchu)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.