AP News: ఆ హాస్పిటల్‌కి క్యూ కట్టిన గర్భిణులు.. 24 గంటల్లో ఏకంగా 21 కాన్పులు! అందరికీ సాధారణ ప్రసవాలే..
గర్భిణులంతా ఆ హాస్పిటల్ కే క్యూ కట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఇరవై మందికి పైగా ప్రెగ్నెంట్ వుమెన్స్ ఆ ఆసుప్రతికి వచ్చారు. వచ్చిన వారందరికీఇరవై నాలుగు గంటల్లోనే కాన్పులు చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ఆసుపత్రి అరుదైన రికార్డును..
గుంటూరు, ఆగస్టు 24: గర్భిణులంతా ఆ హాస్పిటల్ కే క్యూ కట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఇరవై మందికి పైగా ప్రెగ్నెంట్ వుమెన్స్ ఆ ఆసుప్రతికి వచ్చారు. వచ్చిన వారందరికీఇరవై నాలుగు గంటల్లోనే కాన్పులు చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ఆసుపత్రి అరుదైన రికార్డును సాధించింది. సోమవారం సాయంత్రం ఐదుగంటల నుండి గర్భిణులు రావడం మొదలు పెట్టారు. వచ్చిన వారందరికీ వెంటవెంటనే కాన్పులు కూడా జరిగాయి. 21 మంది మొదటి కాన్పు కోసం వచ్చిన వారు తొమ్మది మంది ఉండగా వారిలో ఆరుగురుకి సాధారణ కాన్పు అయింది. మిగిలిగిన ముగ్గురికి సిజేరియన్ ఆపరేషన్ చేశారు. మిగిలిన పన్నెండు మంది రెండు, మూడు కాన్పులకోసం ఆసుపత్రి వచ్చారు. వారిలో గతంలోనే సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్న వారు ఉండటంతో వారికి సిజేరియన్ ఆపరేషన్ చేశారు.
పల్నాడు జిల్లాలో ఒక్క రోజుల్లో ఇంతమంది గర్భిణులు ఎప్పుడు ఏ ఆసుపత్రికి ఇరవై నాలుగు గంటల సమయంలో రాలేదని ఆసుపత్రి డాక్డర్ అశోక్ కుమార్ చెప్పారు. తమపై నమ్మకంగా వచ్చిన వారందరికి ఎటువంటి సమస్యలు రాకుండా ఆసుపత్రి సిబ్బంది, డాక్టర్లు వెను వెంటనే కాన్పులు చేశామన్నారు. డాక్టర్ రమ్యహారిక గర్భిణులు ఎక్కువుగా వస్తుండటాన్నిగమనించి అందరికి మెరుగైన వైద్యం అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకన్నామన్నారు. మొత్తం ఇరవై ఒక్క మందిలోపదకొండుమందికి మగ పిల్లలు పుట్టగా, మిగిలిన పదిమందికి ఆడపిల్లలు పుట్టినట్లు వైద్యురాలు రమ్యహారిక చెప్పారు.
తల్లులు, పిల్లలు అందరకూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. సాధరణంగా ప్రతి నెలలో డెభ్బై ఎనభై కాన్పులు చేస్తుంటామని అయితే అనూహ్యంగా సోమవారం సాయంత్రంనుండి గర్భిణులు వరుసగా వస్తూనే ఉన్నారన్నారు. అయితే ఎవరికి ఎటువంటి సమస్య తలెత్తకుండా వైద్యులతో పాటు ఆసుపత్రి నర్సింగ్ సిబ్బంది కూడా అప్రమత్తంగా పనిచేయడంతో అందరికి సరైనసమయంలో మెరుగైన వైద్యం అందించగలిగామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.