Surya Kala

Surya Kala

Sub Editor - TV9 Telugu

suryakala.arigela@tv9.com

ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియాలో కలిపి దాదాపు 10సంవత్సరాలు సబ్ ఎడిటర్‌గా, ప్రోగ్రాం ప్రొడ్యూసర్‌గా విధులను నిర్వహిస్తున్నాను. టీవీ 5 లో వెబ్ సైట్‌లో సబ్ ఎడిటర్ గా 4.6 సంవత్సరాలు, ప్రైమ్ 9, 99 న్యూస్ ఛానల్‌లో సబ్ ఎడిటర్, ప్రోగ్రాం ప్రొడ్యూసర్, స్పెషల్ స్టోరీ రైటర్‌గా 4 ఏళ్లు ఉద్యోగం చేశాను.. టీవీ 9 వెబ్ సైట్‌లో సబ్ ఎడిటర్‌గా 2021 నుంచి ఉద్యోగం చేస్తున్నాను ..

Read More
పరకడుపున వెల్లుల్లి రెబ్బ తినడంతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

పరకడుపున వెల్లుల్లి రెబ్బ తినడంతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

వెల్లుల్లి ఔషధాల గని.. వెల్లుల్లిలో ఉండే యాంటీ బయోటిక్ గుణాలు అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. ఉదయాన్నే పరకడుపున ఒకే ఒక వెల్లుల్లి రెబ్బ తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. raw garlic

Travel India: సెప్టెంబరులో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారా.. ట్రావెలింగ్‌కు బెస్ట్ ప్లేసెస్ మీ కోసం

Travel India: సెప్టెంబరులో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారా.. ట్రావెలింగ్‌కు బెస్ట్ ప్లేసెస్ మీ కోసం

ప్రకృతి అంటే అందరికి ఇష్టం.. ఏ మాత్రం సెలవులు దొరికినా సరే వివిధ ప్రదేశాలను సందర్శించాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో సెప్టెంబరులో ఏదైనా ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. ఈ ప్రదేశాలను సందర్శించండి. అయితే సెప్టెంబరులో ఎక్కడికైనా వెళ్లాలని కోరుకుంటుంటే.. ఈ నెలలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. భారతదేశంలోని చాలా ప్రాంతాలు పచ్చదనంతో నిండిపోయి అందంగా కనిపిస్తాయి. ఈ ప్రదేశాలు సెప్టెంబరులో ప్రయాణించడానికి ఉత్తమమైనవి.

IIT Bombay: గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఐఐటీ బాంబేకి 160 కోట్ల విరాళం..ప్రొఫెసర్ ఏమి చెప్పారంటే..

IIT Bombay: గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఐఐటీ బాంబేకి 160 కోట్ల విరాళం..ప్రొఫెసర్ ఏమి చెప్పారంటే..

భారతదేశంలోని టాప్ ఇంజినీరింగ్ కాలేజీల లిస్ట్ లో ఐఐటీ బాంబే పేరు మూడో స్థానంలో ఉంది. మరోవైపు..  ప్రపంచవ్యాప్తంగా ఈ ఐఐటీ సంస్థ కూడా ఖ్యాతిగాంచిందే.. ఈ సంస్థ పనితీరు గురించి చెప్పాలంటే.. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2023-24లో IIT బాంబే 149వ ర్యాంక్‌ను పొందింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్,  ఫ్యాకల్టీలో అగ్రస్థానంలో ఉన్న ఈ ఇన్‌స్టిట్యూట్ ఇప్పుడు విరాళాలతో వార్తల్లో నిలిచింది.

Bansi Narayan Temple: ఈ ఆలయం వెరీ వేరీ స్పెషల్.. ఒక్క రాఖీ రోజు మాత్రమే తెరుచుకుంటుంది.. ప్రయాణం చేయాలంటే సాహసం చేయాల్సిందే..

Bansi Narayan Temple: ఈ ఆలయం వెరీ వేరీ స్పెషల్.. ఒక్క రాఖీ రోజు మాత్రమే తెరుచుకుంటుంది.. ప్రయాణం చేయాలంటే సాహసం చేయాల్సిందే..

ఈ రాఖీ పండగకు మరొక విశిష్టత కూడా ఉంది. మన దేశంలో ఉన్న అనేక ఆలయాలు భక్తులతో పూజలను అందుకుంటారు. ప్రతి ఒక్క దేవాలయం భిన్నమైన కథలు, విశిష్టతను కలిగి ఉంది. అయితే రాఖీ పండగకు సంబంధం ఉన్న ఆలయం ఉంది. ఈ ఆలయం రాఖీ రోజున మాత్రమే తెరుచుకుంటుంది. ఈ రోజు ఆ  దేవాలయం ఎక్కడ ఉంది.. ఎలా చేరుకోవచ్చో తెలుసుకుందాం.. 

Beauty Care Tips: చర్మం ముడుతలు తగ్గి మెరుపు కోసం బొప్పాయి మంచి ఎంపిక.. స్మూత్ స్కిన్ కోసం ఎలా అప్లై చేయాలంటే..

Beauty Care Tips: చర్మం ముడుతలు తగ్గి మెరుపు కోసం బొప్పాయి మంచి ఎంపిక.. స్మూత్ స్కిన్ కోసం ఎలా అప్లై చేయాలంటే..

పండిన బొప్పాయి చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచి, చర్మాన్ని డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. పండిన బొప్పాయిని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మంపై ముడుతలను నివారిస్తుంది. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. మచ్చలను తొలగిస్తుంది. పండిన బొప్పాయిని ముఖానికి ఎలా అప్లై చేయాలి.. ఈ రోజు కొన్ని స్కిన్ కేర్ చిట్కాల గురించి తెలుసుకుందాం.. 

Tirupati : ఆ ఎమ్మెల్యే స్టయిలే వేరు.. అమ్మవారికి సారె తీసుకుని వెళ్తున్న భక్తులతో కలిసి వీరతాడు నృత్యం

Tirupati : ఆ ఎమ్మెల్యే స్టయిలే వేరు.. అమ్మవారికి సారె తీసుకుని వెళ్తున్న భక్తులతో కలిసి వీరతాడు నృత్యం

గ్రామంలో జరుగుతున్న జాతరలో భాగంగా గంగమ్మకు ఊరేగింపుగా యాదవులు సారెను తీసుకుని వెళ్తున్నారు. ఈ సమయంలో యాదవులతో కలిసి పోయిన ఎమ్మెల్యే సంబరాల్లో పాల్గొన్నారు. గంగ పెట్టెతో గంగమ్మకు సారె తీసుకుని వీరతాడు నృత్యం చేసిన యాదవులతో కలిసి నృత్యం చేశారు.

Viral Video: ఒకరిది ఆకలి తీర్చుకోవడనికి ఆరాటం.. మరొకదారి ప్రాణాల కోసం పోరాటం.. వీడియో వైరల్..

Viral Video: ఒకరిది ఆకలి తీర్చుకోవడనికి ఆరాటం.. మరొకదారి ప్రాణాల కోసం పోరాటం.. వీడియో వైరల్..

వైరల్ అవుతున్న వీడియోలో గేట్ వద్ద ఒక పాము కప్పను నోట కరుచుకుంది. ఆ కప్పను తన వైపుకు లాగడానికి పాము ప్రయత్నిస్తుండగా..  కప్ప తన ప్రాణాలను కాపాడుకోవడానికి పైకి ఎక్కుతోంది. ఇలా కప్పు పైకి ఎక్కుతూ ప్రాణాల కోసం పోరాడుతున్న సమయంలో పాము పట్టు కొన్ని సెకన్ల పాటు సడలినట్లు ఉంది.  కప్పపై తన పట్టును వదిలింది.

Vastu Tips for Kitchen: వంట గదికి కొన్ని వాస్తు నియమాలు.. వంట చేయడం నుంచి తినడం వరకూ ఉన్న నియమాలు ఏమిటో తెలుసుకోండి..

Vastu Tips for Kitchen: వంట గదికి కొన్ని వాస్తు నియమాలు.. వంట చేయడం నుంచి తినడం వరకూ ఉన్న నియమాలు ఏమిటో తెలుసుకోండి..

రోజు ప్రారంభంలో మొదటిగా ప్రవేశించే గది వంటగది.. కనుక ఈ వంటగది విషయంలో కొన్ని వాస్తు నియమాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వంట చేసేటప్పుడు మీ ముఖం దక్షిణం వైపు ఉండకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆహారం దక్షిణ ముఖం కాకుండా ఉత్తరం, పడమర వైపుగా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని సభ్యులు ఆర్ధిక ఇబ్బందులు లేకుండా జీవిస్తారు. అంతేకాదు దక్షిణ ముఖం వైపు వంట చేయడం వలన కుటుంబంలో పేదరికంతో ఇబ్బంది పాలవుతారు. 

Varalakshmi Vratam 2023: ఈ రోజు వరలక్ష్మి వ్రతం.. లక్ష్మీదేవి ఆరాధనకు శుభ సమయం.. పూజ విధానం

Varalakshmi Vratam 2023: ఈ రోజు వరలక్ష్మి వ్రతం.. లక్ష్మీదేవి ఆరాధనకు శుభ సమయం.. పూజ విధానం

ఆగస్టు 25 శుక్రవారం అంటే ఈరోజు వరలక్ష్మీ మాత పూజకు నాలుగు శుభ ముహూర్తాలు ఉన్నాయి. తొలి శుభ ముహూర్తం ఉదయం 5.55 నుంచి 7.42 వరకు. రెండవ శుభ ముహూర్తం మధ్యాహ్నం 12:17 నుండి 2:36 వరకు. తృతీయ శుభ ముహూర్తం సాయంత్రం 6.22 నుంచి 7.50 వరకు. పూజకు నాల్గవ శుభ సమయం రాత్రి 10:50 నుండి 12:45 వరకు. అయితే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి అత్యంత పవిత్రమైన సమయం ప్రదోషకాలంలో పరిగణించబడుతుంది.

Lokesh Vs YCP: ఏలూరిలోకి అడుగు పెట్టనున్న లోకేష్.. టీడీపీ అధికారంలోకి వచ్చేదే లేదంటున్న వైసీపీ నేతలు..

Lokesh Vs YCP: ఏలూరిలోకి అడుగు పెట్టనున్న లోకేష్.. టీడీపీ అధికారంలోకి వచ్చేదే లేదంటున్న వైసీపీ నేతలు..

లోకేష్, అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎంపీ విజయసాయిరెడ్డి. వారి వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదన్నారు విజయసాయిరెడ్డి. ఓట్ల తొలగింపుపై టీడీపీది తప్పుడు ప్రచారమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దొంగ ఓట్లను గుర్తించి తొలగిస్తే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.

Brics Summit 2023: బ్రిక్స్‌ కూటమి విస్తరణ.. కొత్తగా ఆరుదేశాలకు చోటు.. కొత్త శక్తి వచ్చిందన్న ప్రధాని మోడీ

Brics Summit 2023: బ్రిక్స్‌ కూటమి విస్తరణ.. కొత్తగా ఆరుదేశాలకు చోటు.. కొత్త శక్తి వచ్చిందన్న ప్రధాని మోడీ

ఇప్పటివరకు ఐదు దేశాల కూటమిగా ఉన్న ‘బ్రిక్స్‌’ మరింత విస్తరించనుంది. కొత్తగా మరో ఆరు దేశాలు చేరనున్నాయి. ఇందుకు కూటమి సభ్యదేశాలు అంగీకరించాయి. బ్రిక్స్​లో ఆరు కొత్త దేశాలను చేర్చుకోవడం వల్ల కూటమికి కొత్త శక్తి వచ్చిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బ్రిక్స్ కూటమి విస్తరణ, ఆధునీకరణ.. అంతర్జాతీయ సంస్థలన్నీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలనే సందేశాన్ని ఇస్తుందని తెలిపారు.

Viral Video: భారత్ డబ్బులు ఖర్చు చేసి ఇప్పుడు చంద్రుడిపైకి వెళ్ళింది.. మేము ఎప్పటి నుంచో ఉన్నామంటున్న పాకిస్థానీ.. ఫన్నీ వీడియో వైరల్..

Viral Video: భారత్ డబ్బులు ఖర్చు చేసి ఇప్పుడు చంద్రుడిపైకి వెళ్ళింది.. మేము ఎప్పటి నుంచో ఉన్నామంటున్న పాకిస్థానీ.. ఫన్నీ వీడియో వైరల్..

పాకిస్థానీ యూట్యూబర్ సోహైబ్ చౌదరి ఈ వ్యక్తిని చంద్రయాన్-3 గురించి ప్రశ్నించినప్పుడు.. అతను నవ్వుతూ తన దేశంలోని లోపాలను డిఫరెంట్ గా చెప్పడంతో పాటు తమ దేశ పరిస్థితులను ఎగతాళి చేయడం ప్రారంభించాడు. భారత్ ఇప్పుడు చంద్రుడిలో అడుగు పెట్టింది.. అయితే మేము ఎప్పటి నుంచో చంద్రునిపై జీవిస్తున్నామని ఆ వ్యక్తి చెప్పాడు.