Ambassador Car: అంబాసిడర్ కారులో కూరగాయల వ్యాపారం.. నోరెళ్లబెట్టిన జనాలు!

కారు అద్దెకు తిప్పుకోవడం ఒకప్పుడు స్వయం ఉపాధి. ప్రస్తుతం కార్ల ధరలు దిగిరావడంతో స్వంత వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో అద్దె కార్లకు డిమాండ్ తగ్గింది. అంతేకాదు అద్దె కార్ల వ్యాపారంలోకి పెద్ద పెద్ద కంపెనీలుఅడుగుపెట్టాయి. దీంతో మధ్య తరగతి యువకులు అద్దె కార్ల వ్యాపారం నుండి బయటకు వెళ్లిపోతున్నారు. ఇక పాత తరం కార్లను అద్దెకు తీసుకెళ్లే వారే ఉండటం లేదు. అటువంటి కార్గలో అంబాసిడర్ ఒకటి. అయితే తనకు స్వయం ఉపాధి కల్పించిన కారును వదులుకోవడం ఇష్టంలేని వ్యక్తి సరికొత్తగా ఆలోచించాడు. కార్లు ఎలాగూ అద్దెకు పోవడం లేదు కాబట్టి కొత్త వ్యాపారం..

Ambassador Car: అంబాసిడర్ కారులో కూరగాయల వ్యాపారం.. నోరెళ్లబెట్టిన జనాలు!
Vegetable Trading In Ambassador Car
Follow us

| Edited By: Srilakshmi C

Updated on: Aug 20, 2023 | 8:19 PM

అమరావతి, ఆగస్టు 20: కారు అద్దెకు తిప్పుకోవడం ఒకప్పుడు స్వయం ఉపాధి. ప్రస్తుతం కార్ల ధరలు దిగిరావడంతో స్వంత వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో అద్దె కార్లకు డిమాండ్ తగ్గింది. అంతేకాదు అద్దె కార్ల వ్యాపారంలోకి పెద్ద పెద్ద కంపెనీలుఅడుగుపెట్టాయి. దీంతో మధ్య తరగతి యువకులు అద్దె కార్ల వ్యాపారం నుండి బయటకు వెళ్లిపోతున్నారు. ఇక పాత తరం కార్లను అద్దెకు తీసుకెళ్లే వారే ఉండటం లేదు. అటువంటి కార్గలో అంబాసిడర్ ఒకటి. అయితే తనకు స్వయం ఉపాధి కల్పించిన కారును వదులుకోవడం ఇష్టంలేని వ్యక్తి సరికొత్తగా ఆలోచించాడు. కార్లు ఎలాగూ అద్దెకు పోవడం లేదు కాబట్టి కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్నాడు. తమ ప్రాంతంలో కూరగాయల వ్యాపారం బాగుంటుందని సలహా ఇచ్చారు. అయితే ఆ వ్యాపారం ప్రారంభించాలన్నా ఆటో కొనుగోలు చేయాలి. అందుకు చాలా మొత్తం అవసరం అవుతుంది.

ఈ సమయంలోనే పొన్నూరుకు చెందిన షేక్ రషీద్ వినూత్నంగా ఆలోచించాడు. ఏదో విధంగా కూరగాయల వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్న రషీద్ ఆటో కొనే స్తోమత లేని విషయాన్ని తోటి స్నేహితులకు చెప్పాడు. దీంతో అందరూ కలిసి అంబాసిడర్ కారులోనే కూరగాయలు అమ్మాలని నిర్ణయానికి వచ్చారు. వెంటనే తన పాత కారును షెడ్ కు తరలించాడు. అక్కడ కారు వెనుక సీటు పై బాగాన్ని తొలగించాడు. సీటును తొలగించి దానిలో మార్పులు, చేర్పులు చేశాడు. చక్కగా ఒక ప్లాట్ ఫారం తయారు చేశాడు. వాటిపై కూరగాయల బుట్టలు ఉంచేలా మార్పులు చేసుకున్నాడు.

ఒక మంచి రోజు చూసి వ్యాపారం ప్రారంభించాడు. కారు డ్రైవింగ్ సీటులో కూర్చోని పొన్నూరులోని వివిధ ప్రాంతాలకు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి అక్కడ కొద్ది సేపు వాహనాన్ని నిలిపి వ్యాపారం చేసుకుంటాడు. కూరగాయలు అమ్మిన తర్వాత మరో సెంటర్ కు వెళతాడు. ఇలా సాయంత్రానికి కూరగాయలు అమ్ముకుని ఇంటికి చేరతాడు. రషీడ్ వినూత్న ఆలోచనను పొన్నూరు పట్టణ వాసులు మెచ్చుకుంటున్నారు. ఉపాధి కోల్సోయిన మనోధైర్యం మాత్రం కోల్పోకుండా వినూత్న రీతిలో ఆలోచించి సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించిన రషీద్ అభినందనీయుడని అందరూ ప్రసంశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.