Vijay Deverakonda: ఓటీటీ సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల చేయనంటోన్న విజయ్‌ దేవరకొండ.. కారణమేంటటో తెలుసా?

గతేడాది అతను నటించిన పాన్‌ ఇండియా సినిమా లైగర్‌ బాక్సాఫీస్‌ వద్ద నిరాశపర్చినా రౌడీబాయ్ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. అతనితో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ హీరోయిన్లు సైతం పోటీపడుతున్నారు. కాగా ఇప్పుడు విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా ఖుషీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సమంత ఇందులో హీరోయిన్‌గా నటించింది. శివనిర్మాణ దర్శకత్వం వహించారు. తెలుగుతో సహా మొత్తం ఏకంగా 5 భాషల్లో ఖుషి సినిమాను విడుదల చేయనున్నారు.

Vijay Deverakonda: ఓటీటీ సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల చేయనంటోన్న  విజయ్‌ దేవరకొండ.. కారణమేంటటో తెలుసా?
Vijay Deverakonda
Follow us
Basha Shek

|

Updated on: Aug 20, 2023 | 12:45 PM

గాడ్ ఫాదర్ లేకుండా స్వశక్తితో ఈ సినిమా ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న టాలీవుడ్‌ ప్రముఖ నటుల్లో విజయ్ దేవరకొండ ఒకరు. గతేడాది అతను నటించిన పాన్‌ ఇండియా సినిమా లైగర్‌ బాక్సాఫీస్‌ వద్ద నిరాశపర్చినా రౌడీబాయ్ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. అతనితో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ హీరోయిన్లు సైతం పోటీపడుతున్నారు. కాగా ఇప్పుడు విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా ఖుషీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సమంత ఇందులో హీరోయిన్‌గా నటించింది. శివనిర్మాణ దర్శకత్వం వహించారు. తెలుగుతో సహా మొత్తం ఏకంగా 5 భాషల్లో ఖుషి సినిమాను విడుదల చేయనున్నారు. తాజాగా హైదరాబాద్‌ వేదికగా ఖుషి సినిమా ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్బంగా ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌, వెబ్ సిరీస్‌ల గురించి ఓపెన్‌గా మాట్లాడాడు రౌడీ బాయ్‌. OTT ప్లాట్‌ఫామ్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లను చూడటం ఆనందించే విజయ్, స్వయంగా వెబ్ సిరీస్‌లు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. భారీ 70ఎంఎం స్క్రీన్‌పై ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నాడు. అందుకే తనను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ‘నేను వెబ్ సిరీస్‌లు చేయనని ఖరాఖండిగా చెప్పేశాడు విజయ్‌ దేవరకొండ. అతను మాత్రమే కాదు తెలుగు ఇండస్ట్రీలోని చాలా మంది పెద్ద నటులు ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ ఫార్మాట్‌లో పనిచేయడానికి ఆసక్తి చూపించడం లేదు.

తన సినిమాలతో కోట్లాది మంది అభిమానులను అలరించిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై కనిపించే ఉద్దేశ్యంతో లేడు. ట్రైలర్ లాంచ్ సందర్బంగా విజయ్ చేస్తున్న హిందీ సినిమా ప్రాజెక్ట్స్ గురించి విజయ్ ని అడగ్గా, తనకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయని, అయితే ప్రస్తుతానికి తాను ఏ సినిమాకు ఓకే చెప్పలేదని, అయితే భవిష్యత్‌లో తప్పకుండా మంచి హిందీ సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఖుషి సినిమా సెప్టెంబర్‌ 1న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న ఈ ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్‌, గ్లింప్స్‌ ఓ రేంజ్‌లో హిట్‌ అయ్యాయి. ఖుషి తర్వాత పరశురాం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్‌. గీత గోవిందం తర్వాత వీరిద్దిరి కాంబినేషన్‌లో వస్తోన్న రెండో సినిమా ఇది. మృణాళ్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

విజయ్ దేవరకొండ, సమంతల ఖుషి సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి..

విజయ్ దేవరకొండ ఇన్ స్టా పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.