Pawan Kalyan: సీఎం కుర్చీలో కూర్చోడానికి రెడీ.. పొత్తుల గురించి పవన్ కీలక కామెంట్స్
పొత్తుల గురించి పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వం గురించి పవన్ కల్యాణ్ యథాలాపంగా మాట్లాడారా? లేకుంటే మనస్సులోని మాటను బయటపెట్టారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి పవన్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే కుదిరితే టీడీపీ, బీజేపీతో, లేదంటే బీజేపీ లేదా టీడీపీతో పొత్తు కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ పొత్తుల పర్వం ఎప్పటికీ తేలుతుందో చూడాలి.
నేను సీఎం కావాలనుకుంటున్నాను, ఆ వైపున ఉన్నా నేనే, ఈ వైపున ఉన్నా నేనే అంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. విశాఖలో వారాహి యాత్ర ముగిసిన సందర్భంగా పవన్ కల్యాణ్ చాలా సేపు మీడియాతో మాట్లాడారు. బిహార్ కంటే ఏపీలో నేరాల సంఖ్య పెరిగిందని, ఉత్తరాంధ్రలో సహజ వనరుల దోపిడి జరుగుతోందని ఆరోపణలు చేశారు. అదే క్రమంలో భవిష్యత్‌లో ఏర్పడే ప్రభుత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో వైపు సీఎం పదవి చేపట్టేందుకు తాను సంసిద్ధంగా ఉన్నానని, కాని, తాను ఒక్కడికే అనుకుంటే సరిపోదని ప్రజల్లో నమ్మకం రావాలని పవన్ కల్యాణ్ అన్నారు. అది ఎన్నికల తర్వాతే జరుగుతుందని తెలిపారు. భవిష్యత్‌లో NDA కూటమిలో ఏయే పార్టీలు ఉంటాయనేది కూడా ఇందులో కీలకమని పవన్ కల్యాణ్ అన్నారు. మొత్తానికి పవన్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే కుదిరితే టీడీపీ, బీజేపీతో, లేదంటే బీజేపీ లేదా టీడీపీతో పొత్తు కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ పొత్తుల పర్వం ఎప్పటికీ తేలుతుందో చూడాలి.