Bansi Narayan Temple: ఈ ఆలయం వెరీ వేరీ స్పెషల్.. ఒక్క రాఖీ రోజు మాత్రమే తెరుచుకుంటుంది.. ప్రయాణం చేయాలంటే సాహసం చేయాల్సిందే..

ఈ రాఖీ పండగకు మరొక విశిష్టత కూడా ఉంది. మన దేశంలో ఉన్న అనేక ఆలయాలు భక్తులతో పూజలను అందుకుంటారు. ప్రతి ఒక్క దేవాలయం భిన్నమైన కథలు, విశిష్టతను కలిగి ఉంది. అయితే రాఖీ పండగకు సంబంధం ఉన్న ఆలయం ఉంది. ఈ ఆలయం రాఖీ రోజున మాత్రమే తెరుచుకుంటుంది. ఈ రోజు ఆ  దేవాలయం ఎక్కడ ఉంది.. ఎలా చేరుకోవచ్చో తెలుసుకుందాం.. 

Bansi Narayan Temple: ఈ ఆలయం వెరీ వేరీ స్పెషల్.. ఒక్క రాఖీ రోజు మాత్రమే తెరుచుకుంటుంది.. ప్రయాణం చేయాలంటే సాహసం చేయాల్సిందే..
Bansi Narayan Temple Urgam
Follow us
Surya Kala

| Edited By: Vimal Kumar

Updated on: Jan 05, 2024 | 5:47 PM

హిందువులు జరుపుకునే ప్రతి పండుగకు దాని స్వంత ప్రాముఖ్యత ఉంది. ఉగాది, సంక్రాంతి, దీపావళి, వరలక్ష్మి వ్రతం, రాఖీ, వినాయక చవితి వంటి అనేక పండుగలున్నాయి. ఆయా ఆయా కాలాల్లో వచ్చే పండగలు వాటికి తగిన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అయితే రాఖీ పండగ హిందువుల పండగ అయినా దేశ వ్యాప్తంగా కులమతాలకు అతీతంగా జరుపుకుంటారు. ఈ పండగ కోసం సోదరీమణులు ఏడాదిగా ఎదురుచూస్తారు .. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో అంటే ఈ నెల 30వ తేదీన రాఖీ పండుగ రాబోతోంది. ఇప్పటికే రాఖీలు మార్కెట్లో కొలువు దీరాయి. రకరకాల రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ రాఖీ పండగకు మరొక విశిష్టత కూడా ఉంది. మన దేశంలో ఉన్న అనేక ఆలయాలు భక్తులతో పూజలను అందుకుంటారు. ప్రతి ఒక్క దేవాలయం భిన్నమైన కథలు, విశిష్టతను కలిగి ఉంది. అయితే రాఖీ పండగకు సంబంధం ఉన్న ఆలయం ఉంది. ఈ ఆలయం రాఖీ రోజున మాత్రమే తెరుచుకుంటుంది. ఈ రోజు ఆ  దేవాలయం ఎక్కడ ఉంది.. ఎలా చేరుకోవచ్చో తెలుసుకుందాం..

ఈ ఆలయం ఎక్కడ ఉందంటే..

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉన్న వంశీనారాయణ దేవాలయం ఒక్క రాఖీ పండగ రోజున మాత్రమే తెరుస్తారు. ఈ ఆలయానికి వెళ్లాలంటే.. చమోలిలోని ఉర్గామ్ వ్యాలీకి చేరుకోవాలి. ఈ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడింది. అందుకే దీనిని వంశీనారాయణ ఆలయం అని పిలుస్తారు. స్థానిక ప్రజలు ఈ ఆలయాన్ని వంశీనారాయణ అని కూడా పిలుస్తారు. ఆలయంలో శివుడు, గణేశుడు, వాన్ దేవి విగ్రహాలు కూడా ప్రతిష్టించి ఉన్నాయి.

రాఖీ పండగ రోజున తెరచుకుని ఆలయం

ఆలయ తలుపులు ఏడాది పొడవునా మూసి ఉంటాయి.. రాఖీ రోజున మాత్రమే తెరుస్తారు. రాఖీ రోజున స్థానిక ప్రజలు ఆలయాన్ని శుభ్రం చేసి ప్రార్థనలు చేస్తారు. ఇక్కడ స్థానికులు రాఖీ పండుగను కూడా జరుపుకుంటారని చెబుతారు. రాఖీ పండుగను జరుపుకునే ముందు.. ఆలయంలో పూజలు చేస్తారు.

ఇవి కూడా చదవండి

పురాణాల కథనం ప్రకారం..

హిందూ విశ్వాసం ప్రకారం బలి అహంకారాన్ని అణిచివేసేందుకు విష్ణువు వామనునిగా అవతరించాడు. ఇంతలో బాలి విష్ణువును తన ద్వారపాలకుడిగా చేస్తానని వాగ్దానం చేసి.. తన ద్వారపాలకుడిగా నియమించుకున్నాడు. అయితే తన భర్త మహా విష్ణువుని తిరిగి తీసుకురావాలని కోరుకుంది. అప్పుడు నారద ముని రాజు బాలికి రక్షా బంధన్ కట్టమని.. లక్ష్మీదేవికి పరిష్కారాన్ని సూచించాడు. మారుమూల లోయలో లక్ష్మీదేవి ఇక్కడ కొలువుదీరిన తర్వాతే రాఖీ పండగను జరుపుకోవడం ప్రారంభమైందని విశ్వాసం.

వెన్న నైవేద్యం

ఈ ఆలయానికి సంబంధించి ఒక పురాణగాథ ఉంది. విష్ణువు వామన అవతారం తర్వాత ఇక్కడే అవతారం చాలించాడని చెబుతారు. ప్రజలు గుడి దగ్గర ప్రసాదం చేస్తారు. ఈ ప్రసాదం కోసం ప్రతి ఇంటి నుండి వెన్నను సేకరిస్తారు. అనంతరం ప్రసాదాన్ని తయారు చేసిన తరువాత.. దానిని విష్ణువుకు సమర్పిస్తారు.

ఎలా ఆలయానికి వెళ్లంటే

ఈ ఆలయం ఉర్గాం గ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే కొన్ని కిలోమీటర్లు నడవాలి. రైలులో వెళుతున్నట్లయితే.. హరిద్వార్ రిషికేశ్ రైల్వే స్టేషన్‌లో దిగాలి. రిషికేశ్ నుండి జోషిమఠం  వరకు దూరం దాదాపు 225 కి.మీ. ఈ లోయ జోషిమఠం  నుండి 10 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ నుండి మీరు ఉర్గాం గ్రామానికి చేరుకోవచ్చు. దీని తర్వాత కాలినడకన వెళ్లి వంశీనారాయణ దేవాలయానికి చేరుకోవాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)