Viral Video: భారత్ డబ్బులు ఖర్చు చేసి ఇప్పుడు చంద్రుడిపైకి వెళ్ళింది.. మేము ఎప్పటి నుంచో ఉన్నామంటున్న పాకిస్థానీ.. ఫన్నీ వీడియో వైరల్..

పాకిస్థానీ యూట్యూబర్ సోహైబ్ చౌదరి ఈ వ్యక్తిని చంద్రయాన్-3 గురించి ప్రశ్నించినప్పుడు.. అతను నవ్వుతూ తన దేశంలోని లోపాలను డిఫరెంట్ గా చెప్పడంతో పాటు తమ దేశ పరిస్థితులను ఎగతాళి చేయడం ప్రారంభించాడు. భారత్ ఇప్పుడు చంద్రుడిలో అడుగు పెట్టింది.. అయితే మేము ఎప్పటి నుంచో చంద్రునిపై జీవిస్తున్నామని ఆ వ్యక్తి చెప్పాడు.

Viral Video: భారత్ డబ్బులు ఖర్చు చేసి ఇప్పుడు చంద్రుడిపైకి వెళ్ళింది.. మేము ఎప్పటి నుంచో ఉన్నామంటున్న పాకిస్థానీ.. ఫన్నీ వీడియో వైరల్..
Pakistani About Chandrayaan
Follow us
Surya Kala

|

Updated on: Aug 24, 2023 | 1:18 PM

భారతదేశం ఏ రంగంలో విజయం సాధించినా వెంటనే దాయాది దేశం పాకిస్తాన్ ప్రజలు రకరకాల వ్యాఖ్యలు చేస్తారు. కొందరు హాస్యాస్పదంగా చేసి వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేసే వ్యక్తులు పాకిస్థాన్‌లో ఎప్పుడూ ఉంటాడు. 2019 ప్రపంచ కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత ఫన్నీ కామెంట్స్ చేసి వైరల్ అయిన మోమిన్ షకీబ్‌ను పలు సందర్భాల్లో గుర్తుచేసుకుంటారు కూడా.. ప్రస్తుతం భారత దేశం చంద్రయాన్ 3 సాధించిన గొప్ప విజయంపై ప్రపంచ వ్యాప్తంగా స్పందనలు లభిస్తున్నాయి. అయితే పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి అందరి కంటే భిన్నంగా స్పందించిన సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు.

పాకిస్థానీ యూట్యూబర్ సోహైబ్ చౌదరి ఈ వ్యక్తిని చంద్రయాన్-3 గురించి ప్రశ్నించినప్పుడు.. అతను నవ్వుతూ తన దేశంలోని లోపాలను డిఫరెంట్ గా చెప్పడంతో పాటు తమ దేశ పరిస్థితులను ఎగతాళి చేయడం ప్రారంభించాడు. భారత్ ఇప్పుడు చంద్రుడిలో అడుగు పెట్టింది.. అయితే మేము ఎప్పటి నుంచో చంద్రునిపై జీవిస్తున్నామని ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో యూట్యూబర్ షాక్ అయి.. ఎలా అని ప్రశ్నించాడు.

ఇవి కూడా చదవండి

దీంతో మళ్ళీ పాకిస్థాన్ కు చెందిన వ్యక్తి సమాధానం చెబుతూ.. చంద్రుడిపై విద్యుత్, నీరు లేదు. అదే విధంగా మా దేశం పాకిస్తాన్ లో కూడా లేదని చెప్పాడు. అంతేకాదు చంద్రుడిపై వెళ్ళడానికి భారతదేశం ఎంతో డబ్బు ఖర్చు చేస్తోంది.. మేము ఆల్రెడీ చంద్రుడిపైనే ఉన్నాం కనుక మేమె గొప్ప అని వ్యంగంగా తన దేశాన్ని అవహేళన చేస్తూ మాట్లాడాడు.

ఇప్పుడు ఈ వీడియో చూద్దాం.

ఇప్పుడు ఈ పాకిస్థానీ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జాయ్ అనే వినియోగదారు @Joydas Twitter హ్యాండిల్ లో వీడియోను షేర్ చేశారు. పాకిస్తానీ ప్రజల హాస్యం ఎల్లప్పుడూ ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ఇప్పుడు చంద్రయాన్‌పై ఈ వ్యక్తి స్పందన మరింతగా ఆకట్టుకుంది.

ఆగస్టు 23, బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్ 3  విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయి భారతదేశం చరిత్ర సృష్టించిందన్న సంగతి తెలిసిందే. ఇలా చంద్రుడి దక్షిణ ధృవంలో అడుగు పెట్టిన మొదటి దేశం భారత్ గా చరిత్ర సృష్టించింది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..