Beauty Care Tips: చర్మం ముడుతలు తగ్గి మెరుపు కోసం బొప్పాయి మంచి ఎంపిక.. స్మూత్ స్కిన్ కోసం ఎలా అప్లై చేయాలంటే..

పండిన బొప్పాయి చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచి, చర్మాన్ని డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. పండిన బొప్పాయిని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మంపై ముడుతలను నివారిస్తుంది. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. మచ్చలను తొలగిస్తుంది. పండిన బొప్పాయిని ముఖానికి ఎలా అప్లై చేయాలి.. ఈ రోజు కొన్ని స్కిన్ కేర్ చిట్కాల గురించి తెలుసుకుందాం.. 

Surya Kala

| Edited By: Vimal Kumar

Updated on: Jan 05, 2024 | 5:48 PM

పండిన బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోగాల బారిన పడకుండా చేస్తుంది. నోటిలో పుళ్లు వచ్చి ఇబ్బంది పడుతుంటే పండిన బొప్పాయి బెస్ట్ రెమిడీ. పండిన బొప్పాయి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి  సహాయపడుతుంది. చర్మాన్ని వృద్ధాప్యం నుండి కాపాడుతుంది.

1 / 7
పొడి చర్మం కలవారు పండిన బొప్పాయిలో తేనె కలిపి రాసుకోవచ్చు. అందులో 1 చెంచా పచ్చి పాలను కలపండి. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని మృదువుగా అప్లై చేయండి. ఈ మిశ్రమం స్కిన్ ని మృదువుగా మార్చడానికి సహాయపడుతుంది. మచ్చలను కూడా తొలగిస్తుంది.

2 / 7
మొటిమల సమస్యలతో ఇబ్బంది పడేవారు పండిన బొప్పాయిలో తేనె, నిమ్మరసం కలిపి రాసుకోవాలి. అందులో గంధపు పొడి లేదా ముల్తానీ మట్టిని కూడా కలపవచ్చు. 10-15 నిమిషాలు అలాగే ఉంచి.. సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. 

3 / 7
ముఖానికి తాజాదనాన్ని తిరిగి తీసుకురావడానికి ఫ్రూట్ ఫేస్ ప్యాక్ ఉత్తమం. పండిన బొప్పాయి, దోసకాయ , అరటిపండును కలిపి పేస్ట్‌గా చేసి స్మూత్ ఫేస్ ప్యాక్‌ను తయారు చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ చర్మంలోని అదనపు జిడ్డును తొలగించి కాంతిని పెంచుతుంది.

4 / 7
పండిన బొప్పాయి తెరుచుకున్న రంధ్రాల సమస్యను కూడా తొలగిస్తుంది. పండిన బొప్పాయితో గుడ్డులోని తెల్లసొన కలపాలి. ఈ ఫేస్ ప్యాక్ ను మీ ముఖంపై 15 నిమిషాల పాటు ఉంచి కడిగేయండి. వారానికోసారి ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగిస్తే తెరుచుకున్న రంధ్రాలు తగ్గుతాయి.

5 / 7
పండిన బొప్పాయి జిడ్డు చర్మాన్ని నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. పండిన బొప్పాయిని ముద్దగా చేసుకోవాలి. అందులో నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. ఈ ఫేస్ ప్యాక్ స్కిన్ టోన్ మెరుగుపరచడంలో బాగా సహాయపడుతుంది. మీరు ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి 2-3 సార్లు ఉపయోగించవచ్చు.

6 / 7
టాన్ తొలగించడానికి, పండిన బొప్పాయిని టమోటా పేస్ట్‌తో కలపండి. మీరు అందులో చిటికెడు పసుపు పొడిని కలపవచ్చు. ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి 2-3 సార్లు ఉపయోగించడం వల్ల చర్మంలోని ట్యాన్ మొత్తం తొలగిపోతుంది. ఇది మచ్చలను కూడా తగ్గిస్తుంది.

7 / 7
Follow us