Mangalagiri MLA RK Ramakrishna: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే ఆర్కే.. గర్భిణీని తన కాన్వాయ్‌లో ఆసుపత్రికి చేరవేత

కళ్లముందే ఆటో పడిపోయింది. పడిపోయిన ఆటో మహిళా ప్రయాణీకులున్నారు. అదే దారిలో వెలుతున్న ఎమ్మెల్యే సరిగ్గా అదే సమయానికి ప్రమాదం జరిగిన చోటుకి చేరుకున్నారు. ఆటో పడిపోయిన విషయాన్ని గమనించి వెంటనే కాన్వాయ్ నిలిపివేయించారు. తన సిబ్బందితో కలిసివెంటనే ఆటోవద్దకు..

Mangalagiri MLA RK Ramakrishna: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే ఆర్కే.. గర్భిణీని తన కాన్వాయ్‌లో ఆసుపత్రికి చేరవేత
MLA RK Ramakrishna Reddy
Follow us

| Edited By: Srilakshmi C

Updated on: Aug 24, 2023 | 1:01 PM

హైదరాబాద్‌, ఆగస్టు 24: కళ్లముందే ఆటో పడిపోయింది. పడిపోయిన ఆటో మహిళా ప్రయాణీకులున్నారు. అదే దారిలో వెలుతున్న ఎమ్మెల్యే సరిగ్గా అదే సమయానికి ప్రమాదం జరిగిన చోటుకి చేరుకున్నారు. ఆటో పడిపోయిన విషయాన్ని గమనించి వెంటనే కాన్వాయ్ నిలిపివేయించారు. తన సిబ్బందితో కలిసివెంటనే ఆటోవద్దకు వెళ్లారు. ఆటోలోని మహిళలను బయటకు తీసే ప్రయత్నం చేశారు. అయితే ఆటో సైడ్ కు తిరగబడటంతో వెంటనే దాన్ని రోడ్డుపైకి తిప్పేందుకు సిబ్బందితో కలిసి ప్రయత్నించారు. ఆటో తిప్పే ప్రయత్నంలో మహిళలు ఒకరిపై మరొకరు పడటాన్ని గమనించి వారిని స్థానికుల సాయంతో కిందికి దించారు. మంగళగిరి మండలం పెదవడ్లపూడి రైల్వే గేటు వద్ద ఇదంతాచోటు చేసుకుంది .

ఈరోజు (గురువారం) ఉదయం పదిన్నర గంటల సమయంలో ఎమ్మెల్యే ఆర్కే దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు వెళుతున్నారు. అయితే వారి వాహనం కంటే ముందే ఉన్న ఆటో పెదవడ్లపూడి రైల్వే గేటు వద్ద రాగానే మలుపు తిరుగుతూ సైడ్ కు పల్టీ కొట్టింది. ఇది గమనించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రామక్రిష్ణారెడ్డి వెంటనే కాన్వాయ్ ఆపించారు. తాను దిగి ఆటోను సరిగా రోడ్డుపైకి తీసుకొచ్చారు. అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మహిళలను రక్షించారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Mla Rk Ramakrishna Reddy

MLA RK Ramakrishna Reddy

అయితే ప్రయాణీకుల్లో తొమ్మిది నెలలు నిండిన మహిళ లావణ్య కూడా ఉన్నారు. ఆమె తెనాలి ఆసుపత్రికి వెలుతున్నారు. ఆటో బోల్తా పడటంతో ఆమె నీరసపడిపోయారు. ఆమె ఆసుపత్రికి వెళ్లటం జాప్యం అయితే లోపలున్న బిడ్డకు ప్రమాదం రావచ్చ భావనతో వెంటనే ఆమెను తన కారులో ఎస్కార్ట్ ఇచ్చి వెంటనే తెనాలి ఆసుపత్రికి తరలించారు. మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే ఆర్కేను స్థానికులు అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్ చేయండి.