Andhra Pradesh: పెద్దాయన మంచి మనసు.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాన్ని మెచ్చుకుని రూ.1.20 లక్షలు విరాళం

Guntur News: గుంటూరు జీజీహెచ్ రిఫరల్ ఆసుపత్రిగా కొనసాగుతుంది. దీర్ఘకాలిక, మొండి, అత్యంత క్లిష్టమైన వైద్యం కోసం ఇక్కడికి ప్రజలు వస్తుంటారు. దీంతో రామకృష్ణ వెంటనే గుంటూరులోని జీజీహెచ్‎కు వచ్చాడు. ఆ తర్వాత ఆర్థోపెడిక్ విభాగంలో చేరాడు. ఆ విభాగం ప్రొఫెసర్ అద్దెపల్లి శ్రీనివాసరావు రోగిని పరీక్షించాడు. పూర్తి స్థాయిలో వైద్యం అందించేందుకు ఆసుపత్రి వైద్యులు సిద్దమైయ్యారు. ప్రభుత్వ ఉద్యోగి కావటంతో ఈహెచ్ఎస్ కింద అడ్మిట్ చేసుకున్నారు.

Andhra Pradesh: పెద్దాయన మంచి మనసు.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాన్ని మెచ్చుకుని రూ.1.20 లక్షలు విరాళం
Ramakrishna And Doctors
Follow us

| Edited By: Vimal Kumar

Updated on: May 17, 2024 | 8:07 PM

గుంటూరు న్యూస్, ఆగస్టు 25: అతని పేరు సీహెచ్ రామక్రిష్ణ. కృష్ణా జిల్లా తిరువూరు సొంతూరు. ఆర్టీసి డ్రైవర్‎గా పనిచేస్తున్నాడు. పది రోజుల క్రితం విధులు ముగించుకొని బైక్‎పై ఇంటికి వెళ్తున్నాడు. అయితే అనుకోకుండా ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో రెండు కాళ్లు తొడల వద్ద విరిగిపోయాయి. అదే విధంగా తలకు దెబ్బ తగిలింది. వెంటనే రామకృష్ణను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రోగి పరిస్థితిని పరిశీలించిన వైద్యులు అత్యాధునిక పరికరాలతో ఆపరేషన్ చేయాలని.. అందుకు పది లక్షల రూపాయల వరకూ ఖర్చవుతుందని చెప్పారు. అయితే రామకృష్ణ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో ప్రైవేటు వైద్యం చేయించుకునే సాహసం చేయలేకపోయాడు. అయితే ఆ నోటా.. ఈ నోటా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి గురించి ఉన్నాడు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందిస్తారని తెలుసుకున్నాడు.

అయితే గుంటూరు జీజీహెచ్ రిఫరల్ ఆసుపత్రిగా కొనసాగుతుంది. దీర్ఘకాలిక, మొండి, అత్యంత క్లిష్టమైన వైద్యం కోసం ఇక్కడికి ప్రజలు వస్తుంటారు. దీంతో రామకృష్ణ వెంటనే గుంటూరులోని జీజీహెచ్‎కు వచ్చాడు. ఆ తర్వాత ఆర్థోపెడిక్ విభాగంలో చేరాడు. ఆ విభాగం ప్రొఫెసర్ అద్దెపల్లి శ్రీనివాసరావు రోగిని పరీక్షించాడు. పూర్తి స్థాయిలో వైద్యం అందించేందుకు ఆసుపత్రి వైద్యులు సిద్దమైయ్యారు. ప్రభుత్వ ఉద్యోగి కావటంతో ఈహెచ్ఎస్ కింద అడ్మిట్ చేసుకున్నారు. రెండు కాళ్లకు ఆపరేషన్ చేశారు. అలాగే తలకు తగిలిన దెబ్బలకు చికిత్స అందించారు. దీంతో రోగి పూర్తిగా కోలుకున్నాడు. అయితే రెండు, మూడు నెలల తర్వాత నడవగలుగుతాడని అప్పటి వరకూ వైద్యం అందించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రాణాపాయ స్థితిలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన అతనికి ధైర్యం కోల్పోకుండా వైద్యం అందించి.. తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చిన వైద్యులకు రామకృష్ణ అభినందనలు తెలిపాడు.

ప్రైవేటు ఆసుపత్రిలో పది లక్షల రూపాయలు ఖర్చయ్యే వైద్యాన్ని ఉచితంగా అందించిన ఆసుపత్రికి తనవంతుగా ఏదైనా చేయాలని రామకృష్ణ అనుకున్నాడు. ఇదే విషయాన్ని ఆసుపత్రి ఆర్థోపెడిక్ వైద్యులకు, సూపరింటిండెంట్ కిరణ్ కుమార్ చెప్పాడు. దీంతో వారంతా చర్చించుకొని ఆర్థోపెడిక్ విభాగంలో అవసరమైన పరికరాలును ఇవ్వాలని సూచించారు. దీంతో లక్షా ఇరవై వేల రూపాయలు వెచ్చించి ఆ పరికరాలను కొనుగోలు చేసి వాటిని ఆసుపత్రి వైద్యులకు అందించాడు. డిశ్చార్జి రోజునే వాటిని వారికి అందించి కృతజ్ఞతలు తెలిపాడు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే సరైన వైద్యం అందన్నది అపోహ మాత్రమేనని రామకృష్ణ అన్నారు. లక్షల రూపాయలు ఖర్చవుతుందని ప్రవేటు వైద్యులు చెబితే ప్రభుత్వ వైద్యులు ఉచితంగా చికిత్స అందించారన్నారు. ఆసుపత్రిలో సదుపాయాలు బాగున్నాయని పేద వాళ్లు తప్పకుండా వచ్చి వైద్యం చేయించుకోవాలని సూచించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..