Visakhapatnam: విశాఖలో బెంగాలీ విద్యార్థిని మృతిపై అనుమానాలు.. టీవీ9 వరుస కథనాలతో ఎట్టకేలకు స్పందించిన సీసీ..

రితి సాహా అనుమానస్పద వ్యవహారంపై టీవీ9 ప్రసారం చేసిన పరిశోధనాత్మక కథనాలకు విశాఖ నగర పోలీసులు స్పందించారు. అనుమానాలపై విశాఖ నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఆకాష్ బైజూస్‌లో రితి సాహా నీట్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతోందనీ, కళాశాల యాజమాన్యమే వాళ్ళింటికి వెళ్లి ఆ అమ్మాయికి నీట్ కోచింగ్ ఇస్తామని విశాఖ తెచ్చారని, బాధ్యత అంతా మాదే అని చెప్పి తెచ్చినట్లు తల్లి తండ్రులు వివరించినట్లు సీపీ తెలిపారు. బెంగాల్ నుంచి వచ్చాక..

Visakhapatnam: విశాఖలో బెంగాలీ విద్యార్థిని మృతిపై అనుమానాలు.. టీవీ9 వరుస కథనాలతో ఎట్టకేలకు స్పందించిన సీసీ..
Vizag Minor Girl Death Case
Follow us
Eswar Chennupalli

| Edited By: Vimal Kumar

Updated on: Sep 08, 2023 | 12:06 PM

విశాఖ లోసంచలనం కలిగించిన బెంగాలీ విద్యార్దిని రితి సాహా అనుమానస్పద మృతిపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. రితి సాహా అనుమానస్పద వ్యవహారంపై టీవీ9 ప్రసారం చేసిన పరిశోధనాత్మక కథనాలకు విశాఖ నగర పోలీసులు స్పందించారు. అనుమానాలపై విశాఖ నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఆకాష్ బైజూస్‌లో రితి సాహా నీట్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతోందనీ, కళాశాల యాజమాన్యమే వాళ్ళింటికి వెళ్లి ఆ అమ్మాయికి నీట్ కోచింగ్ ఇస్తామని విశాఖ తెచ్చారని, బాధ్యత అంతా మాదే అని చెప్పి తెచ్చినట్లు తల్లి తండ్రులు వివరించినట్లు సీపీ తెలిపారు. బెంగాల్ నుంచి వచ్చాక ఆకాష్ బైజూస్ వాళ్ళు ఇంటర్ ఒక కళాశాలలో చేర్పించి, మరో చోట హాస్టల్‌లో చేర్పించి, ఆకాష్ బైజూస్‌లో నీట్ కోచింగ్ ఇస్తున్నట్టు తెలిపారు సీపీ. ఆ క్రమంలో జూలై 14 వ తేదీ రాత్రి సాధనా హాస్టల్ టెర్రస్‌పై నుంచి కింద పడిపోయిందనీ, హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు.

ఆకాష్ బైజూస్ నిర్లక్ష్యం వల్లే కుమార్తె హత్యకు గురైందని తల్లితండ్రుల ఫిర్యాదు..

జూలై నెల 14 వ తేదీ రాత్రి 10.30 గంటలకు సాధనా హాస్టల్ 4వ అంతస్తు పై నుంచి రితి సాహా దూకినట్టు అధికారులు చెబుతున్నారు. హాస్టల్ వార్డెన్ సమాచారం మేరకు విశాఖ వచ్చిన తల్లి తండ్రులు తమ కుమార్తె స్థితికి ఆకాష్ బైజూస్ వాళ్ళ నిర్లక్ష్యమే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. రితి సాహాది ఆత్మహత్య కాదని, ఆమెపై హత్యాయత్నం జరిగిందని రితి సాహా తండ్రి 4 వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కానీ అలా కేసు నమోదు కాకపోవడంపైనే ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే, సరైన సాక్ష్యాలు లేనందునే ఆకాష్ బైజూస్ పై కేసు నమోదు చేయలేదన్నారు సీపీ. దీంతో పోలీస్ విచారణపై అనుమానం వచ్చిన తల్లి తండ్రులు హై కోర్టుకు వెళ్లారు. దీనిపై హైకోర్టు ఒక కమిషన్‌ను నియమించింది. వాళ్లకు అన్ని సాక్షాధారాలు ఇస్తున్నామన్నారు సీపీ త్రివిక్రమ్. అదే సమయంలో ఇందులో ఎవరిని కాపాడాల్సిన అవసరం లేదన్న సీపీ.. 4వ పట్టణ పోలీసులపై వచ్చిన ఆరోపణలపై ఏసీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కలకత్తాలో కేసు నమోదైనట్లు సమాచారం లేదన్న త్రివిక్రమ్ వర్మ.. వాళ్ళ రాష్ట్రం వాళ్ళు కాబట్టి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ స్పందించి ఉండోచ్చన్నారు.

రితి సాహా మృతి కేసులో అనుమానాలు ఎన్నో..

వెస్ట్ బెంగాల్ మైనర్ బాలిక రితి సాహా అనుమానస్పద మృతి కేసులో అనుమానాలు ఎన్నో ఉన్నాయి. పోలీసుల విచారణలో లోపాలు కూడా అనేకం కనిపిస్తున్నాయని బాధితుల ఆరోపణ. బాధితుల ఆరోపణలకి బలం చేకూరేలాగా సీసీ ఫుటేజ్‌తో సహా పలు ఆధారాలు చూపిస్తుండడం విశేషం. టెర్రస్ మీదకి వెళ్ళినప్పుడు ఫ్రాక్ లాంటి ఓ డ్రెస్ వేసుకున్న మైనర్ బాలిక కింద పడిన సమయంలో మరొక డ్రెస్ ఒంటి‌పై ఉన్నట్టు తల్లితండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు రూమ్‌లో విద్యార్ధినుల మధ్య ఘర్షణ జరిగిందని, టెర్రస్ పైకి వెళ్ళిన తర్వాత ఏదైనా జరిగి ఉండవచ్చన్నది తల్లి తండ్రుల అనుమానం. ఆ దిశగా ఫిర్యాదు చేసినా అసలు పట్టించుకోలేదన్నది అభ్యంతరం. అందులో చాలా ఇరుకు భవనాల మధ్య పైనుంచి దూకితే అక్కడ పడే అవకాశం లేదని, దీనిపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని తల్లి తండ్రులు చెబుతున్నారు. స్థానిక పోలీసులను కళాశాల యాజమాన్యం మేనేజ్ చేసిందని, అందుకే ఇలా వ్యవహరిస్తున్నారంటూ తల్లి తండ్రులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో కోర్టు ఒక కమిషన్ ను నియమించి, ఈ నెల 25 లోపు నివేదిక కోరింది. ఇదే అంశాన్ని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దృష్టికి తీసుకెళ్లడంతో విచారణ చేయిస్తామని హామీ ఇచ్చింది.

ఈ మొత్తం వ్యవహారంలో బాధితుల అనుమానాలను నివృత్తి చేయడంలో స్థానిక పోలీసులు విఫలం కావడం, అదే సమయంలో కళాశాల యాజమాన్యానికి సహకరిస్తున్నట్టు అనుమానాలు రావడంతో తల్లి తండ్రులు న్యాయం కోసం హై కోర్టుతో పాటు బెంగాల్ సీఎం ను కలిసినట్టు అర్థం అవుతోంది. దీనిపై నిష్పాక్షిక దర్యాప్తును ఆశిద్దాం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..