Eswar Chennupalli

Eswar Chennupalli

Bureau Chief - TV9 Telugu

parameswara.chennupalli@tv9.com

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 22 ఏళ్ల అనుభవం ఉంది. అప్పటి సంచలన దిన పత్రిక వార్త లో క్రైమ్ రిపోర్టర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి ఈనాడు జర్నలిజం స్కూల్ లో 2006-2007 బ్యాచ్ విద్యార్థిగా శిక్షణ పూర్తయింది. 2008 – 2009 లో మా టీవీ స్టేట్ బ్యూరో రిపోర్టర్ గా, 2009 – 2014 వరకు టీవీ9 లో కరెస్పాండెంట్ గా, బ్యూరో చీఫ్ గా హైదరాబాద్, విశాఖ, విజయవాడ, ఢిల్లీ లో పనిచేసిన అనుభవం. 2014 – 19 వరకు డెక్కన్ క్రానికల్ లో స్పెషల్ కరస్పాండెంట్ గా ముఖ్యమంత్రి కార్యాలయ బీట్ రిపోర్టర్ గా పనిచేసిన అనుభవం. 2019 లో హెచ్. ఎం. టీ. వీ. స్టేట్ బ్యూరో చీఫ్ గా స్వల్పకాలం పనిచేసిన అనంతరం 2021 మార్చ్ నుంచి టీవీ9 – ఉత్తరాంధ్ర బ్యూరో చీఫ్ గా పనిచేస్తూ ఉన్నాను.

Read More
Visakhapatnam: విశాఖలో బెంగాలీ విద్యార్థిని మృతిపై అనుమానాలు.. టీవీ9 వరుస కథనాలతో ఎట్టకేలకు స్పందించిన సీసీ..

Visakhapatnam: విశాఖలో బెంగాలీ విద్యార్థిని మృతిపై అనుమానాలు.. టీవీ9 వరుస కథనాలతో ఎట్టకేలకు స్పందించిన సీసీ..

రితి సాహా అనుమానస్పద వ్యవహారంపై టీవీ9 ప్రసారం చేసిన పరిశోధనాత్మక కథనాలకు విశాఖ నగర పోలీసులు స్పందించారు. అనుమానాలపై విశాఖ నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఆకాష్ బైజూస్‌లో రితి సాహా నీట్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతోందనీ, కళాశాల యాజమాన్యమే వాళ్ళింటికి వెళ్లి ఆ అమ్మాయికి నీట్ కోచింగ్ ఇస్తామని విశాఖ తెచ్చారని, బాధ్యత అంతా మాదే అని చెప్పి తెచ్చినట్లు తల్లి తండ్రులు వివరించినట్లు సీపీ తెలిపారు. బెంగాల్ నుంచి వచ్చాక..

Vizag: అప్పన్న హుండీలో 100 కోట్ల చెక్.. బ్యాంక్‌కు పంపి తనిఖీ చేయగా..

Vizag: అప్పన్న హుండీలో 100 కోట్ల చెక్.. బ్యాంక్‌కు పంపి తనిఖీ చేయగా..

లక్షా, కోటి  కాదు.. ఏకంగా 100 కోట్ల చెక్‌ను విశాఖ సింహాద్రి అప్పన్న హుండీలో వేశాడు హుండీ లెక్కింపు సందర్భంగా ఆ చెక్ చూసి అధికారులు స్టన్ అయ్యారు. వివరాలు చూడగా.. ఆ చెక్... బొడ్డేపల్లి రాధాకృష్ణ అనే వ్యక్తి పేరు మీద ఉంది. అయితే సేవింగ్స్ ఖాతం నుంచి 100 కోట్ల దానం ఇవ్వడంపై ఆలయ అధికారులకు డౌట్ వచ్చింది. దాన్ని బ్యాంకుకు తీసుకెళ్లి చెక్ చేయగా.. అస్సలు ట్విస్ట్ రివీల్ అయ్యింది.  ఏకంగా 100 కోట్లకు చెక్‌  హుండీలో వేసి ఆ భక్తుడి ఖాతాలో కేవలం 17 రూపాయలే ఉన్నట్లు బ్యాంకు అధికారులు వెల్లడించారు. దీంతో ఆలయ సిబ్బంది కంగుతిన్నారు. ఇవాళ బ్యాంక్‌కు అధికారికంగా చెక్ పంపి లిఖిత పూర్వకంగా..అన్ని వివరాలు తీసుకోనున్నారు టెంపుల్ అధికారులు. అతడు ఉద్దేశ్యపూర్వకంగానే హుండీలో చెక్‌ వేసి ఉంటే.. చర్యలు తప్పవన్నారు అధికారులు. 

Cancelled Trains List: మీరు ప్రయాణించాలనుకుంటున్న రైళ్లన్నీ దాదాపుగా రద్దే! కారణం ఏంటంటే..

Cancelled Trains List: మీరు ప్రయాణించాలనుకుంటున్న రైళ్లన్నీ దాదాపుగా రద్దే! కారణం ఏంటంటే..

ఇటీవల కాలంలో విశాఖ కేంద్రంగా నడిచే పలు రైళ్లు పెద్ద సంఖ్యలో రద్దు అవుతున్నాయ్.. దీంతో రైల్వే ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. విజయవాడ డివిజన్ తో పాటు వాల్తేర్ డివిజన్ లో నిరంతరం ఈ రద్దు ప్రకటన సాధారణ అంశంగా మారిపోయింది. రైళ్లలో ప్రయాణం అంటే ఆ రైలు ఎక్కి గమ్యం చేరేదాకా గ్యారెంటీ లేకుండా పోయిందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ట్రాక్ పునరుద్దరణ పనులు కావచ్చు, డబ్లింగ్ పనులు కావచ్చు, సిగ్నలింగ్ అభివృద్ది చేసే పనులు కావచ్చు దాదాపు ఆరు నెలలుగా విస్తృతంగా జరుగుతూ ఉన్న నేపథ్యంలో ప్రతీ..

West Bengal Student : విశాఖలో విద్యార్దిని అనుమానాస్పద మృతి.. కలకత్తా లో కేసు నమోదు.. బెంగాల్ సీఎం సీరియస్‌

West Bengal Student : విశాఖలో విద్యార్దిని అనుమానాస్పద మృతి.. కలకత్తా లో కేసు నమోదు.. బెంగాల్ సీఎం సీరియస్‌

రితీ సాహా మృతి పై అనుమానస్పద మృతిగా సెక్షన్ 174 ఐపీసీ కింద కేసు నమోదు చేశాం. ఫోరెన్సిక్ నివేదిక అందాల్సి ఉంది. ఆ నివేదిక ను బట్టి తదుపరి విచారణ ఉంటుందన్నారు విశాఖ డీసీపీ విద్యాసాగర్ నాయుడు. సాధారణంగా ఒక రాష్ట్రంలో జరిగిన ఘటనలపై వేరే రాష్ట్రంలో కేసులు నమోదు కావడం అరుదు..అలాంటిది కలకత్తా లో కేసు నమోదు కావడం, ఇక్కడ స్థానిక పోలీసుల పై ఆరోపణలు రావడం లాంటి పరిణామాల పై విస్తృత చర్చే సాగుతోంది. ఈ వ్యవహారంలో పోలీస్ ఉన్నతాధికారుల పాత్రపైనా ఆరోపణలు రావడం గమనార్హం.

Andhra Pradesh: ఆ బీచ్‌కు వెళ్తే బాదుడే బాదుడు?.. బెంబేలెత్తిపోతున్న పర్యాటకులు! అన్నట్టు ఫీజులు చూశారా..

Andhra Pradesh: ఆ బీచ్‌కు వెళ్తే బాదుడే బాదుడు?.. బెంబేలెత్తిపోతున్న పర్యాటకులు! అన్నట్టు ఫీజులు చూశారా..

సుదూర తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే అత్యంత సుందరమైన బీచ్. అందుకే రాష్ట్రంలో అన్ని బీచ్‌ల కంటే అక్కడకే ఎక్కువగా పర్యాటకులు వస్తారు. దీంతో ఆ బీచ్ ను కాస్త డెవలప్ చేయాలనుకుంది పర్యాటక శాఖ. వెంటనే దానికి బ్లూ ఫ్లాగ్ టైటిల్ ఇచ్చేసింది. అక్కడ పర్యావరణ హిత కార్యక్రమాలకు మాత్రమే అనుమతి అంటూ ప్లాస్టిక్ లాంటి వాటిని నిషేదించింది. అలాగే అంతర్జాతీయ బీచ్ ల తరహాలో మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించాయి కేంద్ర..

Visakhapatnam: గుజరాత్‌ నుంచి విశాఖ జూ‌కి ఆడ సింహం.. సక్కర్‌బాగ్‌కి 2 అడవి కుక్కలు.. ఎందుకంటే..?

Visakhapatnam: గుజరాత్‌ నుంచి విశాఖ జూ‌కి ఆడ సింహం.. సక్కర్‌బాగ్‌కి 2 అడవి కుక్కలు.. ఎందుకంటే..?

Visakhapatnam: విశాఖ జూలో సింహాల సంఖ్యను పెంచడానికి బ్రీడింగ్ కోసం ఒక ఆడసింహం అత్యావశ్యకం అయింది. ఈ కారణంగానే గుజరాత్‌లోని సక్కర్‌బాగ్ జూ నుంచి ఓ ఆట సింహాన్ని విశాఖకు తీసుకొచ్చారు. అలాగే విశాఖ జూలో వయసు మీరిన 2 పులులు, ఒక జీబ్రా, ఒక జిరాఫీ వరుసగా మృతి చెందడంతో కొంత ఆందోళన నెలకొంది. అన్నీ వయసు మళ్ళి, అనారోగ్యంతో వచ్చిన సమస్యల వల్ల మృతి చెందినప్పటికీ జూలో ఏం జరుగుతోందంటూ పలు ఆరోపణలు వినిపించాయి. అదే సమయంలో జూలో ముఖ్యమైన జంతువులు..

Simhachalam Appanna Temple: అప్పన్న ఆలయంలో స్వర్ణ కాంతుల ధ్వజ స్తంభం.. బంగారు తాపడం పనుల ప్రారంభం

Simhachalam Appanna Temple: అప్పన్న ఆలయంలో స్వర్ణ కాంతుల ధ్వజ స్తంభం.. బంగారు తాపడం పనుల ప్రారంభం

విశాఖనగరంలోని ప్రముఖ బంగారం, వస్త్రాల వ్యాపార సంస్థ అధినేత మావూరి వెంకటరమణ ధ్వజ స్తంభం స్వర్ణతాపడానికి అయ్యే ఖర్చును విరాళంగా సమర్పిస్తున్నారు. చెన్నైకి చెందిన స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ ధ్వజస్తంభం స్వర్ణ తాపడం పనులు చేపట్టనుంది. ఈనేపథ్యంలో ధ్వజస్తంభం స్వర్ణతాపడం పనులు శుక్రవారం సాంప్రదాయంగా ప్రారంభమయ్యాయి.

Pawan Kalyan: పొత్తులపై స్పష్టత ఇచ్చిన పవన్.. లేటేస్ట్ ఫార్ములా ఇదే

Pawan Kalyan: పొత్తులపై స్పష్టత ఇచ్చిన పవన్.. లేటేస్ట్ ఫార్ములా ఇదే

విశాఖ లో వారాహీ యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ పొత్తులపై సంచలన కామెంట్స్ చేసారు. ప్రస్తుతం పొత్తులు చర్చల దశలో ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‎లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేది జనసేన - బీజేపీ కూటమినా లేక జనసేన - టీడీపీ - బీజేపీ కూటమి ప్రభుత్వమా అన్నది త్వరలోనే తేలుతుందని వివరించారు. ఏర్పాటు అయ్యే ప్రభుత్వం ఏదైనా సరే కానీ ప్రస్తుత ప్రభుత్వాన్ని మార్చే విధంగా మాత్రం పొత్తులు ఉంటాయంటూ మరోసారి తన ఉద్దేశాన్ని స్పష్టం చేశారు.

విశాఖ పర్యటనతో పవన్ కళ్యాణ్ సాధించింది శూన్యం – వారాహీ యాత్రపై వైవీ సుబ్బారెడ్డి పైర్

విశాఖ పర్యటనతో పవన్ కళ్యాణ్ సాధించింది శూన్యం – వారాహీ యాత్రపై వైవీ సుబ్బారెడ్డి పైర్

జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖ లో నిర్వహించిన వారాహీ యాత్ర అధికార వైఎస్సార్సీపీ జన సేన ల మధ్య మాటల యుద్దానికి తెర లేపింది. దాదాపు ఏడు రోజులపాటు సాగిన ఈ వారాహి యాత్ర లో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పై తీవ్రంగా విరుచుకు పడ్డారు.

Caravan Tourism: విహారం మరింత ఆహ్లాదం.. అరకులో కారవాన్ టూరిజం.. మీరూ రెడీనా..

Caravan Tourism: విహారం మరింత ఆహ్లాదం.. అరకులో కారవాన్ టూరిజం.. మీరూ రెడీనా..

Caravan tourism in AP: సెగ్మెంట్ టూరిస్టులు ఇక్కడకు రావడానికి ఆసక్తి ప్రదర్శించడం లేదని పర్యాటక శాఖ గుర్తించింది. కేరళ, కర్ణాటక వెళ్ళేందుకు ఎందుకు మొగ్గు చూపుతున్నారో అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా కొత్త ప్యాకేజ్ లు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా విదేశాల్లో బాగా పాపులర్ అయిన కారవాన్ టూరిజం అమలుకు సన్నాహాలు చేస్తోంది. కేరళలో ఇటీవల దీనిని ప్రారంభించారు.ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో కారవాన్‌లోనే వంట చేసుకుని, అందులోనే రాత్రి బస చేసే అవకాశం కలుగుతుంది. ట్రాన్స్ పోర్ట్, వ్యుపాయింట్ దగ్గర స్టే వంటి సౌకర్యం ఏపీ టూరిజం ఏర్పాటు చేస్తోంది.

Pawan Kalyan: సీఎం కుర్చీలో కూర్చోడానికి రెడీ.. పొత్తుల గురించి పవన్ కీలక కామెంట్స్

Pawan Kalyan: సీఎం కుర్చీలో కూర్చోడానికి రెడీ.. పొత్తుల గురించి పవన్ కీలక కామెంట్స్

పొత్తుల గురించి పవన్‌ కల్యాణ్‌ తాజా వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వం గురించి పవన్‌ కల్యాణ్‌ యథాలాపంగా మాట్లాడారా? లేకుంటే మనస్సులోని మాటను బయటపెట్టారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి పవన్‌ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే కుదిరితే టీడీపీ, బీజేపీతో, లేదంటే బీజేపీ లేదా టీడీపీతో పొత్తు కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ పొత్తుల పర్వం ఎప్పటికీ తేలుతుందో చూడాలి. 

Visakhapatnam: తెల్ల పులికి జన్మదిన వేడుకలు.. 5 కేజీల కేక్‌తో ఘనంగా నిర్వహించిన జూ అధికారులు..

Visakhapatnam: తెల్ల పులికి జన్మదిన వేడుకలు.. 5 కేజీల కేక్‌తో ఘనంగా నిర్వహించిన జూ అధికారులు..

Visakhapatnam: మీరెన్నో జన్మదిన వేడుకలు చూసి ఉంటారు. కానీ పులి జన్మదిన వేడుకల్ని మీరు ఎప్పుడైనా చూశారా..? పోనీ విన్నారా..? జాతీయ జంతువుగా చెప్పుకునే పులి దగ్గరకు వెళ్లాలంటేనే ప్రాణభయం. అలాంటి పులికి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు విశాఖ జూ అధికారులు. అవును, ఈ వార్త మనందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే వార్త. విశాఖ జూలో ఐదేళ్ల పులికి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు అక్కడి అధికారులు. విశాఖలోని ఇందిరా గాంధీ ప్రదర్శనశాల