Forbes Magazine: ఫోర్బ్స్ మ్యాగజైన్ వెబ్ సైట్ లో తెలుగు కుర్రాడు

ట్రాఫిక్ ఎక్కువుగా ఉన్న సమాచారాన్ని వాహనదారులకు ఎప్పటికప్పుడు చేరవేసి వారి ప్రయాణాన్ని సులభతరం చేయడమే ఈ టెక్నాలజీ ఉద్దేశం ఇందుకోసం వీధి దీపాల స్థంబాలకు ఆటో మ్యాటిక్ కెమెరాలను అమర్చి వాటి ద్వారా సమాచారాన్ని సేకరించి దాన్ని వాహనదారులకు ఎప్పటికప్పుడు అందించేవారు.  దీంతో వాహనదారులు ఏ రూట్ లో ఎక్కువ వాహనాల రద్దీ ఉందో తెలుసుకొని వారి ప్రయాణ గమనాన్ని మార్చుకునేవారు. ఈ టెక్నాలజీ గురించి తెలుసుకున్న టెక్ స్టార్స్ వంటి వెంచర్..

Forbes Magazine: ఫోర్బ్స్ మ్యాగజైన్ వెబ్ సైట్ లో తెలుగు కుర్రాడు
Kotamraju Prajwal
Follow us
T Nagaraju

| Edited By: Subhash Goud

Updated on: Aug 19, 2023 | 4:53 PM

ఫోర్బ్స్ మ్యాగజైన్ గురించి అందరికి తెలిసిందే. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత్య ప్రతిభావంతులైన ముప్పై ఏళ్ల యువకులు ప్రారంభించిన స్టార్టప్ కంపెనీపై ఫోర్బ్స్ మ్యాగజైన్ తన వెబ్ సైట్ లో వార్త కథనాన్ని ప్రచురించింది. ఆ స్టార్టప్ కంపెనీ స్థాపించిన ఇద్దరిలో ఒకరు తెలుగు కుర్రాడు కావటం విశేషం. గుంటూరుకు చెందిన కాటంరాజు సాయి ప్రజ్వల్ వెంకటేశ్వర బాలకుటీర్ లో పదవ తరగతి వరకూ చదువుకున్నాడు. ఆ తర్వాత కేఎల్ యూనివర్సిటీలో బిటెక్ పూర్తి చేశాడు. అనంతరం పిజి చేసేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ చదువుతున్న సమయంలో అతని స్నేహితుడైన జోర్డాన్ జస్టిన్ తో కలిసి ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం కొత్త టెక్నాలజీని అభివృద్ది చేశారు.

ట్రాఫిక్ ఎక్కువుగా ఉన్న సమాచారాన్ని వాహనదారులకు ఎప్పటికప్పుడు చేరవేసి వారి ప్రయాణాన్ని సులభతరం చేయడమే ఈ టెక్నాలజీ ఉద్దేశం ఇందుకోసం వీధి దీపాల స్థంబాలకు ఆటో మ్యాటిక్ కెమెరాలను అమర్చి వాటి ద్వారా సమాచారాన్ని సేకరించి దాన్ని వాహనదారులకు ఎప్పటికప్పుడు అందించేవారు.  దీంతో వాహనదారులు ఏ రూట్ లో ఎక్కువ వాహనాల రద్దీ ఉందో తెలుసుకొని వారి ప్రయాణ గమనాన్ని మార్చుకునేవారు. ఈ టెక్నాలజీ గురించి తెలుసుకున్న టెక్ స్టార్స్ వంటి వెంచర్ కాపిటలిస్ట్ కంపెని దీన్ని మరింతగా అభివృద్ది చేసేందుకు పన్నెండు మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది.

దీంతో ఫోర్బ్స్ మ్యాగజైన్ అత్యంత ప్రతిభావంతులైన యువ స్టార్టప్ కంపెనీ ప్రతినిధులుగా వీరిని గుర్తించి వ్యాసం ప్రచురించింది. సాయి ప్రజ్వల్ తండ్రి సుబ్బారావు కేఎల్ యూనివర్సిటీలో రిజిస్ట్రార్ గా పనిచేస్తున్నారు. తమ యూనివర్సిటీ పూర్వ విద్యార్ధి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టార్టప్ కంపెనీ ప్రతినిధుల్లో ఒకరు నిలవడం తమకు గర్వకారణంగా ఉందని యూనివర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి