Tirupati : ఆ ఎమ్మెల్యే స్టయిలే వేరు.. అమ్మవారికి సారె తీసుకుని వెళ్తున్న భక్తులతో కలిసి వీరతాడు నృత్యం

గ్రామంలో జరుగుతున్న జాతరలో భాగంగా గంగమ్మకు ఊరేగింపుగా యాదవులు సారెను తీసుకుని వెళ్తున్నారు. ఈ సమయంలో యాదవులతో కలిసి పోయిన ఎమ్మెల్యే సంబరాల్లో పాల్గొన్నారు. గంగ పెట్టెతో గంగమ్మకు సారె తీసుకుని వీరతాడు నృత్యం చేసిన యాదవులతో కలిసి నృత్యం చేశారు.

Tirupati : ఆ ఎమ్మెల్యే స్టయిలే వేరు.. అమ్మవారికి సారె తీసుకుని వెళ్తున్న భక్తులతో కలిసి వీరతాడు నృత్యం
MLA Biyyapu Madhusudhan Reddy
Follow us
Surya Kala

| Edited By: Vimal Kumar

Updated on: Jan 05, 2024 | 5:49 PM

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జనంలో మమేకమయ్యేందుకు లీడర్లు అన్ని ఎత్తులు వేస్తున్నారు. జనంతో కలిసి సందడి చేసి మీలో ఒకరిమని కలిసి పోయేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇలా తిరుపతి జిల్లాలో ఒక ఎమ్మెల్యే వీరతాడు తో స్టెప్పులు వేశారు. మామూలుగానే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ది ఒక డిఫరెంట్ స్టయిల్. జనంలో ఎప్పుడూ సందడి చేసే నైజమున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ తానొక ప్రత్యేకమని చాటే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాళహస్తిలోనైనా అసెంబ్లీ లోనైనా ఆకట్టుకునే స్టైల్ ఆ ఎమ్మెల్యే ది. తన ఆహభావాలతో, మాటలతో జోకుకేసి జనం ఆకర్షించే ప్రయత్నం చేసే ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గ్రామాల్లో గడపగడప కార్యక్రమాల్లో తనదైన శైలిలో రాణిస్తున్నారు. ఇందులో భాగంగానే రేణిగుంట మండలం అత్తూరులో యాదవులతో కలిసి స్టెప్పులు వేశారు.

గ్రామంలో జరుగుతున్న జాతరలో భాగంగా గంగమ్మకు ఊరేగింపుగా యాదవులు సారెను తీసుకుని వెళ్తున్నారు. ఈ సమయంలో యాదవులతో కలిసి పోయిన ఎమ్మెల్యే సంబరాల్లో పాల్గొన్నారు. గంగ పెట్టెతో గంగమ్మకు సారె తీసుకుని వీరతాడు నృత్యం చేసిన యాదవులతో కలిసి నృత్యం చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అత్తూరుకి వెళ్ళిన ఎమ్మెల్యే బియ్యపు మధు యాదవులతో కలిసి వీరతాడు తీసుకొని అదరగొట్టే స్టెప్పులు వేశారు.

గ్రామస్తులతో కలిసి సందడి చేసిన ఎమ్మెల్యే

రెండు రోజుల క్రితం రేణిగుంట మండలం దేశమ్మ నగర్ లోనూ మహిళలతో కలిసి కోలాటం ఆడారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన తనకు స్వాగతం పలుకుతూ మహిళలు కోలాటం వేయడాన్ని చూసిన ఎమ్మెల్యే మధు సూదన్ రెడ్డి మహిళలతో కలిసి కోలాటంలో మునిగిపోయారు. మహిళలతో కలిసి స్టెప్పులేసి కోలాటం తో సందడి చేశారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో  జనంలో ఉండేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్ని ఎమ్మెల్యేలు , రాజకీయ నేతలు వదులుకోవడం లేదని కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..