Tom Cruise: వరల్డ్స్ బిగ్గెస్ట్ యాక్షన్ హీరో రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారా ?.. క్లారిటీ ఇచ్చిన టామ్ క్రూజ్..
వరల్డ్స్ బిగ్గెస్ట్ యాక్షన్ హీరో రిటైర్మెంట్ ప్రకటిస్తారా..? దాదాపు మూడున్న దశాబ్దాలుగా వరల్డ్ యాక్షన్ లవర్స్‌ను అలరిస్తున్న టాప్ హీరో త్వరలో వెండితెరకు గుడ్ బై చెప్పబోతున్నారు. కొద్ది రోజులుగా హాలీవుడ్‌లో వైరల్ అవుతున్న ఈ న్యూస్ విషయంలో ఫైనల్‌గా ఓ క్లారిటీ వచ్చేసింది. ఏంటా క్లారిటీ ఎవరా హీరో అనుకుంటున్నారా.. ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

హాలీవుడ్ యాక్షన్ స్టార్ టామ్ క్రూజ్ త్వరలో రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారన్న వార్తలు హాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వరల్డ్ వైడ్‌గా ఉన్న యాక్షన్ మూవీ లవర్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఈ విషయం టామ్ వరకు చేరటం రిటైర్మెంట్ న్యూస్‌పై క్లారిటీ ఇచ్చారు యాక్షన్ స్టార్. టామ్‌ను ఇంటర్నేషనల్ సూపర్ స్టార్‌గా నిలబెట్టిన సినిమా మిషన్ ఇంపాజిబుల్. అందుకే ఈ సిరీస్‌లో ఏకంగా ఆరు సినిమాలు చేశారు. ప్రజెంట్ సెవెన్త్ అండ్ ఎయిత్ ఇన్‌స్టాల్మెంటస్ సెట్స్ మీద ఉన్నాయి. ఈ రెండు సినిమాల తరువాత టామ్ రిటైర్ అవుతారన్న వార్తలు ట్రెండ్ అయ్యాయి. అయితే టామ్ మాత్రం అలాంటి ఆలొచనే లేదని చెప్పారు.
రీసెంట్‌గా రిలీజ్ అయిన ఇండియానా జోన్స్ అండ్ ది డైల్ ఆఫ్ డెస్టినీ సినిమాలో 80 ఏళ్ల వయసులో హీరోగా నటించారు హాలీవుడ్ లెజెండ్ హారిసన్ ఫోర్డ్. ఆయనే తనకు ఇన్‌స్పిరేషన్ అన్న టామ్, తను కూడా 80 ఏళ్లు వచ్చే వరకు మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో నటిస్తూనే ఉంటానని చెప్పారు. టామ్ రిటైర్మెంట్ వార్తల విషయంలో క్లారిటీ రావటంతో యాక్షన్ మూవీ లవర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అంతేకాదు హాలీవుడ్ మేకర్స్ కూడా టామ్ లీడ్ రోల్‌లో కొత్త కథలు తెర మీదకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.