Samantha : ‘ఆరు నెలలు కష్టంగా గడిచాయి.. ఎలాగైన ముగింపు పలకాలి’.. సమంత పోస్ట్ వైరల్..

ఇటీవలే ఖుషి చిత్రీకరణ పూర్తి కాగా.. సిటాడెల్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలు పూర్తి కాగానే.. సామ్ ఏకంగా ఏడాది కాలం బ్రేక్ తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. సమంత ఇంకా మయోసైటిస్ సమస్య తగ్గలేదని.. త్వరలోనే అమెరికాలో ఈ సమస్యకు చికిత్స తీసుకోబోతుందని.. పూర్తి కోలుకున్నాకే ఇండియాకు తిరిగివస్తుందని.. అందుకే ఇప్పటికే మిగతా చిత్రాలకు తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా రిటర్న్ ఇచ్చేసిందని సమాచారం.

Samantha : 'ఆరు నెలలు కష్టంగా గడిచాయి.. ఎలాగైన ముగింపు పలకాలి'.. సమంత పోస్ట్ వైరల్..
Samantha Ruth Prabu
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 10, 2023 | 3:17 PM

గత రెండేళ్లుగా టాలీవుడ్ హీరోయిన్ సమంత పేరు నెట్టింట ఎక్కువగానే వినిపిస్తోంది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి నిత్యం ఏదో ఒక వార్త ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంటుంది. విడాకులు.. ఆ తర్వాత మూవీస్.. మయోసైటిస్ సమస్య.. మానసిక సంఘర్షణ.. ఇలా అన్ని ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయనే చెప్పొచ్చు. గత కొన్నాళ్లుగా మయోసైటిస్ సమస్యతో పోరాడుతున్న సామ్..కాస్త కోలుకోగానే తన సినిమాలు కంప్లీట్ చేసే పనిలో పడింది. ప్రస్తుతం ఆమె ఖుషి, సిటాడెల్ చిత్రాల్లో నటిస్తుంది. ఇటీవలే ఖుషి చిత్రీకరణ పూర్తి కాగా.. సిటాడెల్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలు పూర్తి కాగానే.. సామ్ ఏకంగా ఏడాది కాలం బ్రేక్ తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. సమంత ఇంకా మయోసైటిస్ సమస్య తగ్గలేదని.. త్వరలోనే అమెరికాలో ఈ సమస్యకు చికిత్స తీసుకోబోతుందని.. పూర్తి కోలుకున్నాకే ఇండియాకు తిరిగివస్తుందని.. అందుకే ఇప్పటికే మిగతా చిత్రాలకు తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా రిటర్న్ ఇచ్చేసిందని సమాచారం. అయితే ఈ వార్తలపై సామ్ కానీ.. ఆమె టీం కానీ స్పందించలేదు.

అయితే గత కొద్ది రోజులుగా సామ్ తన సోషల్ మీడియా ఖాతాలలో పెట్టే మెసేజెస్ చూస్తుంటే ఆమె అమెరికా వెళ్లడం నిజమే అంటున్నారు. తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో.. మరో మూడు రోజుల్లో కారవన్ లైఫ్ స్టార్ట్ కాబోతుంది అంటూ రాసుకొచ్చింది సామ్. అంటే ఇక ఆమె బయటకు రాకుండా విశ్రాంతి తీసుకోబోతుందని తెలుస్తోంది. అలాగే మరో ఫోటోలో.. ఈ ఆరు నెలలు చాలా కష్టమైన రోజులు.. ఎలాగైనా దీనికి ముగింపు పలకాలి అంటూ తన ఫోటోను షేర్ చేసింది. అందులో సమంత పూర్తిగా మారిపోయి.. వీక్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె పోస్టులు నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి
Samantha

Samantha

అయితే సమంత పోస్టులకు నెటిజన్స్ ఆమెకు ధైర్యం చెబుతున్నారు. బీ స్ట్రాంగ్ అని.. సామ్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సామ్, విజయ్ దేవరకొండ జంటగా నటించిన ఖుషి చిత్రం త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్ ఆకట్టుకోగా.. మరో పాటను విడుదల చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.