T Nagaraju

T Nagaraju

Special Correspondent - TV9 Telugu

nagaraju.thirthala@tv9.com

గుంటూరు జిల్లాలో 14 ఏళ్ళుగా టివి రిపోర్టర్ గా పని చేస్తున్నాను. 2009లో గుంటూరు జిల్లా టివి9 రిపోర్టర్ గా చేరాను. 2009లో కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో జిల్లా రిపోర్టర్ గా కవర్ చేశారు. 2014, 2019 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను జిల్లా రిపోర్టర్ గా కవర్ చేశాను. అంతకు ముందు మా టివిలో సబ్ ఎడిటర్ గా పని చేశాను. మాటివిలో చేరక ముందు ప్రజా శక్తిలో అచ్చంపేట మండల రిపోర్టర్ గా పని చేశాను. పుస్తక పఠనం నా హాబీ. చరిత్రకు సంబంధించిన పుస్తకాలు చదవటం అంటే ఇష్టం.

Read More
Andhra Pradesh: పెద్దాయన మంచి మనసు.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాన్ని మెచ్చుకుని రూ.1.20 లక్షలు విరాళం

Andhra Pradesh: పెద్దాయన మంచి మనసు.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాన్ని మెచ్చుకుని రూ.1.20 లక్షలు విరాళం

Guntur News: గుంటూరు జీజీహెచ్ రిఫరల్ ఆసుపత్రిగా కొనసాగుతుంది. దీర్ఘకాలిక, మొండి, అత్యంత క్లిష్టమైన వైద్యం కోసం ఇక్కడికి ప్రజలు వస్తుంటారు. దీంతో రామకృష్ణ వెంటనే గుంటూరులోని జీజీహెచ్‎కు వచ్చాడు. ఆ తర్వాత ఆర్థోపెడిక్ విభాగంలో చేరాడు. ఆ విభాగం ప్రొఫెసర్ అద్దెపల్లి శ్రీనివాసరావు రోగిని పరీక్షించాడు. పూర్తి స్థాయిలో వైద్యం అందించేందుకు ఆసుపత్రి వైద్యులు సిద్దమైయ్యారు. ప్రభుత్వ ఉద్యోగి కావటంతో ఈహెచ్ఎస్ కింద అడ్మిట్ చేసుకున్నారు.

Mangalagiri MLA RK Ramakrishna: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే ఆర్కే.. గర్భిణీని తన కాన్వాయ్‌లో ఆసుపత్రికి చేరవేత

Mangalagiri MLA RK Ramakrishna: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే ఆర్కే.. గర్భిణీని తన కాన్వాయ్‌లో ఆసుపత్రికి చేరవేత

కళ్లముందే ఆటో పడిపోయింది. పడిపోయిన ఆటో మహిళా ప్రయాణీకులున్నారు. అదే దారిలో వెలుతున్న ఎమ్మెల్యే సరిగ్గా అదే సమయానికి ప్రమాదం జరిగిన చోటుకి చేరుకున్నారు. ఆటో పడిపోయిన విషయాన్ని గమనించి వెంటనే కాన్వాయ్ నిలిపివేయించారు. తన సిబ్బందితో కలిసివెంటనే ఆటోవద్దకు..

AP News: ఆ హాస్పిటల్‌కి క్యూ కట్టిన గర్భిణులు.. 24 గంటల్లో ఏకంగా 21 కాన్పులు! అందరికీ సాధారణ ప్రసవాలే..

AP News: ఆ హాస్పిటల్‌కి క్యూ కట్టిన గర్భిణులు.. 24 గంటల్లో ఏకంగా 21 కాన్పులు! అందరికీ సాధారణ ప్రసవాలే..

గర్భిణులంతా ఆ హాస్పిటల్ కే క్యూ కట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఇరవై మందికి పైగా ప్రెగ్నెంట్ వుమెన్స్ ఆ ఆసుప్రతికి వచ్చారు. వచ్చిన వారందరికీఇరవై నాలుగు గంటల్లోనే కాన్పులు చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ఆసుపత్రి అరుదైన రికార్డును..

Sravana Masam 2023: శ్రావణ మాసం రావడంతో వేటి ధరలు పెరుగుతున్నాయో తెలుసా ?..

Sravana Masam 2023: శ్రావణ మాసం రావడంతో వేటి ధరలు పెరుగుతున్నాయో తెలుసా ?..

శ్రావణ మాసం.. శుభ కార్యాల మాసం... పెండ్లిండ్ల దగ్గర నుండి అన్ని రకాల శుభకార్యాలు శ్రావణ మాసంలో జరుగుతుంటాయి. తెలుగింట శుభకార్యం అంటే కొన్ని తప్పక ఉండాల్సిందే. అరటి పండ్డు, తమలపాకులు, నిమ్మకాయలు తప్పకుండా శుభకార్యంలో ఉండాల్సిందే. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావటంతో వీటి ధరలు పెరిగిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో డెల్టా ప్రాంతం అరటి, తమలపాకు, నిమ్మకాయల సాగుకు పెట్టింది పేరు.

Ambassador Car: అంబాసిడర్ కారులో కూరగాయల వ్యాపారం.. నోరెళ్లబెట్టిన జనాలు!

Ambassador Car: అంబాసిడర్ కారులో కూరగాయల వ్యాపారం.. నోరెళ్లబెట్టిన జనాలు!

కారు అద్దెకు తిప్పుకోవడం ఒకప్పుడు స్వయం ఉపాధి. ప్రస్తుతం కార్ల ధరలు దిగిరావడంతో స్వంత వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో అద్దె కార్లకు డిమాండ్ తగ్గింది. అంతేకాదు అద్దె కార్ల వ్యాపారంలోకి పెద్ద పెద్ద కంపెనీలుఅడుగుపెట్టాయి. దీంతో మధ్య తరగతి యువకులు అద్దె కార్ల వ్యాపారం నుండి బయటకు వెళ్లిపోతున్నారు. ఇక పాత తరం కార్లను అద్దెకు తీసుకెళ్లే వారే ఉండటం లేదు. అటువంటి కార్గలో అంబాసిడర్ ఒకటి. అయితే తనకు స్వయం ఉపాధి కల్పించిన కారును వదులుకోవడం ఇష్టంలేని వ్యక్తి సరికొత్తగా ఆలోచించాడు. కార్లు ఎలాగూ అద్దెకు పోవడం లేదు కాబట్టి కొత్త వ్యాపారం..

Andhra Pradesh: నకిలీ బంగారంతో బ్యాంకులో లోన్ తీసుకున్న దుండగులు.. ఎలా దొరికారో తెలిస్తే షాక్ అవ్వాల్సందే

Andhra Pradesh: నకిలీ బంగారంతో బ్యాంకులో లోన్ తీసుకున్న దుండగులు.. ఎలా దొరికారో తెలిస్తే షాక్ అవ్వాల్సందే

గుంటూరులో నకిలీ బంగారంతో బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే గురజాల పట్టణంలోని ఒక బ్యాంక్ కు సాధారణ ఖాతాదారుడిలానే ఒక వ్యక్తి వచ్చాడు. గోల్డ్ లోన్ కావాలని అడిగాడు. బ్యాంక్ సిబ్బంది సరేనంటూ బంగారు ఆభరణాలైన గాజులను చెక్ చేశారు. అన్ని బాగానే ఉన్నాయనుకున్న సిబ్బంది ఖాతాదారుడికి లక్షన్నర రూపాయల రుణం ఇచ్చారు. అనంతరం అక్కడ నుండి ఖాతాదారుడు వెళ్లిపోయాడు.

Andhra Pradesh: ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ ఉద్యోగి ఆటకట్టించిన రోగి.. చివరికి

Andhra Pradesh: ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ ఉద్యోగి ఆటకట్టించిన రోగి.. చివరికి

గుంటూరు జీజీహెచ్‎కి నిత్యం అనేక మంది రోగులు చికిత్స నిమిత్తం వస్తుంటారు. దాదాపు పదిహేను వందల బెడ్స్ ఉన్న రిఫరల్ ఆసుపత్రి ఇది. ప్రతిరోజూ సుమారు మూడు వేల మంది ఓపి రోగులు ఆసుపత్రికి వస్తుంటారు. వీరందరిలాగే ఈరోజు ఒక మహిళ ఆర్ధోపెడిక్ ఓపీ విభాగానికి వచ్చింది. చేతివేలు విరిగిపోవడంతో కట్టు కట్టించుకోవడానికి వచ్చింది. అయితే అది కట్టుకడుతున్న సమయంలో నర్సింగ్ ఉద్యోగి ఐదు వందల రూపాయలివ్వాలని డిమాండ్ చేసింది.

Forbes Magazine: ఫోర్బ్స్ మ్యాగజైన్ వెబ్ సైట్ లో తెలుగు కుర్రాడు

Forbes Magazine: ఫోర్బ్స్ మ్యాగజైన్ వెబ్ సైట్ లో తెలుగు కుర్రాడు

ట్రాఫిక్ ఎక్కువుగా ఉన్న సమాచారాన్ని వాహనదారులకు ఎప్పటికప్పుడు చేరవేసి వారి ప్రయాణాన్ని సులభతరం చేయడమే ఈ టెక్నాలజీ ఉద్దేశం ఇందుకోసం వీధి దీపాల స్థంబాలకు ఆటో మ్యాటిక్ కెమెరాలను అమర్చి వాటి ద్వారా సమాచారాన్ని సేకరించి దాన్ని వాహనదారులకు ఎప్పటికప్పుడు అందించేవారు.  దీంతో వాహనదారులు ఏ రూట్ లో ఎక్కువ వాహనాల రద్దీ ఉందో తెలుసుకొని వారి ప్రయాణ గమనాన్ని మార్చుకునేవారు. ఈ టెక్నాలజీ గురించి తెలుసుకున్న టెక్ స్టార్స్ వంటి వెంచర్..

Varalakshmi Vratham: నేడు మొదటి శ్రావణ శుక్రవారం.. అమ్మవారికి పసుపుకొమ్మలతో అలంకరణ

Varalakshmi Vratham: నేడు మొదటి శ్రావణ శుక్రవారం.. అమ్మవారికి పసుపుకొమ్మలతో అలంకరణ

నంబూరుకు చెందిన కిషోర్ రెడ్డి, వాణి దంపతులు, చిలకలూరిపేటకు చెందిన శంకర్ మరొక భక్తుడు కలిసి 400 కిలోల పసుపు కొమ్మలును అమ్మవారికి సమర్పించారు. వీటితో మొదటి శ్రావణ శుక్రవారం ప్రత్యేక అలంకరణ చేశారు. పసుపుతో అలంకరించిన అమ్మవారిని దర్శించుకుంటే తాము సౌభాగ్యంతో విలసిల్లుతామని మహిళలు భావిస్తారు. దీంతో భక్తుల సాయంతో మొదటి రోజు పసుపు కొమ్మలుతో విశేష అలంకరణ చేశారు.

Independence Day 2023: వినూత్న రీతిలో జాతీయ జెండా ఎగుర వేసిన తెలుగు యువత

Independence Day 2023: వినూత్న రీతిలో జాతీయ జెండా ఎగుర వేసిన తెలుగు యువత

అమరావతి, ఆగస్టు 15: గుంటూరు జిల్లాలోని లోకేష్ స్వంత నియోజకవర్గమైన మంగళగిరి లో పాదయాత్ర ప్రారంభమైంది. నిన్న సాయంత్రం నిడమర్రు వద్ద క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలుగు యువత నేతలు క్యాంపు కార్యాలయం వద్ద వినూత్న రీతిలో జాతీయ జెండా ఎగుర వేశారు.హాట్ ఎయిర్ బెలూన్‌లో గాలిలోకి ఎగిరి అక్కడ జాతీయ జెండాను ఎగురవేసి సెల్యూట్ చేశారు. తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి హాట్ ఎయిర్ బెలూన్ లో భూమిపై నుండి యాభై అడుగుల పైకి చేరుకున్నారు..

AP Politics: మొన్న ఎండు మిర్చి మాల.. ఇప్పుడు టమాటాల దండ.. లోకేష్‌కు గుంటూరులో ఘన స్వాగతం..

AP Politics: మొన్న ఎండు మిర్చి మాల.. ఇప్పుడు టమాటాల దండ.. లోకేష్‌కు గుంటూరులో ఘన స్వాగతం..

Guntur News: టమాటాలతో భారీ గజ మాల చేయించడం టీడీపీలో చర్చకు దారి తీసింది. వినూత్న కార్యక్రమం అంటూనే ఏకంగా గజ మాల చేయించడంపై గుసగుసలాడుకుంటున్నారు. తెలుగు యువత నేతలు మాత్రం కూరగాయలు సామాన్యుడికి అందుబాటులో లేవన్న విషయం అందరకి తెలిసేలా గజమాల ఏర్పాటు చేశామంటున్నారు. టమాటా గజమాలే కాదు రాజధాని నియోజకవర్గంలోకి అడుగు పెట్టే సమయంలో ప్రసిద్ది చెందిన గుంటూరు మిర్చితో కూడా గజమాలతోనే స్వాగతం పలికారు.

ఆంధ్రాలోని ఆ పట్టణానికి ఈ రోజే స్వాత్రంత్య్ర దినోత్సవం.. అమర వీరులకు ఘన నివాళులు..

ఆంధ్రాలోని ఆ పట్టణానికి ఈ రోజే స్వాత్రంత్య్ర దినోత్సవం.. అమర వీరులకు ఘన నివాళులు..

Independence Day: సువిశాల ఈ భారతదేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన సందర్భంగా ప్రతి ఏటా ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకలను యావత్ దేశ ప్రజలు జరుపుకుంటారు. అయితే భారతదేశం కంటే ముందుగానే భారత్‌లోని ఓ ప్రదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని మీకు తెలుసా..? ఈ నేపథ్యంలోనే ఆగస్టు 15 కంటే మూడు రోజుల ముందుగానే అంటే ఆగస్టు 12న అక్కడ స్వాతంత్య్ర వేడుకలు కూడా జరుగుతాయి. ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడో కాదు.. గుంటూరు జిల్లాలోని తెనాలి. అవును, తెనాలికి దేశం కంటే ముందుగానే స్వాతంత్య్రం వచ్చింది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..