Andhra Pradesh: ఆ బీచ్‌కు వెళ్తే బాదుడే బాదుడు?.. బెంబేలెత్తిపోతున్న పర్యాటకులు! అన్నట్టు ఫీజులు చూశారా..

సుదూర తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే అత్యంత సుందరమైన బీచ్. అందుకే రాష్ట్రంలో అన్ని బీచ్‌ల కంటే అక్కడకే ఎక్కువగా పర్యాటకులు వస్తారు. దీంతో ఆ బీచ్ ను కాస్త డెవలప్ చేయాలనుకుంది పర్యాటక శాఖ. వెంటనే దానికి బ్లూ ఫ్లాగ్ టైటిల్ ఇచ్చేసింది. అక్కడ పర్యావరణ హిత కార్యక్రమాలకు మాత్రమే అనుమతి అంటూ ప్లాస్టిక్ లాంటి వాటిని నిషేదించింది. అలాగే అంతర్జాతీయ బీచ్ ల తరహాలో మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించాయి కేంద్ర..

Andhra Pradesh: ఆ బీచ్‌కు వెళ్తే బాదుడే బాదుడు?.. బెంబేలెత్తిపోతున్న పర్యాటకులు! అన్నట్టు ఫీజులు చూశారా..
Rushikonda Beach Parking Fee
Follow us
Eswar Chennupalli

| Edited By: Srilakshmi C

Updated on: Aug 21, 2023 | 11:03 AM

నంద్యాల, ఆగస్టు 21: సుదూర తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే అత్యంత సుందరమైన బీచ్. అందుకే రాష్ట్రంలో అన్ని బీచ్‌ల కంటే అక్కడకే ఎక్కువగా పర్యాటకులు వస్తారు. దీంతో ఆ బీచ్ ను కాస్త డెవలప్ చేయాలనుకుంది పర్యాటక శాఖ. వెంటనే దానికి బ్లూ ఫ్లాగ్ టైటిల్ ఇచ్చేసింది. అక్కడ పర్యావరణ హిత కార్యక్రమాలకు మాత్రమే అనుమతి అంటూ ప్లాస్టిక్ లాంటి వాటిని నిషేదించింది. అలాగే అంతర్జాతీయ బీచ్ ల తరహాలో మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.

బ్లూ ఫ్లాగ్ టాగ్ కింద కేంద్ర పర్యాటక శాఖ 7.5 కోట్ల నిధులను కూడా ఇచ్చింది. దాంతో కొంత మేర మౌలిక సదుపాయాలను పెంచే ప్రయత్నం జరిగింది. హైజెన్ వాతావరణంలో బీచ్, స్నానాలు గదులు, బట్టలు మార్చుకునేందుకు గదులు, నాణ్యమైన తిను బండారాలు, రోడ్లు, మంచి పార్కింగ్ స్లాట్స్ … అలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించే ప్రయత్నం చేసింది. అంతవరకు బానే ఉంది కానీ నెలకు 2.5 లక్షల మంది వరకు బీచ్ కు వస్తుండడం తో ఎంట్రీ ఫీజ్ గా 10 రూపాయలు పెట్టాలని అనుకుంది.. అంతే పెద్ద ఎత్తున నిరసనలు రావడం తో రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరం తో ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు

పార్కింగ్ ఫీజ్ రెట్టింపు

ఎంట్రీ ఫీజ్ ను పెట్టాలన్న ఆలోచనను విరమించుకున్న టూరిజం శాఖ దానిపై పెట్టిన 7.5 కోట్ల ఖర్చును తిరిగి రాబట్టుకునే దానిపై దృష్టి సారించింది. అక్కడకు రోజూ కనీసం 1000 వరకు కార్లు, ఆటోలు వందల సంఖ్యలో టూ వీలర్ లు వస్తుంటాయి కాబట్టి వాటిపై పార్కింగ్ ఫీజ్ ను వసూలు చేయాలని ప్రణాళిక చేసింది. అంతే ఇకపైన రుషికొండ బీచ్లోకి వెళ్లే వాహనాల పార్కింగ్ రుసుం ఆదివారం నుంచి పెంచేసింది. పరిమిత సంఖ్యలో వచ్చే ఆటోలకు మాత్రం పాత ధరలనే కొనసాగించగా మిగిలిన వాహనాలకు రెట్టింపు ఛార్జ్ ను వసూలు చేస్తున్నారు. బస్ లకు గతంలో 50 ఉండగా ప్రస్తుతం 100, కార్ ల కు 20 ఉంటే దాన్ని ఏకంగా 150 శాతం పెంచి 50 శాతం, టూ వీలర్ లకు 10 రూపాయల స్థానంలో 20 చేయగా అటోలకు మాత్రం 20 రూపాయలు గానే ఉంచారు.

ఇవి కూడా చదవండి

పర్యాటకుల నిరసన

ఇటీవలనే ఎంట్రీ ఫీజ్ పెట్టబోగా పర్యాటకుల నుంచి వచ్చిన నిరసనకు భయపడి వెనక్కు తగ్గిన ప్రభుత్వం ప్లాన్ బీను అమలు చేస్తూ తీసుకున్న నిర్ణయం పైనా పర్యాటకులు మండి పడుతున్నారు. అధిక ఆదరణ ఉన్న పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలలో ఇలాంటి నిర్ణయాలు సరికాదంటూ వాపోతున్నారు. రుషికొండ బీచ్ విషయంలో పర్యాటక శాఖ తక్షణం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని పాత ధరలే కొనసాగించాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు. ఎంట్రీ ఫీజ్ సందర్భంలో వచ్చిన నిరసన సెగలు గుర్తించి వెనక్కి తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఎలా వ్యవహరించనుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.