Mahesh Babu: మహేష్ బాబు గొప్ప మనసు.. పేద పిల్లలకు అండగా సూపర్ స్టార్.. వైద్య సేవకు అంబాసిడర్‏గా..

యాడ్స్ ద్వారా వచ్చే మనీ పేద పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తారు మహేష్. కేవలం పిల్లల కోసమే సొంతంగా ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఉచిత హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు. కేవలం కోట్లు ఇచ్చే సంస్థల కోసమే కాదు.. సేవ చేసే సంస్థలకు సైతం మహేష్ బ్రాండ్ అంబాసిడర్.

Mahesh Babu: మహేష్ బాబు గొప్ప మనసు.. పేద పిల్లలకు అండగా సూపర్ స్టార్.. వైద్య సేవకు అంబాసిడర్‏గా..
Mahesh Babu
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 10, 2023 | 2:51 PM

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉండే పాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఒకటి రెండు కాదు.. మహేష్ చేతిలో దాదాపు ఎక్కువగానే యాడ్స్ ఉన్నాయి. కూల్ డ్రింగ్స్, ఫుడ్ నుంచి దుస్తులు, వాచెస్ ఇలా చాలా ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఇప్పటివరకు తెలుగు ఓ స్టార్ హీరో చేయ్యని యాడ్స్ మహేష్ చేశారు. అయితే తాను ఎక్కువగా యాడ్స్ చేయడానికి గల కారణాన్ని గతంలోనే వివరించారు మహేష్. యాడ్స్ ద్వారా వచ్చే మనీ పేద పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తారు మహేష్. కేవలం పిల్లల కోసమే సొంతంగా ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఉచిత హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు. కేవలం కోట్లు ఇచ్చే సంస్థల కోసమే కాదు.. సేవ చేసే సంస్థలకు సైతం మహేష్ బ్రాండ్ అంబాసిడర్.

మహేష్ బాబు ఓ ఎన్జీఓ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. Heal a Child అనే ఓ ఎన్జీఓ సంస్థకు మహేష్ బ్రాండ్ అంబాసిడర్‏గా ఉన్నారు. వైద్యం అవసరం ఉన్న పేద పిల్లలకు వైద్యాన్ని అందిస్తుంది ఈ సంస్థ. సోమవారం ఈ సంస్థ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి మహేష్ తన భార్య నమ్రతతో కలిసి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. మహేష్ బాబు గొప్ప మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి

ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరీ, శ్రీలీల కథానాయికలుగా నటిస్తుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా తర్వాత మహేష్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.