Travel India: సెప్టెంబరులో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారా.. ట్రావెలింగ్‌కు బెస్ట్ ప్లేసెస్ మీ కోసం

ప్రకృతి అంటే అందరికి ఇష్టం.. ఏ మాత్రం సెలవులు దొరికినా సరే వివిధ ప్రదేశాలను సందర్శించాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో సెప్టెంబరులో ఏదైనా ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. ఈ ప్రదేశాలను సందర్శించండి. అయితే సెప్టెంబరులో ఎక్కడికైనా వెళ్లాలని కోరుకుంటుంటే.. ఈ నెలలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. భారతదేశంలోని చాలా ప్రాంతాలు పచ్చదనంతో నిండిపోయి అందంగా కనిపిస్తాయి. ఈ ప్రదేశాలు సెప్టెంబరులో ప్రయాణించడానికి ఉత్తమమైనవి.

Surya Kala

| Edited By: Vimal Kumar

Updated on: Sep 05, 2023 | 3:49 PM

సెప్టెంబర్ నెలలో రుతుపవనాలు అంటే వర్షాకాలం దాదాపు ముగిసిపోతుంది. విశేషమేమిటంటే ఈ సమయంలో భారతదేశంలోని చాలా ప్రాంతాలు పచ్చదనంతో కనువిందు చేస్తాయి. అయితే ఈ నెలలో  సందర్శించగల ప్రదేశాల గురించి మీకు తెలియజేస్తాము.

1 / 5
జైపూర్, రాజస్థాన్: రాజస్థాన్ రాజధాని అంటే పింక్ సిటీ జైపూర్ ఒక చిన్న ట్రిప్ కోసం వెళ్లేందుకు గొప్ప ప్రదేశం. పింక్ సిటీలో చూడవలసినవి చాలా ఉన్నాయి. ఇక్కడి ఆహారం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు జైపూర్ వెళుతున్నట్లయితే బడి చౌపర్, ఛోటీ చౌపర్ వంటి ప్రసిద్ధ మార్కెట్లలో షాపింగ్ చేయడం గొప్ప అనుభూతినిస్తుంది. 

2 / 5
మౌంట్ అబూ: సెప్టెంబర్‌లో మౌంట్ అబూ అందం మరింత పెరుగుతుంది. ఇక్కడ సూర్యాస్తమయం సమయంలో భాగస్వామితో సెల్ఫీ తీసుకుంటే మరింత అందంగా జీవితంలో నిలుస్తుంది. ఇక్కడ ట్రెక్కింగ్, క్యాంపింగ్ కాకుండా మీరు లవర్ పాయింట్, దెల్వాడ జైన్ టెంపుల్, అర్బుదా దేవి టెంపుల్ చూడవచ్చు. మీరు ఢిల్లీలోని సరాయ్ రోహిల్లా, పాత ఢిల్లీ లేదా న్యూఢిల్లీ నుండి ఇక్కడికి రైలు ప్రయాణం ద్వారా చేరుకోవచ్చు. 

3 / 5
బృందావన్, ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లో అనేక మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది శ్రీ కృష్ణుని నివాసమైన బృందావనం. మతపరమైన తీర్థయాత్రలే కాకుండా, బృందావన్‌లో అనేక ఇతర అందమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. మధుర-బృందావన్ పర్యటన చిన్న ప్రయాణానికి ఉత్తమమైనది.

4 / 5
కునో నేషనల్ పార్క్: మధ్యప్రదేశ్‌లో అనేక జాతీయ పార్కులు అంటే నేషనల్ పార్కులు ఉన్నాయి. వీటిలో అతిపెద్దది కునో నేషనల్ పార్క్..  ఇది చిరుత కారణంగా కొంత కాలం క్రితం ముఖ్యాంశాలలో కూడా వచ్చింది. ఈ పార్క్ అందం ఎవరినైనా ఆకట్టుకుంటుంది. 

5 / 5
Follow us