Pankaj Tripathi: ప్రముఖ నటుడి ఇంట తీవ్ర విషాదం.. అనారోగ్యంతో కన్నుమూసిన పంకజ్ త్రిపాఠి తండ్రి
'ఓ మై గాడ్ 2 ' సినిమా సక్సెస్‌తో సంతోషంలో ఉన్న ప్రముఖ సినీ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి పండిట్ బనారస్ తివారీ (99) సోమవారం కన్నుమూశారు. బిహార్‌లోని బెల్‌సంద్ గ్రామంలో ఆయన తుది శ్వాస విడిచారు. పండిట్ బనారస్ తివారీ గత కొన్ని రోజులుగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని కుటుంబ వర్గాలు తెలిపాయి
‘ఓ మై గాడ్ 2 ‘ సినిమా సక్సెస్‌తో సంతోషంలో ఉన్న ప్రముఖ సినీ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి పండిట్ బనారస్ తివారీ (99) సోమవారం కన్నుమూశారు. బిహార్‌లోని బెల్‌సంద్ గ్రామంలో ఆయన తుది శ్వాస విడిచారు. పండిట్ బనారస్ తివారీ గత కొన్ని రోజులుగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని కుటుంబ వర్గాలు తెలిపాయి. సోమవారం ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించి తుదిశ్వాస విడిచారని పంకజ్ కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా తన తండ్రి మరణ వార్త విన్న వెంటనే ముంబై నుండి తన గ్రామానికి బయలుదేరాడు పంకజ్ త్రిపాఠి. కాగా పలు సందర్భాల్లో తన తండ్రిపై ప్రేమను చాటుకున్నారు పంకజ్ త్రిపాఠి. ఉద్యోగ రీత్యా ఆయన ముంబైలో స్థిరపడినా.. తల్లిదండ్రుల వద్దకు తరచూ వెళ్లేవారు. ఊరికి వెళ్లినప్పుడు ఎప్పుడూ నాన్నతోనే గడిపేవారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లతో పాటు పలు ఇంటర్వ్యూలలో కూడా పంకజ్ తన తల్లిదండ్రుల గొప్పతనం గురించి చెప్పుకొచ్చాడు ‘నా తల్లిదండ్రులు నా నిర్ణయాలను గౌరవించకపోతే, నేను ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. మా నాన్న చాలా అమాయకుడు కాబట్టి ఆయనకు థియేటర్, యాక్టింగ్ లాంటివి గురించి ఏమీ తెలియదు. నేను ముంబయిలో స్థిరపడ్డప్పుడు, మా నాన్న నన్ను చూడటానికి ఇక్కడికి వచ్చిచ్చారు. ఇక్కడి ఎత్తైన భవనాలు, గుంపులు గుంపలుగా ఉన్న జనాలను చూసి భయపడ్డారు. ఇక్కడి జీవన పరిస్థితులు వారికి అస్సలు నచ్చలేదు. అందుకే ఆయన ఇక ముంబైకి తిరిగి రాలేదు’ అని చెప్పుకొచ్చారీ బాలీవుడ్ యాక్టర్.
కాగా పంకజ్ త్రిపాఠి నటించిన ‘ఓ మై గాడ్ 2’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇందులో పంకజ్ త్రిపాఠి నటనకు ప్రశంసలు అందుతున్నాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుండగానే పంకజ్ త్రిపాఠి ఫ్యామిలీలో విషాదం నెలకొంది. కాగా బాలీవుడ్‌లో వెర్సటైల్ యాక్టర్లలో పంకజ్ ఒకరు. పలు సూపర్‌హిట్ సినిమాల్లో ఆయన నటించారు. తెలుగులో మంచు విష్ణు నటించిన దూసుకెళ్లా సినిమాలో విలన్‌గా కూడా మెరిశారు. ఇక మీర్జాపూర్ లాంటి వెబ్ సిరీస్‌ల్లోనూ పంకజ్ మెరుస్తున్నారు.
పంకజ్ త్రిపాఠి ఫ్యామిలీ ఫొటోస్
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.